దర్యాప్తులో జోక్యం చేసుకోలేం.. వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు: సుప్రీం

Published : Sep 28, 2018, 12:14 PM ISTUpdated : Sep 28, 2018, 12:25 PM IST
దర్యాప్తులో జోక్యం చేసుకోలేం.. వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు: సుప్రీం

సారాంశం

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులకు ఊరట లభించింది. పోలీసుల దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది.

భీమా-కోరేగావ్ అల్లర్ల కేసులో పుణె పోలీసులకు ఊరట లభించింది. పోలీసుల దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసుపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఇవాళ తీర్పు చెబుతూ.. ఇవి రాజకీయ అల్లర్లు కావని... వరవరరావుతో పాటు మరో నలుగురి అరెస్టులో జోక్యం చేసుకోలేమని తెలిపింది.

అలాగే సిట్ దర్యాప్తు కావాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. వరవరరావుతో పాటు అరెస్టయిన మరో నలుగురి గృహనిర్బంధాన్ని నాలుగు వారాల పాటు పొడిగించింది. భీమా కోరెగావ్ అల్లర్ల కేసులో పౌర హక్కుల నేతలు వరవరరావుసహా మరో ఐదుగురి ఇళ్లపై పుణె పోలీసులు దాడులు నిర్వహించడంతో పాటు వారిని అరెస్ట్ చేసి.. పుణెకు తరలించారు.

ఈ కేసులో పోలీసుల దర్యాప్తులో జోక్యం చేసుకోవాలని... వీరి అరెస్టులను సవాల్ చేస్తూ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు.దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం పౌరహక్కుల నేతలను జైల్లో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని ఆదేశించింది. దీంతో పాటు మొదట సెప్టెంబర్ 6 వరకు, ఆ తరువాత 12వ తేదీ వరకు... అనంతరం మరో రెండు వారాలు గడువు పొడిగించింది. 

 

వరవరరావు ఇంటి వద్ద ఏబీవీపీ కార్యకర్తల ఆందోళన

చంద్రబాబుకు సోమవారం నోటీసులు: హీరో శివాజీ సంచలనం

వరవరరావు గృహనిర్బంధం పొడిగింపు.. ఐపీఎస్‌పై సుప్రీం కన్నెర్ర

ఆయుధాలు దొరికే చోటు వరవరరావుకి తెలుసు: పూణే పోలీసులు

మోడీ హత్యకు కుట్ర: 'అరెస్టైన హక్కుల నేతల నుండి వందల లేఖలు'

మోడీ హత్యకు కుట్రలో పేరు: విరసం నేత వరవరరావు అరెస్ట్

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే