Article 370 పై సంచ‌న‌ల తీర్పు.. జ‌మ్మూకాశ్మీర్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌పై సుప్రీంకోర్టు కీల‌క ఆదేశాలు

By Mahesh Rajamoni  |  First Published Dec 11, 2023, 12:22 PM IST

Article 370 Verdict: ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌వాలు చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు తీర్పును వెలువ‌రిస్తూ రాజ్యాంగంలోని అన్ని నిబంధనలను జమ్మూ కాశ్మీర్‌కు 370(1)(డీ)కి వర్తింపజేయవచ్చని పేర్కొంది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల గురించి కీల‌క ఆదేశాలు జారీ చేసింది. 
 


SupremeCourt on Article370 : జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర పున‌రుద్ద‌ర‌ణ‌కు సంబంధించి చ‌ర్య‌లు తీసుకోవాల‌ని భార‌త అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు కేంద్ర ప్ర‌భుత్వం, ఎన్నిక‌ల సంఘాన్ని ఆదేశించింది. అలాగే, ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని పేర్కొంది. వివ‌రాల్లోకెళ్తే.. ఆర్టిక‌ల్ 370ని ర‌ద్దు చేస్తూ గ‌తంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ను వ్య‌తిరేకిస్తూ వివిధ పొలిటిక‌ల్ పార్టీలు, రాజ‌కీయ నాయ‌కులు, సామాజిక కార్యక‌ర్త‌లు స‌హా కొంత మంది సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుతో పాటు జ‌మ్మూకాశ్మీర్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభ‌జించ‌డాన్ని స‌వాలు చేశారు. దీని మీద అందించిన అన్ని పిటిష‌న్ల‌ను సుప్రీంకోర్టు క‌లిపి విచార‌ణకు స్వీక‌రించింది. 

ఈ విచార‌ణ త‌ర్వాత సోమ‌వారం (2023 డిసెంబ‌ర్ 11) ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును స‌వాలు చేస్తూ దాఖ‌లైన పిటిష‌న్ల‌పై తీర్పును వెలువ‌రించింది. ఈ క్ర‌మంలోనే ఆర్టికల్ 1, 370లో ప్రతిబింబించే విధంగా జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా మారిందని తెలిపింది. పిటిష‌న‌ర్ల వాద‌న‌ల‌ను తోసిపుచ్చింది. ఇదే స‌మ‌యంలో భార‌త ఎన్నిక‌ల సంఘానికి కీల‌క ఆదేశాలు ఇచ్చింది. 2024 సెప్టెంబర్ 30 నాటికి జమ్ముకాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని తాము ఆదేశిస్తున్నామని తెలిపింది. ఆర్టికల్ 370 కేసులో తీర్పును చదివిన సీజేఐ డీవై చంద్ర‌చూడ్.. జ‌మ్మూకాశ్మీర్ రాష్ట్ర పున‌రుద్ద‌ర‌ణ‌కు చ‌ర్య‌లు తీసుకోవ‌డంతో పాటు అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని పేర్కొన్నారు.

Latest Videos

ఇక సుప్రీంకోర్టు తాజా ఆదేశాల‌తో జ‌మ్మూకాశ్మీర్ లో అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డానికి, రాష్ట్రంగా మ‌ళ్లీ పున‌రుద్ద‌రించ‌డానికి మార్గం మ‌రింత సుగ‌మం అయింద‌ని చెప్ప‌వ‌చ్చు. 2019 ఆగస్టు 5న,  కేంద్ర హోం మంత్రి అమిత్ షా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ ల‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే, త్వ‌ర‌లోనే మ‌ళ్లీ రాష్ట్ర హోదాను క‌ల్పిస్తామ‌ని ఆ స‌మ‌యంలో ప్ర‌క‌టించారు. ఎన్నికల నిర్వహించిన తర్వాత ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

Read More: ఆర్టిక‌ల్ 370 ర‌ద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. పూర్తి వివ‌రాలు ఇవిగో

Article 370 అంటే ఎమిటి? ఎందుకు తీసుకువ‌చ్చారు? ర‌ద్దు త‌ర్వాత ర‌చ్చ‌.. పూర్తి వివ‌రాలు ఇవిగో

click me!