ఏడాదిన్న‌ర‌గా మృత‌దేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్న కుటుంబ స‌భ్యులు.. ఖంగుతిన్న అధికారులు

By team teluguFirst Published Sep 24, 2022, 4:43 PM IST
Highlights

యూపీలో కుటుంబం ఏడాదిన్నరగా ఓ మృత‌దేహాన్ని ఇంట్లోనే ఉంచుకుంది. కోమాలో ఉన్నాడని, కోలుకుంటాడని భావిస్తూ అంత్యక్రియలు కూడా నిర్వహించలేదు. పోలీసులు, అధికారులు ఆ ఇంట్లోకి ప్రవేశించి చూడగా.. అసలు విషయం బయటకు వచ్చింది. 

యూపీలో ఒక విచిత్రమైన ఘటన వెలుగులోకి వ‌చ్చింది. గ‌తేడాదిన్న‌ర కింద‌ట ఓ వ్య‌క్తి మ‌ర‌ణించాడు. అయితే అత‌డు చ‌నిపోలేద‌ని, కోమాలోనే ఉన్నాడ‌ని భావించిన కుటుంబం మృత‌దేహాన్ని అలాగే ఉంచింది. పైగా మృతుడి భార్య అత‌డి శ‌రీరంపై ప్ర‌తీ రోజు గంగా జ‌లాన్ని చిల‌క‌రించేది. కానీ ఓ రోజు అనుమానం వ‌చ్చి అధికారులు, పోలీసులు ఇంటికి వెళ్లి చూడ‌గా.. మంచానికి అతుక్కుపోయి ఉన్న మృత‌దేహాం క‌నిపించింది. దీంతో అధికారులు ఖంగుతిన్నారు.

కాంగ్రెస్‌ను నడిపే పరిణతి రాహుల్‌కు లేదు.. ఎవరు అధ్యక్షుడైనా తాత్కాలికమే : విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

వివ‌రాలు ఇలా ఉన్నాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని ఆదాయ‌పు ప‌న్ను శాఖ‌లో విమలేష్ దీక్షిత్ ప‌ని చేస్తూ ఉండేవాడు. అయితే గ‌తేడాది ఏప్రిల్ 22వ తేదీన అకస్మాత్తుగా కార్డియాక్ రెస్పిరేటరీ సిండ్రోమ్ కార‌ణంగా మ‌ర‌ణించాడు. దీనికి సంబంధించి ఓ ప్రైవేట్ ఆసుపత్రి జారీ చేసిన దీక్షిత్ మరణ ధృవీకరణ ప‌త్రాన్ని కూడా ఇచ్చింది. దీంతో అత‌డి మృత‌దేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్య‌క్రియ‌ల‌కు ఏర్పాట్లు చేశారు.

కానీ ఆ స‌మ‌యంలో అత‌డు కదిలాడ‌ని, ఇంకా బ‌తికే ఉన్నాడ‌ని, కోమాలోకి వెళ్లాడ‌ని మృతుడి కుటుంబ స‌భ్యులు భావించారు. మృత‌దేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఉంచారు. బెడ్ పై ప‌డుకోబెట్టి ఉంచారు. మృతుడి భార్య‌కు మాన‌సిక ప‌రిస్థితి స‌రిగా లేదు. దీంతో ఆమె మృత‌దేహాంపై ప్ర‌తీ రోజు గంగా జ‌లాన్ని చ‌ల్లేది. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని కోరుకునేది. త‌ర‌చూ ఆక్సిజ‌న్ సిలిండ‌ర్లు ఇంటికి తీసుకురావ‌డంతో ఇరుగు పొరుగువారికి కూడా ఎలాంటి అనుమానం రాలేదు.

ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. రోజు సాయంత్రం టీవీలు, ఫోన్‌లు ఆఫ్.. మెరుగవుతున్న పిల్లల చదువులు, పెద్దల బంధాలు

అయితే కొంత కాలం కింద‌ట భార్య భ‌ర్త ప‌ని చేసే ఆఫీసుకు వెళ్లి పెన్ష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది. త‌న భ‌ర్త చ‌నిపోయాడ‌ని పేర్కొంటూ డెత్ స‌ర్టిఫికెట్ కూడా జ‌త చేసింది. దీంతో అక్క‌డి అధికారులు అయోమయంలో ప‌డ్డారు. అనుమానం వ‌చ్చి పోలీసులు, ఆరోగ్య అధికారుల‌ను తీసుకొని రావత్‌పూర్ ప్రాంతంలోని విమ‌లేష్ ఇంటికి వెళ్లారు. దీంతో అక్క‌డి దృష్యాల‌ను చూసి ఖంగుతిన్నారు.

అక్టోబర్ 1న 5జీ సేవలను ప్రారంభించనున్న ప్రధాని మోదీ..!

బెడ్ లో ప‌డుకోబెట్టి, బ‌క్క చిక్కిపోయిన విమ‌లేష్ మృత‌దేహం కనిపించింది. అయినా కుటుంబ స‌భ్యులు అత‌డు చ‌నిపోయాడ‌ని ఒప్ప‌కోలేదు. ఇంకా ఆయ‌న స‌జీవంగా ఉన్నార‌ని, కోమాలో ఉన్నార‌ని ప‌ట్టుబ‌ట్టారు. కుటుంబ స‌భ్యుల‌కు ఎంతో న‌చ్చ‌జెప్పిన త‌రువాత మృత‌దేహాన్ని లాలా లజ్‌పత్ రాయ్ (LLR) ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్క‌డ వైద్య ప‌రీక్ష‌లు చేసిన డాక్ట‌ర్లు, ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు నిర్దారించారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌ను క్షుణ్ణంగా పరిశీలించేందుకు ముగ్గురు సభ్యుల బృందాన్ని ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎంవో ఏర్పాటు చేసింది. దీనిపై వీలైనంత త్వ‌ర‌గా నివేదిక‌ను అంద‌జేయాల‌ని కోరింది. 

click me!