కూతురును రేప్ చేసేందుకు ప్రియుడికి పర్మిషన్ ఇచ్చిన తల్లి.. 40 ఏళ్ల 6 నెలల జైలు శిక్ష విధించిన కోర్టు

By Asianet NewsFirst Published Nov 28, 2023, 10:53 AM IST
Highlights

మైనర్ కూతురును అత్యాచారం చేసేందుకు ఓ మహిళ తన ప్రియుడికి సహకరించింది. ఇలా దాదాపు ఏడాదిన్నర పాటు నిందితుడు బాలికపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఈ కేసులో విచారణ చేపట్టిన కోర్టు.. తల్లికి కఠిన కారాగార శిక్ష విధించింది.

ఓ మహిళ తన అమ్మతనానికే మచ్చ తెచ్చింది. కూతురును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఆ తల్లి.. అత్యంత నీచానికి ఒడిగట్టింది. ప్రియుడి కామవాంఛ తీర్చేందుకు తన మైనర్ కూతురును ఫణంగా పెట్టింది. చిన్నారిని రేప్ చేసేందుకు ప్రియుడికి అనుమతినిచ్చింది. ఈ ఘటన 2018,2019 సంవత్సరాల్లో జరగ్గా.. కోర్టు ఆమెకు తాజా జైలు శిక్ష విధించింది. కూతురు పట్ల ఏమాత్రం దయ లేకుండా వ్యవహించిన ఆ తల్లికి 40 ఏళ్ల 6 నెలల కఠిన కారాగార జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా కూడా విధించింది. 

‘ఇండియా టుడే’ కథం ప్రకారం.. కేరళలోని తిరువనంతపురంకు చెందిన ఓ మహిళ కొన్నేళ్ల కిందట తన భర్తతో విడిపోయింది. తరువాత ప్రియుడైన శిశుపాలన్ తో కలిసి కలిసి జీవించేది. వీరితో మహిళ ఏడేళ్ల కూతురు కూడా జీవించేది. అయితే కొంత కాలం తరువాత శిశుపాలన్ ఆమె కూతురుపై కన్నేశాడు. ఆ చిన్నారిపై లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. దీనికి ప్రియురాలు కూడా సహకరించింది. 

Latest Videos

ఏడేళ్ల కూతురును ప్రియుడు రేప్ చేసేందుకు తల్లి సహకరించింది. ఇలా 2018 మార్చి నుంచి 2019 సెప్టెంబర్ మధ్య తల్లి సహకారంతో శిశుపాలన్ బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏడేళ్ల చిన్నారితో పాటు 11 ఏళ్ల సవతి సోదరిపై కూడా నిందితుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ నరకయాతనను చిన్నారులు ఎవరికీ చెప్పుకోలేక ఎంతో కుమిలిపోయారు. కొంత కాలం తరువాత ఆ చిన్నారులిద్దరూ అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకున్నారు. 

తమ అమ్మమ్మ ఇంటికి పారిపోయారు. తమపై జరిగిన లైంగిక దాడిని ఆ చిన్నారులు అమ్మమ్మకు వివరించారు. చిన్నారులు చెప్పిన విషయం విని ఆ బామ్మ ఆందోళనకు గురయ్యింది. పిల్లలను చిల్డ్రన్ హోమ్ కు తరలించింది. కౌన్సిలింగ్ సమయంలో చిన్నారులు జరిగిన విషయాలను వెల్లడించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

అయితే నిందితుడైన శిశుపాలన్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కేసులో తిరువనంతపురం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ జరిగింది. పోలీసులు 22 మంది సాక్షులను విచారించి 32 డాక్యుమెంట్లను సమర్పించారు. శిశుపాలన్ బాలికపై అత్యాచారం చేశాడని, దీంతో బాధితురాలి ప్రైవేట్ భాగాలకు గాయాలయ్యాయని కోర్టు గుర్తించింది. అయితే శిశుపాలన్ సూసైడ్ చేసుకోవడంతో తల్లికి మాత్రమే కోర్టు జైలు శిక్ష విధించింది. 

సొంత కుమార్తెపై అత్యాచారానికి సహకరించినందుకు ఆమెకు 40 ఏళ్ల 6 నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధించారు. ఆమె మాతృత్వానికే అవమానంగా పరిగణించి, క్షమాభిక్షకు అర్హురాలు కాదని, గరిష్ట శిక్ష విధించడాన్ని సమర్థించింది. నిందితులు జరిమానా చెల్లించడంలో విఫలమైతే అదనంగా ఆరు నెలల జైలు శిక్షను అమలు చేస్తామని కోర్టు తెలిపింది.

click me!