"పదవీ విరమణ ముగింపు కాదు.. ఓ నూతన ప్రయాణానికి నాంది" ప్రొఫెసర్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్ జీవిత అనుభవాల సమాహారం

Published : May 01, 2023, 12:58 PM IST
"పదవీ విరమణ ముగింపు కాదు.. ఓ నూతన ప్రయాణానికి నాంది"  ప్రొఫెసర్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్ జీవిత అనుభవాల సమాహారం

సారాంశం

పదవీ విరమణ చేసిన వారు తాము చాలా కాలం పనిచేశామనీ, విశ్రాంతి తీసుకోవడానికి ఇది సమయమని భావిస్తారు.  కానీ, అది  సోమరితనానికి దారి తీస్తుంది. పనిలేకుండా కూర్చోవడం వల్ల మనం మనకు హాని కలిగించుకోవడమే.. కాకుండా మన ఇంటి పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాము" అని ప్రొఫెసర్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్  అంటారు. 

"నాకు పదవీ విరమణ ఆలోచన లేదు. ఆ విషయం గురించి అంతగా ఆలోచించను. ఈ రోజుల్లో నేను 6,000 మందికి పైగా విద్యార్థులను ఆన్‌లైన్ పోటీ పరీక్షలకు సిద్ధం చేస్తున్నాను. కాబట్టి నేను సెలవులో వెళ్ళలేను." అంటున్నారు 66 ఏళ్ళ ప్రముఖ విద్యా సలహాదారు, ప్రొఫెసర్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఆయన భారతదేశంలో సివిల్ సర్వెంట్‌లు కావాలనుకునే భావించే ఔత్సాహికుల కోసం 22 ఏండ్లుగా  కోచింగ్‌ ఇస్తున్నారు. ఆయన శ్రీనగర్ కేంద్రంగా సెంటర్ ఫర్ కెరీర్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ నడుపుతున్నారు.ఉద్యోగాలు సాధించడానికి, పోటీ పరీక్షలలో ఉత్తీర్ణత కావడానికి  ఎలా కష్టపడ్డాలో పలు అంశాల్లో శిక్షణ ఇస్తూ ఉంటారు. 

ప్రొఫెసర్ MY ఖాన్ కేవలం బోధనకే అంకితం కాకుండా.. పలు పుస్తకాలను  కూడా రచించారు. ఆయన ఇప్పటి వరకు పోటీ పరీక్షలు సంబంధించి రీజనింగ్, ఆంగ్ల భాషా నైపుణ్యాలు,సామాజిక శాస్త్రం, బోధనా పద్దతులు వంటి అంశాలపై పలు పుస్తకాలు రచించారు. అలాగే.. ఆయన ఉర్దూలో ఇస్లాం, ఖురాన్‌పై పలు వ్యాసాలు, పుస్తకాలను కూడా వ్రాసాడు . ఆయన కోచింగ్ సెంటర్ శిక్షణ పొంది.. ఉద్యోగాలు సాధించిన వారు చాలా మంది ఉన్నారు. చెప్పుకోదగ్గ వారిలో 2009 UPSC సివిల్ సర్వీసెస్ టాపర్ షా ఫైసల్ ఒకరు. ఇతను కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీగా నియమించబడ్డాడు.

 ప్రొఫెసర్ యాకూబ్ ఖాన్ తన కెరీర్‌లో సరికొత్త ఇన్నింగ్స్‌ను ప్రారంభించే వరకు మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్‌గా సేవలందించారు. ప్రొఫెసర్  ఉన్న సమయంలో తన విద్యార్థితో వ్యక్తిగత ఇంటరాక్ట్ అవడంతో ఉపాధి పొందడంలో యువత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రహించాడు. చదువు అంటే.. డిగ్రీలు(పట్టాలు) పొందడమే కాదు.. వృత్తికి సంబంధించిన కౌన్సెలింగ్, మార్గదర్శకత్వం ఎంతో అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఆలోచనలే అతడిని ఉద్యోగం వదిలేసి..ఓ  కొత్త ప్రయాణం మొదలుపెట్టేలా చేశాయి. 

ఉద్యోగం వదిలేసి..  ఆరు పదుల వయసులో కొత్త ప్రయాణం ప్రారంభించిన విద్యా సలహాదారు,ప్రొఫెసర్ ముహమ్మద్ యాకూబ్ ఖాన్ ను అవాజ్-ది వాయిస్‌ కలిసింది. ఆయన అనుభవాల సమహరమే ఈ కథనం.. 

"నాకు 66 ఏళ్లు.. నిత్యం చాలా బిజీగా ఉంటాను. పదవీ విరమణ చేయాలనే ఆలోచన లేదు.విరామం తీసుకోవడానికి సమయం లేదు.ఆ విషయం గురించి అంతగా ఆలోచించను". అంటూ తన అనుభవాలను పంచుకోవడం ప్రారంభించారు ప్రొఫెసర్ యాకూబ్ ఖాన్ .  "ప్రతి వ్యక్తికి సమయం అనే సంపద సమానం. సమయానికి అందరికీ సమాన విలువ ఉంటుంది. అయితే.. ఆ సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటాడు అనే దాని ఫలితాన్ని నిర్ణయిస్తుంది. సృజనాత్మక పనులలో నిమగ్నమై ఉంటే..మనస్సు స్థిరంగా ఉంటుంది. ఆలోచనలు సరిగా ఉంటాయనేది నా అభిప్రాయం. నిష్క్రియ మనస్సు మానసిక వ్యాధులకు, ముఖ్యంగా నిరాశకు దారితీస్తుంది. ప్రతి క్షణం మనం బిజీగా ఉంటూ, కొన్ని పనులు చేయడం వల్ల అనేక సమస్యల నుంచి మనల్ని కాపాడుకోవచ్చు " అంటున్నారు ఆయన. 

పదవీ విరమణ చేసిన వారు చాలా కాలం పనిచేశారని, వారు విశ్రాంతి తీసుకోవడానికి ఇది సమయం అని తరచుగా చెబుతారు. కానీ,ఇది సోమరితనానికి దారి తీస్తుంది. పనిలేకుండా కూర్చోవడం వల్ల మనం మనకు హాని కలిగించుకోవడమే.. కాకుండా మన ఇంటి పర్యావరణాన్ని కూడా ప్రభావితం చేస్తాము" అని ఆయన చెప్పారు. 

గతంలో పదవీ విరమణ చేసిన వ్యక్తులకు చిన్న పిల్లలను, మనవళ్లు, మనుమరాళ్లను చూసుకునే బాధ్యతను అప్పగించారు, కాని ఈ రోజుల్లో అలాంటి బాధ్యతలు లేవు. కాబట్టి, ఇతర మార్గాలను వెతకాలి. మిమ్మల్ని మీరు బిజీగా, చురుకుగా ఉంచుకోవడం. కొత్త కొత్త పనులు చేయడం వంటివి చేయాలి. పదవీ విరమణ ముగింపు కాదని, నూతన ప్రయాణానికి నాంది అని భావించాలి అని ఆయన చెప్పారు.

"ఈ జీవితం చాలా అందమైనది, ఆకర్షణీయమైనది, అలాగే..చాలా విలువైనది.దానిని వ్యర్థం చేయవద్దు. ప్రతి వ్యక్తి కెరీర్‌లో మంచి, చెడుల అనుభవాలుంటాయి. ఈ అనుభవాలే వ్యక్తి యొక్క జీవిత గమనాన్ని, దిశను మారుస్తాయి. నూతన ప్రయాణానికి నాంది పలుకుతాయి. ఈ క్రమంలో నేను నవ తరానికి సహాయంగా నిలువాలని భావించాను. తన జీవిత అనుభవాలను వారితో పంచుకోవాలని భావించాను. అందుకే.. ప్రొఫెసర్‌గా పదవీ విరమణ కోసం వేచి చూడాలని అనిపించలేదు. నేను యువతకు బోధించడం మానేస్తే.. పెద్దగా తేడా ఉంది.  ఎందుకంటే ఈ పని చేయగల ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. కానీ యువతకు ఉపాధి, మంచి ఉద్యోగాలు పొందడంలో మార్గదర్శకత్వం అవసరం, కాబట్టి నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను " అని  యాకూబ్ ఖాన్ తెలిపారు. యువత ప్రతి విషయాన్ని  జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ధైర్యంగా అడుగు వేయాలని సూచించారు.
 
“మీకు 30-40 సంవత్సరాల అనుభవం ఉన్న ఏ రంగంలోనైనా, పదవీ విరమణ చేసిన వెంటనే ఆ విభాగానికి ఉన్న ప్రాముఖ్యత అంతం కాదు. మీ అనుభవాలను ఇతరులకు అందించండి. ఇతరులతో ఆ అనుభవాలను పంచుకోండి. మీ అనుభవాలు రాబోయే తరానికి ఎంతో మేలు చేస్తాయి. ఉద్యోగం మాత్రమే పొందడం యువకుడి అంతిమ లక్ష్యం కాకూడదు. అతని జీవితం తన ఇంటికి, కుటుంబానికి, సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా చేయడానికి తాను ప్రయత్నిస్తాను" అని MY ఖాన్ తన కోచింగ్ గురించి చెప్పాడు.

ఆయనను తన రోజులోని 24 గంటలను ఎలా విభజిస్తారని అడగ్గా.. ?  అతను నవ్వి.. "నేను రోజులో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాను. నాకు ఇంతకంటే ఎక్కువ విశ్రాంతి అవసరం లేదు. నా చేతులు, కాళ్ళు, మెదడు చురుకుగా పని చేస్తున్నంత కాలం బోధనలోనే  ఉంటాను. ఎప్పుడైతే శరీరం, మనస్సు మద్దతు ఇవ్వడం మానేస్తాయో.. అప్పుడు మాత్రమే విశ్రాంతి తీసుకుంటాను. కానీ అప్పటి వరకు నా యాత్ర సాగుతునే ఉంటుంది " అని యాకూబ్ ఖాన్ చెప్పారు.

ఇంటర్వ్యూ చేసిన వారు : షాతాజ్ ఖాన్- పూణే

PREV
click me!

Recommended Stories

Coldest Places in India : మైనస్ 50°C ఉష్ణోగ్రతలా..! అత్యంత చలిగావుండే టాప్ 5 ప్రదేశాలివే
Gen z పోస్టాఫీస్‌లు వ‌చ్చేస్తున్నాయ్‌.. వీటి ప్ర‌త్యేక‌త ఏంటి.? వీటిలో ఏముంటాయ్‌..