కొత్త జంటకు భయంకర అనుభవం.. పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేస్తుండగా ఆగ్రహంతో గందరగోళం చేసిన ఏనుగు.. వీడియో వైరల్

By team teluguFirst Published Dec 1, 2022, 3:10 PM IST
Highlights

ఓ కొత్త జంట పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేసుకునేందుకు కేరళలోని ప్రసిద్ధ ఆలయానికి వెళ్లింది. ఫొటో గ్రాఫర్ ఫొటోలు తీయడం మొదలు పెట్టగానే అక్కడే ఉన్న ఏనుగు రెచ్చిపోయింది. ఆ ప్రాంతమంతా గందరగోళం సృష్టించింది.

పెళ్లంటే ఇప్పుడు ఫొటో షూట్ తప్పనిసరిగా ఉంటోంది. ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ షూట్ అంటూ ఇలా కొత్త జంటలు తమ మధుర స్మృతులను కెమెరాల్లో బంధించుకుంటోంది. దీని కోసం ఆహ్లాదకరైమన, అందమైన ప్రదేశాలను ఎంచుకుంటోంది. అయితే ఓ జంట ఆలయ ప్రాంగణంలో పోస్ట్ వెడ్డింగ్ షూట్ చేయాలని భావించింది. ప్లాన్ ప్రకారమే అంతా సిద్ధమయ్యింది. కానీ షూట్ నిర్వహిస్తున్న సమయంలో ఆ జంటకు ఓ భయంకరమైన అనుభవం ఎదురైంది.

వారు రాముడి ఉనికిని ఎప్పుడూ నమ్మరు.. అలాంటి వారు.. : ప్రధాని మోడీ

కేరళలోని గురువాయూర్ ఆలయాన్ని ఓ కొత్తగా పెళ్లయిన జంట సందర్శింది. ఈ సమయంలో వీడియో, ఫొటో షూట్ నిర్వహించాలని భావించింది. అయితే షూట్ ప్రారంభమైన తరువాత అక్కడ ఓ ఏనుగు నిలబడి ఉంది. ఆ ఫొటోగ్రాఫర్ ఏనుగును కూడా ఫ్రేమ్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఏనుగు ఒక్క సారిగా ఆగ్రహంతో రెచ్చిపోయింది. ఆ ప్రాంతమంతా గందరగోళం సృష్టించింది. దీంతో ఆ జంట పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి తప్పించుకుంది. ఆలయ ముఖద్వారం దగ్గర ఉన్న భక్తులు కూడా పరుగులు పెట్టారు. 

ఏనుగు తన తొండాన్ని ఉపయోగించి అటుగా వెళ్తున్న ఓ మనిసి లాగేసి కిందపేడేసింది. కానీ అతడు వెంటనే లేచి తప్పించుకున్నాడు. అతడి పట్టబట్టలు కూడా అక్కడే పడిపోయాయి. అయితే ఏనుగుపై కూర్చున్న మావటి దానిని నియత్రించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అక్కడ మూడు రోజుల డ్రై డే.. రేపటి నుంచి 4వ తేదీ వరకు మందు బంద్

ఈ వీడియోను వెడ్డింగ్ మోజిటో అనే ఫోటోగ్రాఫర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ ఘటన త్రిస్సూర్‌లోని గురువాయూర్ నవంబర్ 10న జరిగిందని ‘మాతృభూమి’ కథనం నివేదించింది. ఏడు రోజుల క్రితం ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు ఈ క్లిప్ ను 1,200 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఇష్టపడ్డారు.

వరుడు ఈ ఘటనను గుర్తుచేసుకున్నాడు. ఓ వీడియోలో తన అనుభవాన్ని చెప్పాడు. ‘‘ మేము ఫోటో కోసం పోజులిస్తున్నాము. అకస్మాత్తుగా అందరూ అరుస్తూ పరిగెత్తడం ప్రారంభించారు. నా భార్య కూడా నా చేయి పట్టుకొని పరిగెత్తింది’’ అని తెలిపాడు. కాగా.. ఈ జంట ఫొటో షూట్ నిర్వహించిన గురువాయూర్ దేవాలయం హిందూ వివాహ ఆచారాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

కన్నతండ్రే కీచకుడు.. స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్‌తో హాస్పిటల్‌లో బాలిక.. తండ్రి హత్యాయత్నం

ఇదిలా ఉండగా.. కొన్ని నెలల క్రితం కేరళలోని కొల్లాం అటవీ ప్రాంతంలో ఓ వ్యక్తిని అడవి ఏనుగులు తొక్కి చంపిన సంగతి తెలిసిందే. 50 ఏళ్ల మధ్య వయసున్న వ్యక్తి దట్టమైన అడవి గుండా వెళ్లే రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మూడు ఏనుగుల గుంపు దాడి చేసిందని పోలీసులు తెలిపారు.
 

click me!