ఫేక్ ఐడీలతో ఇండియాకు వ్యతిరేకంగా ఐఎస్ఐ ప్రచారం: ఖాతా తొలగించిన ట్విట్టర్

By narsimha lodeFirst Published Apr 24, 2020, 5:02 PM IST
Highlights

గల్ప్ దేశాల్లో భారత్ పై తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్న ఖాతాను ట్విట్టర్ తొలగించింది. 
 

న్యూఢిల్లీ: గల్ప్ దేశాల్లో భారత్ పై తప్పుడు వార్తలను ప్రచారం చేసేందుకు ఉపయోగిస్తున్న ఖాతాను ట్విట్టర్ తొలగించింది. 

సౌదీరాణి నౌరాబింట్ ఫైసల్ పేరును అనుకరించేలా నౌరాఅల్‌సాద్ ఐడీ పేరుతో ఇతనియాలుసాఫ్ అనే ఖాతాను కూడ ట్విట్టర్ నిలిపివేసింది.
నియమ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఈ ట్విట్టర్ ఖాతాను ఉపయోగించారాని ట్విట్టర్ అభిప్రాయపడింది. 

భారత్ వ్యతిరేక ప్రచారాన్ని ఈ ట్విట్టర్ ఖాతా ద్వారా భారత్ కు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించిన విషయమై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా ట్విట్టర్ అభిప్రాయపడింది.

ఇతరులను బెదిరించడం, వేధింపులకు గురిచేయడం వంటి కార్యకలాపాలు సాగిస్తున్నందున ఇవి తమ ప్రమాణాలకు అనుగుణంగా లేవని ట్విట్టర్ ఈ ఖాతాను తొలగించింది.ఈ ట్విట్టర్ ఖాతాను పాకిస్తాన్ నుండి ఆపరేట్ చేశారు.

ప్రధాని మోడీపై గల్ప్ దేశాల్లో పలు సోషల్ మీడియాల ద్వారా ఐఎస్ఐ వ్యతిరేక ప్రచారం చేస్తోందని భారత భద్రతా దళాలు అభిప్రాయపడుతున్నాయి.నకిలీ లేదా హ్యాక్ చేసిన సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఇండియాకు వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారంలో పాకిస్తాన్ పాత్ర ఉందని ఇంటలిజెన్స్ అధికారులు ఓ పత్రాన్ని సిద్దం చేస్తున్నారు.

also read:ఎయిమ్స్ నర్సుకు కరోనా: 40 మంది క్వారంటైన్‌కి తరలింపు

ఇండియాపై విద్వేషపూరితమైన ప్రచారం చేసేందుకు గల్ప్ రాజవంశీకుల పేరుతో నకిలీ ఖాతాలను తెరిచారని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు.ఒమన్ రాజకుటుంబానికి చెందిన వ్యక్తి పేరుతో నకిలీ ఖాతాను తెరిచారు. ఈ ఖాతా ద్వారా కూడ భారత్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం సాగిందని ఇంటలిజెన్స్ అధికారులు చెబుతున్నారు.

భారత్ కు వ్యతిరేక ట్వీట్లు ఈ ట్విట్టర్ హ్యాండిల్ నుండి చేసినట్టుగా తేలింది. పాకిస్తాన్ కు చెందిన మీడియా సిబ్బందితో పాటు చాలా మంది ఈ ట్వీట్లను రీ ట్వీట్ చేశారు.

click me!