ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం.. రోజు సాయంత్రం టీవీలు, ఫోన్‌లు ఆఫ్.. మెరుగవుతున్న పిల్లల చదువులు, పెద్దల బంధాలు

By Mahesh KFirst Published Sep 24, 2022, 3:36 PM IST
Highlights

కరోనాతో ఆన్‌లైన్ క్లాసెస్‌తో సెల్ఫ్ డిసిప్లీన్, కాన్సంట్రేషన్ పోయి.. కనీసం అక్షరాలను గుర్తించి చదవలేకపోతున్నారని మహారాష్ట్రలోని ఓ గ్రామ తల్లిదండ్రులు పిల్లల గురించి వాపోయారు. సాంగ్లి జిల్లా మోహిత్యాంచె వడ్గావ్ గ్రామ సర్పంచ్, ఆ ఊరి పెద్దలు సమావేశమై రోజు సాయంత్రం 90 నిమిషాలు స్టడీ టైమ్ మెయింటెయిన్ చేయాలని, ఆ సమయంలో ఫోన్‌లు, టీవీలు ఆఫ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గత 40 రోజుల నుంచి ఈ నిర్ణయంతో సత్ఫలితాలు వస్తున్నట్ట వారు చెబుతున్నారు.
 

ముంబయి: టెక్నాలజీ నిత్యజీవితంలో అంతర్భాగమైపోయింది. సెల్ ఫోన్ ఎప్పుడూ చేతికి అందుబాటులో ఉండాల్సిందే. రోజు సాయంత్రం, ఉదయం ఇంట్లో టీవీ నడవాల్సిందే. ఇలా చెప్పుకుంటూ పోతే.. రోజులో మనకు మనం, మన పిల్లల చదవులకు కేటాయించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అసలు ఉండదు కూడా. కానీ, మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా మోహిత్యాంచె వడ్గావ్ గ్రామ ప్రజలు వీటన్నింటికీ పరిష్కారం ఆలోచించారు.

కరోనా మహమ్మారితో దాదాపు రెండేళ్లు స్కూల్స్ తెరుచుకోలేదు. రెండేళ్ల చదువులు చాలా వరకు ఆన్‌లైన్‌లోనే జరిగాయి. ఈ ఆన్‌లైన్ చదువుల వల్ల పిల్లల్లో సెల్ఫ్ డిసిప్లీన్, చదువు పై ఫోకస్, ఇతర చాలా అవలక్షణాలు వచ్చాయి. ఈ విషయాన్ని ఆ గ్రామంలోని సుమారు 580 మంది స్కూల్ పిల్లల తల్లిదండ్రులు ఆలోచించారు. పిల్లలకు చదవడం కూడా రాకపోవడాన్ని వారు గమనించారు. అందుకే వారిని ప్రైవేట్ స్కూల్స్‌కు పంపడం మొదలు పెట్టారు. పిల్లల్లో కొంత మార్పు వస్తున్నట్టు చూశారు. కానీ, ఈ మార్పు వల్ల రెండు జిల్లా పరిషత్ స్కూల్స్ నిర్మానుష్యం అయ్యాయి. ఒక తరమే చదువుకు దూరం అయ్యే ప్రమాదం ఉందని సర్పంచ్ విజయ్ మోహితే ఆలోచించారు. ఆయన గ్రామ ప్రజలతో సమావేశం అయ్యాడు. వారంతా ప్రతి రోజూ పిల్లల చదువు కోసం ప్రత్యేకంగా కొంత సమయం కేటాయించాలని నిర్ణయించారు. మొబైల్, టీవీ సహా ఎలాంటి స్క్రీన్ డిస్ట్రాక్షన్ లేకుండా సాయంత్రం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు స్టడీ టైమ్ కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ నిర్ణయాన్ని అమలు చేస్తున్నారు. ప్రతి రోజు సాయంత్రం 6.59 గంటలకు సైరన్ మోగుతుంది. ఈ సైరన్ వినపడగానే పిల్లలు స్కూల్ బ్యాగ్స్ ముందు వేసుకుంటారు. తల్లిదండ్రులు టీవీ సెట్‌లు కట్టిపెట్టి మొబైల్ ఫోన్స్ పక్కనపెట్టేస్తారు. ఆశా వర్కర్లు, టీచర్లు, రిటైర్డ్ టీచర్లు.. కొంత ఏరియాను కేటాయించుకుని మానిటర్ చేస్తారు. దీంతో పిల్లల చదువులు మెరుగుపడుతున్నట్టు తల్లిదండ్రులు గమనించారు. అంతేకాదు, 90 నిమిషాల్లో రోజువారీ పనుల గురించి, వ్యవసాయం గురించి, కష్టసుఖాల గురించి పెద్దలు మాట్లాడుకుంటూ ఉండటంతో వారి మధ్య కూడా బంధాలు చిక్కబడుతున్నట్టు వారు గుర్తించారని సర్పంచ్ మోహతె తెలిపారు. ఈ సమయంలోనే న్యూస్ పేపర్లు కూడా చదువుతున్నారని వివరించారు.

టైమ్ మేనేజ్‌మెంట్, ఫోకస్, వర్క్ పై కాన్సెంట్రేషన్ పెరిగిందని పదో తరగతి విద్యార్థిని గాయత్రి తెలిపారు. ఇప్పుడు చదవడం లేదని తమ కొడకును తిట్టాల్సిన అవసరం పడటం లేదని ఓ హౌజ్ వైఫ్ తేజశ్రీ మోహితె వివరించారు.

తొలుత ఈ ప్లాన్ అమలు చేయగానే.. తమకు ఇష్టమైన కొన్ని సీరియల్స్‌ను తాము చూడలేకపోతున్నామని కొందరు మహిళలు సమస్య లేవనెత్తారని వివరించారు. కానీ, చాలా సీరియల్స్ డే టైమ్‌లోనూ వస్తాయని, కాబట్టి మధ్యాహ్నం సమయంలో వాటిని చూసి.. సాయంత్రం టీవీ కట్టేయడం ఉత్తమం అని తాము సూచించినట్టు సర్పంచ్ వివరించాడు. ఆదివారాల్లోనూ ఈ ప్లాన్ ను అమలు చేస్తుండటం గమనార్హం.

click me!