తమిళనాడు సీఎం కీలక నిర్ణయం: ఈ ఐదు నగరాల్లో పూర్తి స్థాయి లాక్‌డౌన్

By Siva Kodati  |  First Published Apr 24, 2020, 9:02 PM IST

తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఐదు నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. 


భారతదేశంలో కరోనా వైరస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దేశంలో మే 3 వరకు ప్రధాని నరేంద్రమోడీ లాక్‌డౌన్‌ను పొడిగించగా.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిని మే 7 వరకు పొడిగించారు.

ఇదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం నుంచి రాష్ట్రంలోని ఐదు నగరాల్లో పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు.

Latest Videos

Aslo Read:నేలపై పోలీసుల నిద్ర: ఫొటోలు వైరల్, కరోనా సమరయోధులకు థ్యాంక్స్

రాజధాని చెన్నై, కోయంబత్తూర్, మధురై, సేలం, తిరుప్పూర్‌లలో పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉంటాయని పళనిస్వామి చెప్పారు. ఈ నెల 26 నుంచి 29 వరకు ఈ నగరాల్లో లాక్‌డౌన్ ఉంటుందని సీఎం తెలిపారు.

ఈ రోజుల్లో ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది. అలాగే సేలం, తిరుప్పూర్‌లలో ఆదివారం నుంచి 28 వరకు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 9 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుందని పళనిస్వామి వెల్లడించారు.

Also Read:ఎయిమ్స్ నర్సుకు కరోనా: 40 మంది క్వారంటైన్‌కి తరలింపు

హాస్పిటల్స్, రాష్ట్ర ప్రభుత్వం నడిపే షాపులు, అమ్మ క్యాంటీన్లు, ఏటీఎంలు, హోమ్ డెలివరీ ఇచ్చే రెస్టారెంట్లు తప్ప మిగిలిన అన్నీ మూసివేస్తామని సీఎం చెప్పారు. తమిళనాడులో చెన్నై, మధురై, కోయంబత్తూరు, తిరుపూర్, సేలంలో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి.

తాజాగా కోయంబత్తూర్‌లో ఏడుగురు పోలీస్ సిబ్బందికి కరోనా సోకింది. వీరిలో ముగ్గురు మహిళా పోలీసులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడులో ఇప్పటి వరకు 1,683 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 752 మంది కోలుకున్నారు. 20 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 
 

click me!