Ayodhya Ram Mandir: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామ మందిరం (Ayodhya Ram Mandir ) ప్రారంభోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ పర్యాటక కేంద్రంగా ఇది రాణిస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ మేరకు అయోధ్యను యూపీ ప్రభుత్వం రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది. రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ దాదాపు 3 లక్షల మంది పర్యాటకులు వచ్చిన వసతుల్లో లోటు రాకుండా ఉండేలా నిర్మాణాలు చేపట్టనుంది.
Ayodhya Ram Mandir: అయోధ్యలో అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. దాదాపు 500 ఏళ్ల హిందువుల కలను సాకారం చేస్తూ రామజన్మభూమిలో కొత్తగా నిర్మించిన ఆలయంలో బాలరాముడు కొలువుదీరాడు. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం నాడు రామ్ లలాప్రతిష్టాపన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ అపూర్వ ఘట్టంతో అయోధ్య.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూవులను తన వైపుకు తిప్పుకుంది. రానున్న రోజుల్లో అయోధ్య నగరం ప్రపంచ ఆధునిక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రాణిస్తుందని అంతా భావిస్తున్నారు.
అయోధ్య నగర పునరుద్దరణలో భాగంగా కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్ ఆధునీకరణ, రోడ్డు కనెక్టివిటీ, టౌన్‌షిప్ డెవలప్‌మెంట్ ఇలా మౌళిక సదుపాయాల కోసం యోగి ప్రభుత్వం సుమారు రూ.85,000 కోట్లు(సుమారు 10 బిలియన్ డాలర్లు ) వేచించినట్టు అంచనా. అయితే.. ఇలా సకల సదుపాయాలున్న అయోధ్య నగరి అతి త్వరలో ఆధునిక ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారనున్న పలువురు భావిస్తున్నారు. దీంతో పాటు అయోధ్యకు ఆర్థిక సద్భావనను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో బడా కంపెనీలు తమ పెట్టుబడులు పెట్టడానికి అయోధ్య నగరానికి క్యూ కడుతున్నారు. ఈ అధ్యాత్మిక కేంద్రం.. వ్యాపార కేంద్రంగా మారుతుందని బడా వ్యాపారవేత్తలు, కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
అయోధ్యను పునరుద్దరణ చేయడంతో పర్యటక రంగాన్ని డెవలప్ చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది. తద్వారా పర్యాటక రంగం ద్వారా దాదాపు $200 బిలియన్ల ఆదాయం చేకూరుతుందనీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థలో 7% వాటాను అందిస్తుందని అంచనా. ఇది చాలా పెద్ద అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల కంటే 5 శాతం పాయింట్ల కంటే తక్కువగా ఉంది. అయోధ్య భారీ పునరుద్ధరణ ద్వారా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.25,000 కోట్ల ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు.
బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ప్రకారం.. కొత్త విమానాశ్రయం, రైల్వే స్టేషన్, టౌన్‌షిప్, మెరుగైన రహదారి కనెక్టివిటీ వంటి పునరుద్ధరన కోసం సుమారు ₹ 85,000 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ఈ భారీ మేక్ఓవర్ తో అయోధ్య ఏడాదిలో నగరానికి 50 మిలియన్ల పర్యాటకులను ఆకర్షించగలదని జెఫరీస్ నివేదిక లో హైలైట్ చేసింది. అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌కు సంవత్సరానికి 30-35 మిలియన్ భక్తులు వస్తారని అంచనా వేయగా, తిరుపతి ఆలయానికి 25-30 మిలియన్ల మంది సందర్శిస్తారు. ప్రపంచవ్యాప్తంగా వాటికన్ నగరానికి ప్రతి సంవత్సరం 9 మిలియన్ల మంది పర్యాటకులు, సౌదీ అరేబియాలోని మక్కాకు దాదాపు 20 మిలియన్ల మంది పర్యాటకులు వస్తున్నారని నివేదిక పేర్కొంది.
అయోధ్యను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కొత్తగా నిర్మించిన ఎయిర్‌పోర్ట్ ద్వారా ప్రస్తుతం సామర్థ్యం ఏడాదికి పది లక్షల ప్రయాణికుల నుంచి దశల వారీగా విస్తరణ ద్వారా 2025 నాటికి 60 లక్షల సామర్థ్యానికి చేరుతుందని అంచనా వేస్తున్నారు. అలాగే రైలులో అయోధ్యకు చేరే వారి రోజువారీ ప్రయాణికుల సంఖ్య 60,000 వేలకు పెరుగుతుందని భావిస్తున్నారు.
జెఫరీస్ తన నివేదికలో రామమందిర ఆర్థిక ప్రభావం గురించి సవివరంగా వివరించారు. అయోధ్య ఈ మార్పు ప్రతి సంవత్సరం 5 కోట్లకు పైగా పర్యాటకులను ఆకర్షిస్తుందని తెలిపింది. అయోధ్య రామమందిరం గణనీయమైన ఆర్థిక ప్రభావాన్ని సృష్టించగలదని బ్రోకరేజ్ చెబుతోంది. అనేక విమానయాన సంస్థలు అయోధ్యకు తమ విమానాలను ప్రారంభించడం గమనార్హం. టాటాస్ ఇండియన్ హోటల్స్ లిమిటెడ్‌తో సహా అనేక కంపెనీలు హాస్పిటాలిటీ రంగంలో తమ ప్రాజెక్టులను ప్రారంభించాయి.
85000 కోట్లలో ఏం మారింది?
అయోధ్యలోని రామ మందిరం నిర్మాణం ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై భారీ ప్రభావం చూపుతుందనీ, భారతదేశం కొత్త పర్యాటక గమ్యాన్ని పొందిందని, ఇది ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది భక్తులు మరియు పర్యాటకులను ఆకర్షిస్తుందని జెఫరీస్ విశ్లేషకులు చెప్పారు. 85,000 కోట్లతో చేసిన మేకోవర్‌లో కొత్త విమానాశ్రయం, పునరుద్ధరించిన రైల్వే స్టేషన్, టౌన్‌షిప్, మెరుగైన రహదారి కనెక్టివిటీ ఉన్నాయని నివేదికలో చెప్పబడింది. ఇవన్నీ కొత్త హోటల్‌లు , ఇతర ఆర్థిక కార్యకలాపాలతో గుణకార ప్రభావాన్ని కలిగిస్తాయని పేర్కొంది.
రోజుకు 1-1.5 లక్షల మంది భక్తులు
జెఫరీస్ ప్రకారం.. ప్రధాన పుణ్యక్షేత్రం 70 ఎకరాలలో విస్తరించి ఉంది, ఒకేసారి 10 లక్షల మంది భక్తులకు ఆతిథ్యం ఇవ్వడానికి సిద్ధం చేయబడింది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చే యాత్రికుల సంఖ్య 1 లక్ష నుంచి 1.5 లక్షలకు చేరుకుంటుందని అంచనా. భారతదేశ పర్యాటక రంగంలో మతపరమైన పర్యాటకం ఇప్పటికీ అత్యధిక వాటాను కలిగి ఉందని నివేదిక పేర్కొంది. దేశంలోని అనేక ప్రసిద్ధ మతపరమైన కేంద్రాలు ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాల పరిమితులు ఉన్నప్పటికీ సుమారు 3 కోట్ల మంది పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఇది పర్యటక రంగంలో బూస్టర్‌గా పనిచేస్తుంది.
రూ.1800 కోట్లతో ఆలయం రెడీ!
బ్రోకరేజ్ నివేదికలోని తన నివేదికను విడుదల చేస్తూ అయోధ్య పురాతన నగరమని, ఇప్పుడు ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా మారబోతుందని చెప్పారు. రూ.1,800 కోట్లతో కొత్త రామాలయం పూర్తిగా సిద్ధమైంది. అయోధ్యలోని రామ మందిరం హోటళ్లు, విమానయాన సంస్థలు, ఆతిథ్యం, ఎఫ్‌ఎంసిజి, ప్రయాణ సలహాదారులు, సిమెంట్‌తో సహా అనేక రంగాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. జెఫరీస్ ప్రకారం.. టూరిజం FY2019 (ప్రీ-కోవిడ్) GDPకి $194 బిలియన్లను అందించింది. FY2033 నాటికి 8% CGR వద్ద $443 బిలియన్లకు పెరుగుతుందని అంచనా వేసింది.
అయోధ్యలో తరలివస్తున్న పెట్టుబడులు
ఒకవైపు ఇండిగో, ఎయిరిండియా, స్పైస్‌జెట్, ఆకాశ ఎయిర్‌లు అయోధ్యకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సన్నద్ధం కాగా, మరోవైపు ఐఆర్‌సీటీసీ అయోధ్యకు టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. హోటల్ రంగం నుండి ఇండియన్ హోటల్ కంపెనీ , EIH సంభావ్య లబ్ధిదారులుగా జెఫరీస్ గుర్తించింది. మరోవైపు.. జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, గోద్రెజ్ కన్స్యూమర్, వెస్ట్‌లైఫ్ ఫుడ్‌వరల్డ్, హిందూస్తాన్ యూనిలీవర్, దేవయాని ఇంటర్నేషనల్, సఫైర్ ఫుడ్స్ కూడా తమ అవుట్ లెట్స్ తెరవడానికి పోటీపడుతున్నాయి.