ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువకులు కలిసి ఓ బాలుడ్ని కిడ్నాప్ చేశారు. అనంతరం అతడిపై దాడి చేసి ముఖంపై మూత్ర విసర్జన చేశాడు. ఈ సందర్భంగా నిందితులు ఘటనను వీడియో తీసి వైరల్‌గా మార్చారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో కొందరు వ్యక్తులు ఓ బాలునిపై దాడి చేసి మూత్రం విసర్జన చేశారు. ఆ తర్వాత ఘటనకు సంబంధించిన వీడియో తీసి వైరల్‌గా మారింది. విషయం తెలియడంతో పోలీసులు 7 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ దారుణం జాగృతి విహార్ పోలీస్ స్టేషన్ మెడికల్ ఏరియా చోటుచేసుకుంది.
నవంబర్ 13న బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో బాలునిపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఆ బాలుడ్ని కిడ్నాప్ చేసి బందీ చేశారు. అనంతరం జాగృతి విహార్‌లోని నిర్జన రహదారిపైకి తీసుకెళ్లి దాడి చేశారు. అంతటితో ఆగని నిందితులు ఆ బాలుడి ముఖంపై మూత్ర విసర్జన చేశారు. మరోవైపు ఆ బాలుడు అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు రాత్రంతా వెతుకుతూనే ఉన్నారు. కానీ.. ఫలితం లేదు.
undefined
మరుసటి రోజు ఉదయం ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఆ బాధితుడు ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులకు విషయం తెలిపాడు. కానీ యూరినేషన్ ఘటనను మాత్రం బయటకు వెల్లడించలేదు. తాజాగా బాలునిపై మూత్రం పోసిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో విషయం బయటకు వచ్చింది.
తొలుత కొందరు దుండగులు తమ పిల్లవాడిని బందించి, దాడి చేశారని పోలీసులను ఆశ్రయించినా చర్యలు తీసుకోలేదని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. వీడియో బయటకు వచ్చిన తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు.. బాధితుడి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపులు చేపట్టారు. ఇప్పటివరకు నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. బాలురు గొడవ పడటానికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు.
ఈ ఘటనపై మీరట్ ఎస్పీ సిటీ పీయూష్ సింగ్ మాట్లాడుతూ.. నవంబర్ 13న మీరట్‌లోని మెడికల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాగృతి విహార్‌లో కొంతమంది యువకులు ఓ యువకుడిని కొట్టారని తెలిపారు. ఈ గొడవలో యువకుడిపై మూత్రం పోశారు. ఈ కేసులో బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేశారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటున్నామన్నారు.