From the IAF Vault: సీ-87 విమానం ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటింది.. ఎలాగో తెలుసా?

By Anchit GuptaFirst Published Sep 16, 2022, 1:57 PM IST
Highlights

స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఇంగ్లాండ్ వదిలిపెట్టిన యుద్ధ విమానాలకు భారత్ అవసరానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకుంది. రెండో ప్రపంచ యుద్ధంలో వాడిన సీ-87 లిబరేటర్ అనే అమెరికా వైమానిక దళానికి చెందిన విమానాన్ని భారత్ గొప్ప కార్యానికి వినియోగించింది. ఈ విమానానికి అనేక మార్పులు చేసి తొలి సారి ఎవరెస్టు శిఖరం ఎల్లలు దాటించింది. దాని అద్భుతమైన చిత్రాలను ప్రపంచానికి అందించింది. ఒక్కసారిగా భారత ప్రతిష్ట ఎవరెస్టుకు మించి విస్తరించింది.
 

న్యూఢిల్లీ: భారత్ పటిష్టమైన దేశం. భద్రతాపరంగానైనా బలమైన దేశం. ముఖ్యంగా భారత వైమానిక దళం ఎంతో పటిష్టంగా ఉన్నది. భారత్ స్వాతంత్ర్యం పొందినప్పటి నుంచి భారత ఆర్మీ బలపడుతూ వస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు కోసం మొదట కొన్ని అనూహ్య సాహసాలు చేసింది. ఇందులో ఒకటి.. వాతావరణ శాఖ సమాచారం లేకున్నా హిమాలయ శిఖరాలు ఎల్లలు తిరిగి వచ్చింది. ప్రపంచవ్యాప్త గుర్తింపు కోసం, ఉదాత్తమైన కార్యక్రానికి నిధులు సేకరించాలనే లక్ష్యంతో అప్పటి అధికారుల్లో ఈ ఆలోచన వచ్చింది. ఎవరెస్టు పర్వతాలు ప్రసిద్ధమైన శిఖరాలు. వీటిని అధిరోహించి పై నుంచి ఫొటోలు తీయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తద్వార ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకోవాలని ఆలోచించారు.

అప్పటి ఐఏఎఫ్ డిప్యూటీ చీఫ్ (ఆ తర్వాత చీఫ్‌గా కూడా చేశారు) ఆస్పి ఇంజినీర్ మదిలో ఈ ఆలోచన మెరిసింది. ఈ కథ తెలుసుకోవాలంటే.. మనం దానికి ముందు జరిగిన కొన్ని విషయాలను మననం చేసుకోవాలి.

1947 కశ్మీర్ యుద్ధం తర్వాత బాంబర్ విమానం అవసరం ఉన్నదనే ఆలోచనలు వచ్చాయి. కానీ, అప్పుడు మన దగ్గర కొత్త యుద్ధ విమానాలేవీ లేవు. కానీ, రాయ్ ఎయిర్‌ఫోర్స్, యూఎస్ ఎయిర్‌ఫోర్స్ వదిలి వెళ్లిపోయిన విమానాలను భారత వైమానిక దళం, హిందుస్తాన్ ఎరోనాటిక్స్ లిమిటెడ్ రెనోవేట్ చేశాయి. 1951 కల్ల 16 విమానాలను రిపేర్ చేసి కొత్త పరికరాలను చేర్చి కొంత మేరకు సమర్థవంతంగా తయారు చేశాయి.

ఎయిర్‌క్రాఫ్టుల్లో సీ-87 వేరియంట్ ఉన్నది. బీ-24 కంటే ఇది మెరుగైనది. దీనికి ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. బాంబింగ్, ఆయుధ వ్యవస్థలను దీని నుంచి తొలగించారు. నేవిగేటర్ సీటును పైలట్ వెనక్కి రీలొకేట్ చేశారు. దీనికి ‘ది లిబరేటర్ ఎక్స్‌ప్రెస్’ అని పేరుపెట్టారు.

ఈ విమానంలో చాలా మార్పులు చేశారు. కెమెరా, సిబ్బంది సౌకర్యంవంతంగా ప్రయాణించే ఏర్పాట్లు చేశారు. ఎలక్ట్రిసిట ద్వారా వేడయ్యే సూట్స్ వంటివి రెడీ చేశారు.

ఆ విమానంలో కెమెరా స్మూత్‌గా కదలడానికి ఎలక్ట్రికల్లీ హీటెడ్ కవర్లు, కెమెరామెన్ కూడా ఆక్సిజన్ సిలిండర్లు వెంట బెట్టుకుని ఎటైనా తిరిగేలా ప్లాన్ చేశారు. అయితే, ఇలాంటి మార్పులు అన్నీ కూడా రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఎందుకంటే.. ఈ ఫీట్ చేయడానికి ముందే ప్రచారం కావద్దని భావించారు.

అయితే, ఎవరెస్టు పర్వతరాల్లో వాతావరణం ఎలా ఉంటుందో తెలియని కారణంగా.. ఈ విమానం నుంచి వచ్చే భారీ శబ్దాలతో మంచు తుఫాన్లు జరిగే ముప్పు ఉన్నదని తొలుత భయపడ్డారు. విమాన సిబ్బంది ప్రాణాల కోసమూ భయపడ్డారు. అందుకే ఈ ప్లాన్ ఒకసారి అమలుకు నోచుకోక వాయిదా పడింది.

అయితే.. బ్రిటీష్ రాణికి పట్టాభిషేకం జరిగిన రోజే అంటే 1953 జూన్ 2వ తేదీన ఈ సాహసం గురించి ప్రకటించారు. జూన్ 6వ తేదీన గయా నుంచి ఉదయం 8 గంటలకు ఉత్తరం వైపున క్రమంగా పైకి ఎగురుతూ ది లిబరేటర్ ఎక్స్‌ప్రెస్ ఆకాశంలోకి దూసుకెళ్లింది. దీన్ని సమర్థంగా హ్యాండిల్ చేయడం అవసరం ఎందుకంటే.. ఈ విమానం సామర్థ్యానికి మించి ఎత్తుకు ఎగరాల్సి ఉన్నది.

సుమారు 15వేల అడుగుల ఎత్తులో వేడైన సూట్లు ధరించాలని, మాస్కులు పెట్టుకోవాలని పైలట్ సిబ్బందికి సూచించారు. సుమారు 75 నిమిషాల తర్వాత 32 అడుగుల ఎత్తు నుంచి రాజసంగా పరుచుకుని నిశ్చలంగా ఉన్న ఎవరెస్టు సౌందర్యాన్ని వారు వీక్షించారు. మేఘాలు అడ్డు వస్తాయన్న సంశయాలకు భిన్నంగా నిర్మలమైన ఆకాశం ఉండింది. ఎవరెస్టు పర్వతం ఫొటోకు పోజు ఇచ్చినట్టుగానే ఉన్నది.

సుమారు గంట సేపు వారు శిఖరం చుట్టూ చక్కరలు కొట్టి నాలుగు కెమెరాల్లో అద్భుత దృశ్యాలను పట్టుకున్నారు. ఈ ఫొటోలు ఎవరెస్టు శిఖరం గురించిన జ్ఞానాన్ని మరింత విస్తరించాయి. వీటిని భారత వైమానిక దళం ప్రపంచవ్యాప్త మీడియా సంస్థలకు కొంత రుసుమతో ఇచ్చేశాయి. ఇవన్నీ ఐఏఎఫ్‌కు అవసరాల కోసం ఉపయోగించుకోవడానికి సేకరించారు. 

సీ-87 లిబరేటర్ భారత్‌ను ప్రపంచపటంపై గర్వంగా నిలపగలిగింది.  

రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికాకు, చైనా లేదా బర్మాలకు ట్రాన్స్‌పోర్ట్ కోసం అమెరికా ఆర్మీకి చెందిన సీ-87ను వినియోగించారు. ఇది బట్వాడా చేసిన ప్రతి 1000 టన్నులకు ముగ్గురి చొప్పున వైమానిక సిబ్బంది మరణించారు. కానీ, ఆ విమానాన్ని భారత వైమానిక దళం సమర్థంగా ఆపరేట్ చేయడం కొసమెరుపు. ఆ తర్వాత కూడా లిబరేటర్ ఇలా ఎవరెస్టు శిఖరం చిత్రాలను తీసింది.

 

(ఫొటో కర్టసీ: ఆ ఫ్లైట్‌లో ఫొటోగ్రాఫర్‌గా వెళ్లిన లెఫ్టినెంట్ ఎన్‌డీ జయల్ కుటుంబం నుంచి ఈ ఫొటో అంచిత్ గుప్తా సేకరించి ట్వీట్ చేశారు)

-- (అంచిత్ గుప్తా మిలిటరీ కుటుంబంలో జన్మించారు. ఫైనాన్స్ ప్రొఫెషనల్. ప్రస్తుతం ఓ ప్రైవేటు ఈక్విటీ సంస్థలో మేనేజింగ్ డైరెక్టర్‌గా చేస్తున్నారు. భారత వైమానిక చరిత్రలో ఆయనకు ఆసక్తి ఎక్కువ. అందుకే భారత వాయు సేన చరిత్రను పలు వేదికలపై పంచుకుంటుంటారు.)

click me!