Prashant Kishor: నితీశ్‌కు లాస్ట్ ఇన్నింగ్, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్విప్: ప్రశాంత్ కిశోర్

By Mahesh K  |  First Published Jan 29, 2024, 7:29 PM IST

బిహార్ సీఎం నితీశ్ కుమార్‌కు ఇది లాస్ట్ ఇన్నింగ్స్ అని, ఆయనను ప్రజలు తిరస్కరించారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. సీటు కాపాడుకోవడానికి ఇప్పుడు ఆయన ఏమైనా చేస్తారని వివరించారు. లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని తెలిపారు.
 


Prashant Kishor: బిహార్ సీఎం నితీశ్ కుమార్ మళ్లీ ఎన్డీయే కూటమిలోకి చేరడంపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం నితీశ్ కుమార్‌కు ఇది లాస్ట్ ఇన్నింగ్ అని పీకే పేర్కొన్నారు. అంతేకాదు, లోక్ సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేశారు. ఇండియా టుడే మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల కూటమి మహాగట్‌బంధన్ నుంచి నితీశ్ కుమార్ బయటికి వెళ్లడం గురించి మాట్లాడుతూ.. నితీశ్ కుమార్ తన జీవితంలో చివరి ఇన్నింగ్స్ ఆడుతున్నాడని కామెంట్ చేశారు. నితీశ్ కుమార్ కన్నింగ్ వ్యక్తి అని పేర్కొన్నారు. 2025 అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 20 సీట్లకు మించి రాబోవని తెలిపారు. ‘వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 20 సీట్లు కూడా గెలుచుకోదు. ఆ పార్టీ ఏ కూటమిలో ఉన్నా ఇది సాధ్యం కాదు. ఒక వేళ 20 సీట్లకు పైగా జేడీయూ గెలుచుకుంటే నేను నా వృత్తిని వదులుకుంటాను’ అని పీకే వివరించారు.

Latest Videos

నితీశ్ కుమార్ ఆదివారం ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని బీజేపీతో చేతులు కలిపింది. ఎన్డీయే కూటమిలో చేరిన వెంటనే అదే రోజు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జేడీయూ, బీజేపీ కూటమి దీర్ఘకాలం కొనసాగబోదని వివరించారు. 2025 అసెంబ్లీ ఎన్నికల వరకూ ఈ కూటమి సాగబోదని తెలిపారు.  ‘ప్రజలు ఆయనను తిరస్కరించారు. అందుకే తన సీటు కాపాడుకోవడానికి ఇప్పుడు ఏమైనా చేస్తారు’ అని వివరించారు.

Also Read: Janasena: జనసేన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం జగన్.. ‘ఇది సబబేనా?’

‘బిహార్‌లో కేవలం నితీశ్ కుమారే కాదు.. బీజేపీ సహా అన్ని పార్టీలు పల్టూ రామ్‌లే. నిజానికి ఈ పరిణామాలు బీజేపీని నష్టం చేస్తాయి. ఒక వేళ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే.. చాలా సీట్లు గెలుచుకునే బలమైన స్థితిలో ఉండేది’ అని పీకే తెలిపారు.

click me!