సాక్షి మాలిక్, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ ఉన్న ఫొటో వైరల్.. వేధిస్తే ఆమె పెళ్లికెందుకు పిలించిందని సోషల్ మీడియాలో చర్చ

By Asianet News  |  First Published May 1, 2023, 1:11 PM IST

రెజ్లర్ సాక్షి మాలిక్, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమెను అతడు వేధిస్తే పెళ్లికి ఎందుకు పిలిచిందని, నవ్వుతూ ఎందుకు ఉందని ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. దీనికి సమాధానాలు చెబుతూ పలువురు యూజర్లు సాక్షి మాలిక్ కు మద్దతుగా నిలుస్తున్నారు. 


డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని రెజ్లర్ల చేస్తున్న నిరసనల మధ్య బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తో ఉన్న సాక్షి మాలిక్ పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది నెటింట్లో చర్చకు దారి తీసింది. అతడితో లైంగిక వేధింపులకు గురైతే, తిరిగి అతడినే ఎందుకు పెళ్లికి ఆహ్వానించిందని పలువురు ట్విట్టర్ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. 

దారుణం.. బాకీ కట్టలేదని ఆరో తరగతి చదివే కూతురును తీసుకెళ్లి రెండో పెళ్లి చేసుకున్న 40 ఏళ్ల వ్యక్తి..

Latest Videos

‘‘సాక్షి మాలిక్.. 2015-16లో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన లైంగికంగా వేధించాడని చెబుతున్నారు. కానీ ఆమె పెళ్లి 2017లో జరిగింది. దీనికి అతడు హాజరయ్యాడు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే.. ఏ ఆడపిల్ల అయినా తనను వేధించినవాడిని పెళ్లికి పిలుస్తుందా ?’’ అని ఓ ట్విట్టర్ యూజర్ సాక్షి, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ కలిసి ఉన్న పెళ్లి ఫొటోను ట్వీట్ పోస్టు చేస్తూ క్యాప్షన్ పెట్టాడు. 

కేంద్ర మంత్రి జీ కిష‌న్ రెడ్డి అస్వస్థతకు కారణమేమిటో తేల్చేసిన డాక్టర్లు..

ఈ ట్వీట్ కు సింగర్ చిన్మయి శ్రీపాద స్పందించారు. సాక్షి మాలిక్ కు మద్దతుగా నిలిచారు. ఆ ట్వీట్ ను రీటీట్వ్ చేస్తూ.. ‘‘ అవును, ఆమె కచ్చితంగా చేస్తుంది. ఆమెను వేధించే వ్యక్తి పవర్ పొజిషన్ లో ఉన్నప్పుడు, ఆమెకు వేరే ఛాయిస్ ఉండదు. మహిళలు తమ కుటుంబాల్లో వేధింపులకు గురైనా, వారి నుంచి ఎంతో బాధను అనుభించినా అంతా బాగానే ఉన్నట్టు నటించాల్సి వస్తోంది. ఇలా వేధింపులు చేసేవారు, రేపిస్టు మద్దతుదారులందరూ ఈ భూమ్మీద నుంచి కనుమరుగవుతారని నేను నిజంగా ఆశిస్తున్నాను’’ అని ఆమె పేర్కొన్నారు. 

YES SHE WILL!!! WHEN HER MOLESTER IS IN A POSITION OF POWER SHE HAS NO BLOODY CHOICE. Women have had to suffer molesters in their own family and have to suffer their presence and pretend as if everything is OK.
I really hope all these molester / rapist supporters can vanish off… https://t.co/8BLyGtmNX2

— Chinmayi Sripaada (@Chinmayi)

ఈ ఫొటోపై మరో ట్విట్టర్ యూజర్.. ‘‘లైంగిక వేధింపులు జరిగినప్పుడు మీరు ఫిర్యాదు చేయలేదు. అలాగే దానిని రుజువూ చేయలేదు. ఎలాంటి ఆధారమూ లేదని ఆరోపణలపై యంత్రాంగం ఎలా చర్య తీసుకోవాలి ?  పైగా మీరు ఆరోపణలు చేస్తున్న వ్యక్తితో మీరు తరువాతి కాలంలో చిరునవ్వుతో, ఆనందంగా ఉన్నారు. ఇది ఎలా సాహాయపడుతుంది’’ అని ట్వీట్ చేశారు. ఇలా ఈ ఫొటోపై ట్విట్టర్లో చర్చ జరుగుతోంది. 

కాలేజీ ఫీజు కోసం స్నేహితుల సాయం కోరిన యువతి.. హోటల్ లో బంధించి మూడు రోజులు అత్యాచారం

మరోవైపు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై ఫిర్యాదు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్లకు ఢిల్లీ పోలీసులు ఆదివారం భద్రత కల్పించారు. సింగ్ పై ఆరోపణలు చేసిన బాధితులకు తగిన భద్రత కల్పించాలని సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను కోరడంతో అధికారులు స్పందించారు. అయితే విచారణలో మహిళా రెజ్లర్లందరూ పాల్గొనాలని, వారి 161 సీఆర్పీసీ వాంగ్మూలాన్ని నమోదు చేయాలని ఢిల్లీ పోలీసులు పిలుపునిచ్చారు. దీని ద్వారానే భవిష్యత్తుల్లో చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. కాగా.. సింగ్ పై నమోదు చేసిన రెండు ఎఫ్ఐఆర్ లలో ఒక కాపీని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న రెజర్లకు ఢిల్లీ పోలీసులు శనివారం అందజేశారు. అయితే లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టం (పోక్సో) కింద నమోదైన మరో ఎఫ్ఐఆర్ కాపీని రెజ్లర్లకు ఇవ్వలేదని, బాధితురాలి కుటుంబానికి అందజేస్తామని పోలీసులు తెలిపారు. త్వరలోనే బాధితుల వాంగ్మూలాలను నమోదు చేస్తామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు చెప్పినట్టు ‘టైమ్స్ నౌ’ నివేదించింది. 

click me!