ప్రతీ నెల చివరి ఆదివారం భారత ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారనే విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా పలు అంశాల గురించి పీఎం ప్రస్తావిస్తుంటారు. ఇందులో భాగంగానే తాజాగా ఆదివారం మోదీ పలు కీలక విషయాలను పంచుకున్నారు..
Mann Ki Baat: ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రేడియో ప్రోగ్రాం మన్ కీ బాత్ ద్వారా తన అభిప్రాయాలను దేశ ప్రజలతో పంచుకున్నారు. ఈ సందర్భంగా పెరుగుతున్న టెక్ట్స్ వేస్ట్ గురించి ఆందోళన వ్యక్తం చేశారు. బట్టల్ని రీసైకిల్ చేయమని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రధాని.
ఈ విషయమై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "నేను మనందరికీ సంబంధించిన ఒక సవాలు గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది 'textile waste' గురించి. టెక్స్‌టైల్ వేస్ట్ అంటే ఏమిటి అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. నిజానికి, టెక్స్‌టైల్ వేస్ట్ ప్రపంచానికి ఒక పెద్ద ఆందోళనగా మారుతోంది.
పీఎం మాట్లాడుతూ, "ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాత బట్టల్ని వీలైనంత త్వరగా తీసేసి కొత్త బట్టలు కొనే ట్రెండ్ పెరిగిపోయింది. మీరు వేసుకోవడం మానేసిన పాత బట్టలు ఏమవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? అదే టెక్స్‌టైల్ వేస్ట్ అవుతుంది. ఈ విషయంపై చాలా గ్లోబల్ రీసెర్చ్ జరుగుతోంది. ఒక రీసెర్చ్‌లో 1% కంటే తక్కువ టెక్స్‌టైల్ వేస్ట్ కొత్త బట్టలుగా మారుస్తున్నారని తేలింది." అని చెప్పుకొచ్చారు.
పీఎం మోదీ మాట్లాడుతూ, "టెక్స్‌టైల్ వేస్ట్ ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో ఇండియా మూడో స్థానంలో ఉంది. ఈ సవాలును ఎదుర్కోవడానికి మన దేశంలో చాలా మంచి ప్రయత్నాలు జరుగుతున్నందుకు నాకు సంతోషంగా ఉంది. చాలా భారతీయ స్టార్టప్‌లు టెక్స్‌టైల్ రికవరీ ఫెసిలిటీపై పని చేయడం మొదలుపెట్టాయి. చాలా మంది యువకులు సస్టెయినబుల్ ఫ్యాషన్ ప్రయత్నాలతో కనెక్ట్ అయ్యారు. వాళ్లు పాత బట్టలు, చెప్పుల్ని రీసైకిల్ చేసి అవసరమైన వాళ్లకు అందిస్తున్నారు. Textile waste నుంచి డెకరేషన్ వస్తువులు, హ్యాండ్‌బ్యాగ్‌లు, స్టేషనరీ, బొమ్మలు లాంటి చాలా వస్తువులు తయారు చేస్తున్నారు. చాలా సంస్థలు ఇప్పుడు సర్క్యులర్ ఫ్యాషన్ బ్రాండ్‌ను పాపులర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి."
ఆయన ఇంకా మాట్లాడుతూ, "Textile waste ను ఎదుర్కోవడంలో కొన్ని నగరాలు కొత్త గుర్తింపు తెచ్చుకుంటున్నాయి. హర్యానాలోని పానిపట్ టెక్స్‌టైల్ రీసైక్లింగ్ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతోంది. బెంగళూరు కూడా ఇన్నోవేటివ్ టెక్ సొల్యూషన్స్‌తో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇక్కడ సగానికి పైగా Textile waste ను కలెక్ట్ చేస్తున్నారు. ఇది మన ఇతర నగరాలకు కూడా ఒక ఉదాహరణ." అని ప్రధాని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.