అక్కడ మూడు రోజులు డ్రై డే.. రేపటి నుంచి 4వ తేదీ వరకు మందు బంద్

By Mahesh KFirst Published Dec 1, 2022, 3:03 PM IST
Highlights

దేశ రాజధాని ఢిల్లీలో రేపటి నుంచి 4వ తేదీ వరకు లిక్కర్ అమ్మకాలపై నిషేధం అమలు కానుంది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ ఈ నిర్ణయాన్ని  ప్రకటించింది. ఓట్ల లెక్కింపు రోజున 7వ తేదీన కూడా ఈ నిషేధం అమలవుతుందని వివరించింది.
 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సమీపించాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీలో మూడు రోజుల పాటు డ్రై డే అమలు కానుంది. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఆల్కహాల్‌ను ప్రభుత్వం బ్యాన్ చేసింది. ఢిల్లీ ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మూడు రోజుల కాదు.. మున్సిపల్ కార్పొరేషన్‌లు జరిగిన పోలింగ్ ఓట్లనూ లెక్కించే నాడు కూడా డ్రై డే అమలు అవుతుందని ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. షాపులు, క్లబ్‌లు, బార్లు, ఇతర చోట్లలోనూ మద్యం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధాన్ని అమలు చేసిన రోజును డ్రై డే అంటారు. 

ఢిల్లీలో స్థానిక ఎన్నికలు 250 వార్డుల్లో జరుగుతాయి. ఇవి డిసెంబర్ 4వ తేదీన జరుగుతాయి. ఈ ఎన్నికలను ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పోరుగా చూస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలకు ప్రాధాన్యత మరింత ఎక్కువైంది.

Also Read: డిల్లి లిక్కర్ స్కాం...నన్ను జైల్లో పెడతారు అంతేగా..!: ఎమ్మెల్సీ కవిత సంచలనం

ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ క్రిష్ణ మోహన్ ఉప్పు డ్రై డే గురించి వెల్లడించారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు డ్రై డేలుగా పాటించాలని వివరించారు. 2వ తేదీ సాయంత్రం 5.30 గంటల నుంచి 4వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు ఈ నిషేధం అమలవుతుందని తెలిపారు. అంతేకాదు, ఓట్ల లెక్కింపు రోజున అంటే డిసెంబర్ 7వ తేదీన కూడా 24 గంటలపాటు ఆల్కహాల్ అమ్మకాలపై నిషేధం ఉంటుందని పేర్కొన్నారు.

click me!