అయోధ్య చరిత్ర తెలుసా? మరుగున పడిన రామజన్మభూమిని కనిపెట్టి, ఆలయాన్ని నిర్మించిందెవరంటే...

By SumaBala Bukka  |  First Published Jan 5, 2024, 4:11 PM IST

రాజు విక్రమాదిత్యుడు ఆవు పొదుగు నుండి పాలు పడటం ప్రారంభించిన ప్రదేశంలో శ్రీరాముని భారీ ఆలయాన్ని నిర్మించాడు. ఆ శ్రీరాముని ఆలయ బంగారు శిఖరం 80 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపించేదని చెబుతారు. 


అయోధ్య : అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం 22 జనవరి 2024న జరుగుతుంది. అదే రోజున ఇక్కడ గర్భగుడిలో శ్రీరాముని విగ్రహాన్ని కూడా ప్రతిష్టించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.

అయోధ్య రామ మందిర కథ 
అయోధ్య భూమి ప్రారంభమైనప్పటి నుండి ఉంది. అందువల్ల అయోధ్య ప్రాచీన సప్తపురిలలో ఒకటిగా పరిగణించబడుతుంది. సత్యయుగము నుండి ద్వాపర యుగం వరకు వ్రాసిన అనేక గ్రంథాలలో అయోధ్య వర్ణించబడింది, అయితే అయోధ్య అజ్ఞాతాంధకారంలో మునిగిన ఓ సమయం వచ్చింది. అప్పుడు ఉజ్జయిని రాజు విక్రమాదిత్య అయోధ్యను కనుగొని తిరిగి స్థాపించాడు. ఈ సంఘటన గీతా ప్రెస్ గోరఖ్‌పూర్ ప్రచురించిన అయోధ్య దర్శన్ పుస్తకంలో వివరించబడింది. కనిపించకుండా పోయిన అయోధ్య కోసం రాజు విక్రమాదిత్య ఎలా వెతికాడంటే.. 

Latest Videos

అయోధ్యను తిరిగి ఎలా కనిపెట్టారంటే.. 
పురాతన కాలంలో, ఉజ్జయిని రాజు విక్రమాదిత్య పాలన చాలా దూరం విస్తరించింది. ఒకసారి రాజు విక్రమాదిత్య తన సైన్యంతో అయోధ్య ప్రాంతం గుండా వెళుతుండగా, ఆ ప్రాంతానికి వచ్చేసరికి ఆయనకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. ఆ తరువాత విక్రమాదిత్య రాజు ప్రయాగ్‌రాజ్‌కి వచ్చినప్పుడు, ప్రయాగ్‌రాజ్ తీర్థ ఒక బ్రాహ్మణునిగా స్వయంగా ఆయనను కలుసుకుని, 'నువ్వు వస్తున్న ప్రదేశం అయోధ్య, శ్రీరాముడి జన్మస్థలం, దానిని నీవు మాత్రమే పునరుద్ధరించగలవు’ అని చెప్పాడు.

యూపీ జైళ్లలో రామాలయ ప్రాణప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారం..

దీని తరువాత, ప్రయాగ్రాజ్ బ్రాహ్మణ రూపంలో ఉన్న రాజు విక్రమాదిత్యకు శ్రీరాముడి జన్మస్థలం, అతని రాజభవనం, అయోధ్యలోని ఇతర ప్రదేశాల గురించి చెప్పాడు. రాజు విక్రమాదిత్య అక్కడికి చేరుకోగానే, ప్రయాగరాజ తీర్థ చెప్పిన విషయం మరచిపోయాడు. అప్పుడు మరొక సన్యాసి అక్కడికి వచ్చి, 'రాజా, మీరు ఇక్కడ ఒక తెల్లని ఆవును పిలిచి, ఆవు పొదుగు నుండి స్వయంచాలకంగా పాలు ప్రవహించే ప్రదేశాన్ని కనుగొనండి.. దానినే శ్రీరాముడి జన్మస్థలంగా పరిగణించండి’ అని చెప్పాడు.

రాజు విక్రమాదిత్యుడు కూడా అలాగే చేసి, ఆవు పొదుగు నుండి పాలు పడటం ప్రారంభించిన ప్రదేశంలో శ్రీరాముని భారీ ఆలయాన్ని నిర్మించాడు. ఆ శ్రీరాముని ఆలయ బంగారు శిఖరం 80 కిలోమీటర్ల దూరం నుండి కూడా కనిపించేదని చెబుతారు. అలా, ఆ కాలంలో ఉజ్జయిని రాజు విక్రమాదిత్య అయోధ్య అసలు ప్రాంతాన్ని పునఃస్థాపించాడు. 

గమనిక : ఈ కథనంలో ఇచ్చిన సమాచారం జ్యోతిష్యులు, పంచాంగం, మత గ్రంథాలు, నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ఈ సమాచారాన్ని మీకు అందించడానికి మేమొక= మాధ్యమం మాత్రమే. పాఠకులు ఈ సమాచారాన్ని సమాచారంగా మాత్రమే పరిగణించాలని అభ్యర్థన.

click me!