యూపీ పోలీసులకు ఇంటర్వ్యూ.. మద్యం, మాంసం తీసుకోనివాళ్లెవరు...?

By sivanagaprasad KodatiFirst Published Sep 28, 2018, 11:51 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్ పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. రానున్న కుంభమేళాలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ కొత్తగా ఆలోచించింది. 

ఉత్తరప్రదేశ్ పోలీసులకు కొత్త సమస్య వచ్చి పడింది. రానున్న కుంభమేళాలో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండేందుకు గాను పోలీస్ శాఖ కొత్తగా ఆలోచించింది. కుంభమేళాకు హాజరయ్యే భక్తుల సెంటిమెంట్‌ను దృష్టిలో ఉంచుకుని.. పోలీసులు కూడా అంతే పవిత్రంగా ఉండాలని భావిస్తోంది.

ఇందుకోసం మాంసం తినని... మద్యం సేవించని.. సిగరేట్ అలవాటు లేని పోలీసులను కుంభమేళా విధుల్లో నియమించాలని ఆ రాష్ట్ర పోలీస్ శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో అలాంటి సిబ్బంది కోసం పోలీసులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇంటర్వ్యూ చేసి... మిస్టర్ పర్ఫెక్ట్‌ అనే సర్టిఫికేట్ ఇచ్చిన సిబ్బందికి కుంభమేళాలో విధులు నిర్వర్తించే అవకాశం లభిస్తుంది. షాజహాన్‌పూర్, ఫిలిబిత్, బరేలి, బదౌన్ జిల్లాల్లో పోలీసుల వ్యక్తిత్వాలను పరిశీలించాలని ఎస్ఎస్‌పీలకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మంచి అలవాట్లతో పాటు మరికొన్ని నిబంధనలు కూడా విధించారు. కుంభమేళాలో విధులు నిర్వర్తించే పోలీసులు అలహాబాద్‌కు చెందినవారై ఉండకూడదు.. కానిస్టేబుళ్ల వయసు 35 ఏళ్లు, హెడ్ కానిస్టేబుల్ వయస్సు 40 ఏళ్లు, ఎస్ఐ అయితే 45 ఏళ్ల వయసు మించి ఉండకూడదు.

click me!