చెదలను నివారిస్తామని చెప్పి.. బెడ్ రూమ్ లోకి వెళ్లిన దుండగుడు.. తరువాత ఏం జరిగిందంటే ?

By Asianet NewsFirst Published May 6, 2023, 7:02 AM IST
Highlights

చెదలను నివారిస్తామని వెళ్లి ఓ వ్యక్తి దొంగతనానికి పాల్పడ్డాడు. బెడ్ రూమ్ లో ఉన్న బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. దీంతో పోలీసులు అతడిని విచారించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

ఆయన ఓ ప్రైవేట్ రిటైర్డ్ ఎంప్లాయ్. వయస్సు 69 సంవత్సరాలు. వయస్సు మీద పడటంతో ఇంట్లోనే ఉంటున్నారు. అయితే ఇంట్లో చెదలు పట్టడంతో దీనిని నివారించేందుకు ఓ సంస్థకు కాల్ చేశాడు. తన ఇంట్లో ఉన్న సమస్యను వివరించాడు. దీంతో ఆ కంపెనీకి చెందిన వ్యక్తి వచ్చి ఇంట్లోని నగలను ఎత్తుకెళ్లాడు. ఈ ఘటన తమిళనాడులోని చోటు చేసుకుంది.

పాక్‌కు రహస్య సమాచారం అందించిన డీఆర్‌డీవో శాస్త్రవేత్త.. అరెస్టు చేసిన మహారాష్ట్ర ఏటీఎస్

వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె కొలతూరు ప్రాంతానికి చెందిన 69 ఏళ్ల నటరాజన్‌ ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తూ రిటైర్డ్ అయ్యారు. ఆయనకు అదే ప్రాంతంలో సొంత ఇళ్లు ఉంది. ఆ ఇంట్లో ఇటీవల చెదల బెదడ ఎక్కువైంది. దీంతో వీటిని వదిలించుకోవాలని ఆయన అనుకున్నారు. దీని కోసం కోడంబాక్కంలో ఉన్న ఓ ప్రైవేటు కంపెనీని ఆశ్రయించాడు. వారికి తన సమస్య మొత్తం వివరించాడు.

కేరళ తొలి ట్రాన్స్ జెండర్ బాడీ బిల్డర్ ప్రవీణ్ నాథ్ ఆత్మహత్య.. మనస్థాపంతో భార్య కూడా ఆత్మహత్యాయత్నం..ఎందుకంటే

దీంతో ఆ కంపెనీకి చెందిన 31 ఏళ్ల దయాలన్ అనే వ్యక్తి వచ్చాడు. ఇంట్లోకి ప్రవేశించి చెదలను నివారించేందుకు మందు చల్లాడు. తరువాత బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. అందులో ఉన్న ఐదు సవర్ల బంగారు ఆభరణాలను అతడు చోరీ చేశాడు. తరువాత ఏమీ తెలియనట్టు అక్కడి నుంచి పని పూర్తి చేసుకొని వెళ్లిపోయాడు.

హనీమూన్ కోసం కులు మనాలీ వెళ్లి.. పారాగ్లైడింగ్ చేస్తూ లోయలో పడిన హైదరాబాద్ మహిళా టెక్కీ..

ఆ కంపెనీ వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తరువాత నటరాజన్‌ బెడ్ రూమ్ లోకి వెళ్లాడు. కొంత అనుమాస్పదంగా అనిపించడంతో బీరువా తీసి చూశాడు. అందులో బంగారు నగలు కనిపించకుండాపోయే సరికి ఒక్క సారిగా ఆందోళన చెందాడు. లబోదిబోమంటూ వెంటనే పోలీసులును ఆశ్రయించాడు. వారికి జరిగిన విషయం మొత్తం చెప్పాడు. దీంతో పోలీసులు దయాలన్ ను అనుమానించారు. అతడిని విచారించారు. దీంతో తానే ఆ దొంగతనానికి పాల్పడినట్టు అంగీకరించాడు. తరువాత నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

click me!