Ayodhya Ram Mandir : జనవరి 22న సెలవు ఇవ్వలేదని, ఏకంగా ఉద్యోగాన్నే వదిలేశాడుగా.. ట్వీట్ వైరల్

Siva Kodati |  
Published : Jan 22, 2024, 09:12 PM ISTUpdated : Jan 22, 2024, 09:17 PM IST
Ayodhya Ram Mandir : జనవరి 22న సెలవు ఇవ్వలేదని, ఏకంగా ఉద్యోగాన్నే వదిలేశాడుగా.. ట్వీట్ వైరల్

సారాంశం

అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మితం కావడంతో పాటు రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది.  గగన్ తివారీ అనే వ్యక్తి రామ్ లల్లా విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట రోజున తన  మేనేజర్ తనకు సెలవు మంజూరు చేయలేదని పోస్ట్ చేశాడు. ఈ చారిత్రాత్మకమైన రోజున సెలవు నిరాకరించిన కారణంగా గగన్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. 

దాదాపు 500 ఏళ్లుగా కోట్లాది మంది హిందువులు కంటున్న కల సాకారమైంది. అయోధ్యలో భవ్య రామ మందిరం నిర్మితం కావడంతో పాటు రామ్ లల్లా విగ్రహా ప్రాణ్ ప్రతిష్ట కార్యక్రమం కన్నుల పండుగగా జరిగింది. సోమవారం ప్రధాని నరేంద్ర మోడీ చేతులు మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు దేశ విదేశాల నుంచి వందలాది ప్రముఖులు హాజరయ్యారు. కోట్లాది మంది భక్త జనం టీవీలలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రాణ్ ప్రతిష్టా కార్యక్రమాన్ని వీక్షించారు. 

ఈ చారిత్రాత్మక కార్యక్రమం నేపథ్యంలో దేశంలోని అనేక రాష్ట్రాలు జనవరి 22ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాయి. అయితే ఈరోజున సెలవు నిరాకరించబడిన ఓ వ్యక్తి పెట్టిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  గగన్ తివారీ అనే వ్యక్తి రామ్ లల్లా విగ్రహ ప్రాణ్ ప్రతిష్ట రోజున తన  మేనేజర్ తనకు సెలవు మంజూరు చేయలేదని పోస్ట్ చేశాడు. ఈ చారిత్రాత్మకమైన రోజున సెలవు నిరాకరించిన కారణంగా గగన్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. 

 

 

‘‘ఇవాళ నా ఉద్యోగాన్ని విడిచిపెట్టాను. నా కంపెనీ జీఎం ఒక ముస్లిం వ్యక్తని, అతను జనవరి 22న తనకు సెలవును తిరస్కరించాడని ’’ గగన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. గగన్ తివారీ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టడంపై పలువురు నెటిజన్లు స్పందించారు. రామ భక్తులు అతని నిర్ణయాన్ని మెచ్చుకోనగా.. భగవంతుని ఆశీస్సులతో అతనికి త్వరలోనే కొత్త ఉద్యోగం లభిస్తుందని చెప్పారు. మరికొందరైతే గగన్‌ను ‘లెజెండ్’’ అంటూ కీర్తించారు.

 

 

ఇంకొందరు మాత్రం గగన్‌ తొందరపాటుతో తీసుకున్న నిర్ణయంగా పేర్కొన్నారు. ‘‘భారతదేశం ఎందుకో కొన్నిసార్లు నన్ను నమ్మకుండా ఆశ్చర్యపరుస్తుంది’’ అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు. ‘‘మీరు సిక్ లీవ్ తీసుకోవాల్సింది.. అలా కాకుండా ఏకంగా ఉద్యోగాన్నే వదిలిపెట్టాల్సిన అవసరం ఏంటీ..?’’ అని మరో యూజర్ ప్రశ్నించాడు. 

 

 

కాగా.. ప్రజలు పిల్లాపాపలతో రామమందిర ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో పలు రాష్ట్రాలు విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించాయి. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనూ రేపు సెలవు ప్రకటించాలని బిజెపి నాయకులతో పాటు పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 

తెలంగాణకకు చెందిన శ్రీనివాస్ అనే న్యాయవాది అయితే ప్రభుత్వం సెలవు ప్రకటించేలా ఆదేశించాలంటూ ఏకంగా హైకోర్టును ఆశ్రయించాడు. జనవరి 22ప అయోధ్య ఆలయ ప్రారంభోత్సవం నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక సెలవుదినంగా ప్రకటించాలంటూ తెలంగాణ హైకోర్టులో శ్రీనివాస్ పిటిషన్ దాఖలు చేసారు. తన పిటిషన్ ను వెంటనే విచారించి ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు శ్రీనివాస్. 

 

 

ఇక బిజెపి ఎంపీ బండి సంజయ్ కూడా జనవరి 22న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అయోధ్య ఆలయ ప్రారంభోత్సవాన్ని రాజకీయ కోణంలో కాకుండా ఆధ్యాత్మిక కోణంలో చూడాలని... పార్టీలకు అతీతంగా తమ గ్రామాలు, పట్టణాల్లో జరిగే కార్యక్రమాల్లో ప్రజలందరూ పాల్గొనాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు కూడా వేడుకల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని సంజయ్ డిమాండ్ చేసారు. 

 

 

ఇదిలావుంటే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు అంటే  రేపు ఉత్తరప్రదేశ్ లో అధికారిక సెలవు ప్రకటించారు. అలాగే బిజెపి పాలిత మధ్య ప్రదేశ్, గోవాలో పూర్తి రోజు... అస్సాం, గుజరాత్, చత్తీస్ ఘడ్, హర్యానా, త్రిపుర, ఒడిషా రాష్ట్రాల్లో హాఫ్ డే సెలవు ప్రకటించారు. 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం