విద్యా సంస్థల్లో కామన్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు నిరాకరించిన ధర్మాసనం

Published : Sep 16, 2022, 02:42 PM ISTUpdated : Sep 16, 2022, 02:49 PM IST
విద్యా సంస్థల్లో కామన్ డ్రెస్ కోడ్ అమలు చేయాలని సుప్రీంకోర్టులో పిల్.. విచారణకు నిరాకరించిన ధర్మాసనం

సారాంశం

స్కూల్స్, కాలేజీల్లో అందరికీ ఒకే రకమైన యూనిఫాం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజిత వ్యాజ్యం (పిల్)ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించలేదు. ఇది కోర్టులో చేయాల్సిన పని కాదని ధర్మాసనం పిటిషనర్ కు తెలిపింది. 

విద్యాసంస్థల్లో విద్యార్థులకు,  ఉద్యోగులకు కామన్ డ్రైస్ కోడ్ (యూనిఫాం)ను అమలు చేసేలా కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇది కోర్టులో విచారణకు రావలసిన అంశం కాదని జస్టిస్ హేమంత్ గుప్తా, జస్టిస్ సుధాన్షు ధులియాతో కూడిన ధర్మాసనం పేర్కొంది.

చైనా లోన్ యాప్‌లపై ఈడీ కొరడా.. గేట్‌వే ఖాతాల్లో దాచిన రూ. 46 కోట్లు ఫ్రీజ్

సమానత్వం, సౌభ్రాతృత్వం, జాతీయ సమైక్యతను ప్రోత్సహించడానికి డ్రెస్ కోడ్‌ని అమలు చేయాలని ఆ పిల్ వాదించింది. పిటిషనర్ నిఖిల్ ఉపాధ్యాయ్ తరఫు సీనియర్ న్యాయవాది గౌరవ్ భాటియా మాట్లాడుతూ.. ఇది రాజ్యాంగపరమైన సమస్య అని, విద్యాహక్కు చట్టం ప్రకారం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అయితే ఈ వ్యాజ్యాన్ని పరిశీలించేందుకు ధర్మాసనం విముఖత చూపడంతో న్యాయవాది దానిని ఉపసంహరించుకున్నారు. కర్ణాటక వెలుగులోకి వ‌చ్చిన హిజాబ్ వివాదం నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలైంది.

From the IAF Vault: సీ-87 విమానం ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటింది.. ఎలాగో తెలుసా?

రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడానికి నిరాకరిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లను జస్టిస్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. న్యాయవాదులు అశ్విని ఉపాధ్యాయ్, అశ్విని దూబే ద్వారా దాఖలైన ఈ పిల్.. సామాజిక, ఆర్థిక న్యాయం, సోషలిజం, లౌకికవాదం, ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే న్యాయ కమిషన్ లేదా నిపుణుల ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరింది. విద్యా సంస్థల్లో విలువలను, విద్యార్థుల మధ్య సోదరభావం, గౌరవం, ఐక్యత జాతీయ సమగ్రతను పెంపొందించేలా చర్యలు సూచించాలని కోరింది. 

గుజరాత్ మాజీ హోం మినిస్ట‌ర్ విపుల్ చౌదరి అరెస్ట్.. ఎందుకంటే ?

విద్యాసంస్థలు లౌకిక బహిరంగ ప్రదేశాలు, విజ్ఞానం, వివేకం ఉపాధి, మంచి ఆరోగ్యాన్ని అందించడానికి, దేశ నిర్మాణానికి దోహదపడటానికి ఉద్దేశించినవని, అవసరమైన, అనవసరమైన మతపరమైన ఆచారాలను అనుసరించడానికి కాదని పిల్ పేర్కొంది.

తలలేని మృతదేహం కేసును ఛేదించిన పోలీసులు.. భార్యను హత్య చేసిన భ‌ర్త

‘‘ విద్యాసంస్థల లౌకిక స్వభావాన్ని కాపాడేందుకు అన్ని పాఠశాలలు-కళాశాలల్లో కామన్ డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టడం చాలా అవసరం, లేకుంటే రేపు నాగ సాధువులు కళాశాలల్లో అడ్మిషన్లు తీసుకోవచ్చు, తమ అవసరమైన మతపరమైన ఆచారాలను ఉద‌హ‌రిస్తూ బట్టలు లేకుండా తరగతికి హాజరు కావచ్చు ’’ అని పిల్ పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!