శబరిమలకు పొటెత్తిన జనం.. అయ్యప్ప భక్తులకు అలర్ట్..

By Mahesh Rajamoni  |  First Published Dec 11, 2023, 1:45 PM IST

Sabarimala: శబరిమలలో భ‌క్తుల‌ రద్దీతో సహా యాత్రికుల ఫిర్యాదులను అధ్యయనం చేయడానికి న్యాయవాదుల బృందాన్ని నియమించే అంశాన్ని హైకోర్టు పరిశీలిస్తోంది. ఇదే స‌మ‌యంలో భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం బోర్డు ద‌ర్శ‌నం విష‌యంల కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.
 


Sabarimala Lord Ayyappa Swamy: శ‌బ‌రిమ‌లకు భ‌క్తులు పొటెత్తున్నారు. పెద్ద సంఖ్య‌లో భ‌క్తులు రావ‌డంతో శ‌బ‌రిమ‌ల అయ్య‌ప్ప స్వామి నామ‌స్మ‌ర‌ణంతో ఆల‌యం ప్రాంగ‌ణాలు మారుమ్రోగుతున్నాయి. అయితే, పెద్ద సంఖ్య‌లో వ‌స్తున్న భక్తులు ప‌లు ఇబ్బందులు ఎర్కొంటున్నార‌నే ఫిర్యాదులు క్ర‌మంలో ట్రావెన్ కోర్ దేవ‌స్థానం బోర్డుతో పాటు ప్ర‌భుత్వ యంత్రాంగం చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఈ క్ర‌మంలోనే శబరిమల అయ్యప్ప ఆలయంలో తీర్థయాత్రలకు వచ్చే భక్తుల సంఖ్య పెరగడంతో దర్శన సమయాలను గంటపాటు పెంచుతూ ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) నిర్ణయం తీసుకుంది.

అయ్యప్ప దర్శనం రెండో భాగంలో మధ్యాహ్నం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఉండగా, దానిని మధ్యాహ్నం 3 గంటల నుంచి 11 గంటల వరకు దర్శన సమయాలను మార్చాలని బోర్డు నిర్ణయించినట్లు జిల్లా యంత్రాంగం అధికారి ఒకరు తెలిపారు. దీంతో భక్తుల దర్శనం సమయం ఒక గంటపాటు అదనంగా పెంచారు. దర్శనం కోసం క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులకు నీరు, బిస్కెట్లు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Latest Videos

undefined

మరోవైపు భక్తులకు సౌకర్యాలు సరిపోడ కల్పించడం లేదనీ, దర్శనం కోసం భక్తులు 15 నుంచి 20 గంటల పాటు వేచి ఉండాల్సి వస్తోందని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వీడీ సతీశన్ అన్నారు. భక్తులకు కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. భక్తులకు సహాయం చేయడానికి శబరిమలలో తగినంత మంది పోలీసు సిబ్బందిని నియమించలేదనీ, యాత్రికుల ఏర్పాట్లకు సంబంధించి కేరళ హైకోర్టు మార్గదర్శకాలు అమలు చేయలేదన్నారు. అలాగే, తగినంత అంబులెన్స్ సేవలు కూడా అందుబాటులో లేవని సతీశన్ పేర్కొన్నారు.

తక్షణ చర్యలు తీసుకోకపోతే శబరిమలలో భక్తుల ఇబ్బందులు మ‌రింగా పెరుగుతాయ‌ని అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాలని కోరారు. దర్శనం కోసం 10-12 గంటలకు పైగా క్యూలైన్లలో నిల్చున్నారని పలువురు భక్తులు ఫిర్యాదు చేస్తున్నారు. అలాగే, శబరిమలకు వెళ్లే మార్గంలో యాత్రికులు ట్రాఫిక్ జామ్ ఇబ్బుందు ఎదుర్కొంటున్నారు. శబరిమలలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ భక్తుల సంఖ్యను రోజుకు 75 వేలకు పరిమితం చేయాలని పోలీసులు టీడీబీని కోరారు. ప్రస్తుతం జరుగుతున్న మూడో దశ యాత్రలో వర్చువల్ క్యూ ద్వారా 90 వేలు, స్పాట్ బుకింగ్ ద్వారా 000 వేల బుకింగ్స్ జరుగుతుండటంతో భక్తుల సంఖ్య పెరిగిందన్నారు.

దీనికితోడు ఈసారి పిల్లలు, మహిళలు, వృద్ధులు ఎక్కువగా ఉన్నారనీ, ఇవి భక్తులను త్వరగా పతినెట్టంపాడి (18 దివ్య మెట్లు) ఎక్కేలా చేసే ప్రయత్నాలను ప్రభావితం చేశాయని అధికారులు తెలిపారు. పవిత్ర మలయాళ మాసం వృషికం మొదటి రోజైన నవంబర్ 41న 16 రోజుల పాటు జరిగే మండల-మకరవిలక్కు యాత్ర ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా చాలా మంది భక్తులు అయ్యప్ప మాల ధరించారు. భక్తులందరికీ సురక్షితంగా, సజావుగా దర్శనం కల్పించేందుకు ప్రభుత్వం ఈ సీజన్ లో సన్నిధానంలో రద్దీని నియంత్రించేందుకు డైనమిక్ క్యూ కంట్రోల్ వ్యవస్థను ప్రవేశపెట్టింది.

click me!