కంటి చూపును కోల్పోయినా లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ ఏ మాత్రం అధైర్యపడలేదు.టెక్నాలజీని ఉపయోగించుకొని రాణిస్తున్నాడు.
న్యూఢిల్లీ: కొన్నేళ్ల క్రితం భారత సరిహద్దులో జరిగిన ఆపరేషన్ లో లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ తన కంటి చూపును కోల్పోయాడు. కంటి చూపును కోల్పోయినా పారా షూటింగ్ లో ఆయన రాణిస్తున్నాడు. కంటి చూపును కోల్పోయాయని ఆయన అధైర్యపడలేదు.
రోజువారీ తన పనుల కోసం ద్వారకేష్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ ను ఉపయోగించడంలో ద్వారకేష్ ప్రావీణ్యం సాధించారు.మధ్యప్రదేశ్ లోని ఇండియన్ ఆర్మీ పారాఒలింపిక్ నోడ్ లో ఎఐలో ఆయన శిక్షణ పొందాడు.
లెఫ్టినెంట్ కల్నల్ ద్వారకేష్ ప్రత్యేక గుర్తింపును పొందారు. దీంతో ఈ నెల 26న జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ కు ప్రత్యేక అతిథిగా ఆయనను ఆహ్వానించారు.షూటింగ్ లో జాతీయ పతకాలను సాధించడమే కాకుండా సియాచిన్ గ్లేసియర్ ను ద్వారకేష్ అధిరోహించారు. తాను తన దృష్టిని కోల్పోయాను. కానీ, జీవితంపై తన దృష్టిని కాదని ఆయన ఏషియానెట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.