Delhi Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో మరోసారి భూప్రకంపనాలు సంభవించాయి. చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో సోమవారం రాత్రి 7.2 తీవ్రతతో భూకంపం సంభవించిన తర్వాత ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో సోమవారం అర్థరాత్రి ప్రకంపనలు వచ్చాయి.
Delhi Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భూప్రకంపనాలు సంభవించాయి. సోమవారం రాత్రి 11.40 గంటల ప్రాంతంలో చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్ ప్రాంతంలో 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీని తర్వాత ఢిల్లీ సోమవారం అర్థరాత్రి ప్రకంపనలు వచ్చాయి. నివేదికల ప్రకారం.. చైనాలోని దక్షిణ జిన్‌జియాంగ్‌లో భూకంప కేంద్రం ఉందని, రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.2గా నమోదైందని నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ తెలిపింది.
ఈ భూప్రకంపనల వల్ల ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ప్రాణాలు చేతిలో పట్టుకుని వణుకుతున్నారు. ఇటీవలి కాలంలో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో పలుమార్లు భూకంపం సంభవించింది. దీంతో ప్రజల్లో ఆందోళన పెరిగింది. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సరిహద్దుల్లో కూడా భూకంపం సంభవించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఎటువంటి నష్టం లేదా ప్రాణనష్టం జరిగినట్లు నివేదించబడలేదు.
అంతకుముందు, ఆఫ్ఘనిస్తాన్‌లో 6.1 తీవ్రతతో సంభవించిన భూకంపం ఫలితంగా, ఢిల్లీ , ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గురువారం మధ్యాహ్నం తేలికపాటి ప్రకంపనలు సంభవించాయి. నివేదికల ప్రకారం, లాహోర్, ఇస్లామాబాద్ మరియు ఖైబర్ పఖ్తుంక్వా నగరాల్లో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించింది.