టీనేజ్ బాలిక కిడ్నాప్, ఆపై అత్యాచారం.. ఇద్ద‌రు అరెస్టు

Published : May 06, 2023, 03:01 AM IST
టీనేజ్ బాలిక కిడ్నాప్, ఆపై అత్యాచారం.. ఇద్ద‌రు అరెస్టు

సారాంశం

Gurugram: మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దుండ‌గుల‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 18న సందీప్, అశుతోష్ లు టీనేజీ బాలిక‌ను అపహరించి హర్యానాలోని గురుగ్రామ్ కు తీసుకెళ్లారని డిప్యూటీ ఎస్పీ మహ్మద్ ఫహీమ్ తెలిపారు.  

Teenage girl kidnapped and then raped : మైనర్ బాలికను కిడ్నాప్ చేసి.. అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు దుండ‌గుల‌ను గురుగ్రామ్ పోలీసులు అరెస్టు చేశారు. ఏప్రిల్ 18న సందీప్, అశుతోష్ లు టీనేజీ బాలిక‌ను అపహరించి హర్యానాలోని గురుగ్రామ్ కు తీసుకెళ్లారని డిప్యూటీ ఎస్పీ మహ్మద్ ఫహీమ్ తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. హ‌ర్యానాలోని గురుగ్రామ్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల బాలికను అపహరించి అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ఏప్రిల్ 18న సందీప్, అశుతోష్ లు ఆమెను అపహరించి హర్యానాలోని గురుగ్రామ్ కు తీసుకెళ్లారని డిప్యూటీ ఎస్పీ మహ్మద్ ఫహీమ్ తెలిపారు. బాలిక గురుగ్రామ్ లో కనిపించడంతో ఆమె వాంగ్మూలం ఆధారంగా పోలీసులు నిందితుల‌ను అరెస్టు చేశారు.

ఇద్దరు నిందితులను గురువారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భారత శిక్షాస్మృతి సెక్షన్ 376 (అత్యాచారం), లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) చట్టం స‌హా ప‌లు ఇతర సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

అత్యాచార యత్నం కేసులో వ్యక్తి అరెస్టు.. 

లైంగిక దాడి కేసులో బెయిల్ పై జైలు నుంచి బయటకు వచ్చిన 42 ఏళ్ల వ్యక్తిని మరో అత్యాచారయత్నం కేసులో కొచ్చి పోలీసులు అరెస్టు చేశారు. బుధవారం సాయంత్రం పుత్తువైపేలో ఓ మహిళపై లైంగిక దాడికి యత్నించిన నంజరకల్ కు చెందిన ఆనందన్ ను పోలీసులు అరెస్టు చేశారు. ప‌ని ముగించుకుని ఇంటికి వస్తున్న మ‌హిళ వద్దకు నిందితుడు తన స్కూటర్ ప‌నిప్ర‌దేశానికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రముఖ ఆయిల్ కంపెనీలో ఉద్యోగం ఖాళీగా ఉందని యువతిని నమ్మించి ఉద్యోగం కోసం సంబంధిత అధికారులను కలవడానికి తనతో పాటు రావాల‌ని కోరాడు. 

అత‌ని మాట‌లు న‌మ్మిన యువ‌తి నిందితుడి స్కూట‌ర్ పై ఎక్కింది. ఈక్ర‌మంలోనే అత‌ను యువ‌తిని ఏకాంత ప్ర‌దేశానికి తీసుకెళ్లాడు. ఇది గమ‌నించిన యువ‌తి.. అత‌ని దురుద్దేశం తెలుసుకుని స్కూట‌ర్ ను ఆప‌మ‌ని కోరింది. ప‌ట్టించుకోని నిందితుడు స్కూట‌ర్ ను ఆప‌లేదు. దీందో బాధితురాలు వాహ‌నంపై నుంచి దూకింది. ఈ క్ర‌మంలోనే ఆమెకు గాయాలు అయ్యాయి. బాధితురాలి ఫిర్యాదు తో కేసు న‌మోదుచేసుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..