
తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ భారీ వర్షాల కారణంగా చెన్నై నగరంలో ముగ్గురు మృతి చెందారు. భారీ వర్షాల కురుస్తున్న 4 జిల్లాల్లో తమిళనాడు ప్రభుత్వం రెడ్ అలెర్ట్ గా ప్రకటించింది. ఇందులో చెన్నై, కాంచీపురం, తిరువళ్లూరు, చింగ్లేపేట జిల్లాలు ఉన్నాయి.
భారత్‌లో 1,270కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. ఒక్కరోజే 16వేలకు పైగా కరోనా కేసులు..
చెన్నైలో మృతి చెందిన ముగ్గురు కరెంట్ షాక్ వల్ల మృతి చెందారని తెలుస్తోంది. ఇందులో ఒట్టేరి ప్రాంతానికి చెందిన 70 ఏళ్ల తమిళరసి, మైలాపూర్‌లోకు చెందిన 13 ఏళ్ల బాలుడు, పులియంతోప్‌కు చెందిన 45 మహిళ ఉన్నారు. ఈ మహిళ ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహిళగా ప్రభుత్వం గుర్తించింది. ఈ భారీ వర్షాల నేపథ్యంలో తమిళనాడు దేవాదాయ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కె.కె.ఎస్.ఆర్ రామచంద్రన్ మీడియాతో మాట్లాడారు. చెన్నై నగరంలోని 106 వీధులు జలమయమయ్యాయని అన్నారు. వర్షం తగ్గిన తరువాత వరద ఉదృతి తగ్గిపోతుందని అన్నారు. చెన్నై చుట్టుపక్కల ఉన్న రిజర్వాయర్లలో ఉన్న నీటిని భద్రత కోసం అవసరమైతే విడుదల చేస్తామని తెలిపారు.
డ్రాగన్ దూకుడు: అరుణాచల్‌ప్రదేశ్‌లో 15 ప్రాంతాలకు పేర్లు మార్చిన చైనా
గురువారం రాత్రి తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ గ్రేటర్ చెన్నై కార్పొరేషన్‌లోని ఫ్లడ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. చైన్నే నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, సహాయ, సహాయక చర్యలను సమీక్షించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారత వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం 8.30 నుండి సాయంత్రం 7.45 వరకు చైన్నైలోని ఎంఆర్‌సీ నగర్ లో 198 మిల్లీ మీటర్లు, నుంగంబాక్కం ఏడబ్ల్యూఎస్ లో 159.5 మిల్లీ మీటర్లు, వైఎంసీఏ నందనంలో 152 మిల్లీ మీటర్లు, అన్నా యూనివర్సిటీ ప్రాంతంలో 121 మిల్లీ మీటర్లు, కాంచీపురం జిల్లాలోని ఏసీఎస్ మెడికల్ కాలేజీ ప్రాంతంలో 108.5 మిల్లీ మీటర్లు, మీనంబాక్కం ఇస్రో ఏడబ్ల్యూఎస్ ప్రాంతంలో 108 మిల్లీ మీటర్లు, సత్యభామ యూనివర్సిటీ ప్రాంతంలో 58.5 మిల్లీ మీటర్లు, తిరువళ్లూరు జిల్లాలోని తిరూర్ కేవీకేలో 46.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
సవతి తండ్రితో ప్రేమాయణం.. 40 కోట్ల ఆస్తి దక్కదని.. తల్లిని కిరాతకంగా హత్య చేయించిన కూతురు..
రాబోయే మూడు రోజులలో ఉత్తర కోస్తా తమిళనాడు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ పరిసర ప్రాంతాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్ర తెలిపింది. మూడు రోజుల పాటు ఆగ్నేయ ద్వీపకల్ప భారతదేశంలో వర్షపాతం పెరిగే ఆ తరువాత తగ్గుతుందని చెప్పింది. అయితే గురువారం దేశంలోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. మహారాష్ట్రలోని యవత్‌మాల్, నాగపూర్ ప్రాంతాల్లో మంచు రాళ్లతో కూడిన వర్షం కురిసింది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆసిఫాబాద్ ప్రాంతంతో రాళ్ల వర్షం పడింది. బుధవారం సాయంత్రం నుంచి ఈ ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు అతి శీతల గాలుగు వీశాయి. దీంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అలాగే తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు కురిశాయి. నేడు కూడా రాష్ట్రంలోని పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.