DCW Chief Swati Maliwal : ఢిల్లీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ స్వాతి మలివాల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె ఢిల్లీలో మహిళలపై యాసిడ్ దాడులు, వారిపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పోరాడారు. ఆమె 2015లో డీసీడబ్ల్యూ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు.
Swati Maliwal : మహిళలపై జరిగే దాడులను నిరసిస్తూ తరచూ వార్తల్లో నిలిచే ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం దేశ రాజధానిలోని ఐటీఓలోని వికాస్ భవన్ లో ఉన్న కార్యాలయం ఆమె నుంచి తన నివాసానికి బయలుదేరారు. ఈ సందర్భంగా మలివార్ భావోద్వేగానికి గురయ్యారు. తన సహచరులను కౌగిలించుకున్నారు.
హైజాగ్ కు గురైన భారతీయులున్న నౌక.. సోమాలియా తీరంలో ఘటన.. రంగంలోకి ఐఎన్ఎస్ చెన్నై
మలివార్ ఎందుకు రాజీనామా చేశారంటే ?
చాలా కాలంగా స్వాతి మలివార్ ఢిల్లీ మహిళా కమిషన్ కు చైర్ పర్సన్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే ఆమెను రాజ్యసభ్యకు నామినేట్ చేస్తున్నామని ఆమ్ ఆద్మీ పార్టీ శుక్రవారం ప్రకటించింది. ఈ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే మలివార్ డీసీడబ్ల్యూ చీఫ్ పోస్టుకు రాజీనామా చేశారు. కాగా.. జనవరి 19న ఢిల్లీలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ శుక్రవారం అభ్యర్థులను ఖరారు చేసింది.
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ ను తొలిసారిగా నామినేట్ చేసిన కమిటీ.. సంజయ్ సింగ్, ఎన్ డీ గుప్తాలను రెండోసారి రాజ్యసభకు నామినేట్ చేసింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన కమిటీ ప్రస్తుతం ఉన్న ఇద్దరు సభ్యులను తిరిగి నామినేట్ చేయాలని నిర్ణయించింది. అయితే అదే పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా ఉన్న సుశీల్ కుమార్ గుప్తా ఈ సారి నామినేట్ అవ్వడానికి ఇష్టపడలేదు. ఆయన రాబోయే హర్యానా ఎన్నికల రాజకీయాల వైపు ఫోకస్ పెట్టాలని భావిస్తున్నారు.
హర్యానా ఎన్నికల్లో యాక్టివ్ గా ఉండాలనే ఆకాంక్షను ఆప్ తో సుశీల్ కుమార్ గుప్తా తెలియజేశారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ కథనం పేర్కొంది. అందుకే ఆయన నిర్ణయాన్ని ఆప్ గౌరవించింది. గుప్తా స్థానంలో స్వాతి మలివార్ ను రాజ్యసభకు నామినేట్ చేసింది. కాగా.. ఆప్ నామినేట్ చేసిన సంజయ్ సింగ్ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్నారు. అయితే అక్కడి నుంచే తన రాజ్యసభ సభ్యత్వానికి సంబంధించిన ఫారాలు, పత్రాలపై సంతకం చేయడానికి కోర్టు అనుమతి ఇచ్చింది.
యూపీఎస్సీ చైర్మన్ తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. టీఎస్‌పీఎస్సీ ప్రక్షాళనపై చర్చ
స్వాతి మలివార్ నేపథ్యం ఏంటంటే ?
స్వాతి మలివాల్ ఒక సామాజిక కార్యకర్త. న్యాయవాది. చిన్నవయసులోనే ఆమె మహిళల హక్కులు, సామాజిక సమస్యల కోసం పోరాడటంలో చురుకుగా వ్యవహరించారు. మహిళలపై హింసను ఎదుర్కోవడం, కఠినమైన చట్టాల కోసం వాదించడం, లింగ సమానత్వాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో మలివాల్ వివిధ ప్రచారాలు, ఉద్యమాలు నిర్వహించారు. 2015 సంవత్సరంలో ఆమె డీసీడబ్ల్యూ చైర్ పర్సన్ గా నియమితులయ్యారు. ఢిల్లీలో యాసిడ్ దాడులు, లైంగిక వేధింపులు, మహిళల భద్రత వంటి సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవడంలో కీలక పాత్ర పోషించారు.