ప్రపంచం మారింది.. సీబీఐ కూడా మారాలి

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 2:55 PM IST
Highlights

ప్రపంచం మారిందని, అలాగే సీబీఐ కూడా కాలనూగుణంగా మారాలని సుప్రీం కోర్టు పేర్కొంది. వ్యక్తిగత డిజిటల్, ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకోవడం, శోధించడం, భద్రపరచడంపై దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.

ప్రపంచం మారిందని, సీబీఐ కూడా కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొన్నది. వ్యక్తిగత డిజిటల్‌, ఎలక్ట్రానిక్‌ పరికరాలలోని డేటాను జప్తు, తనిఖీ, భద్రపరచడంపై దర్యాప్తు సంస్థలకు మార్గదర్శకాలను జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సీబీఐ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ను ఎస్‌కే కౌల్‌, జస్టిస్‌ ఏఎస్‌ ఓకా ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. గోప్యత సమస్యపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న దర్యాప్తు ఏజెన్సీల కోసం మాన్యువల్‌ను అప్‌డేట్ చేస్తున్నారని తెలిపారు. 

ప్రపంచం మారిపోయింది, సీబీఐ కూడా మారిపోయింది

దీనిపై స్పందించిన జస్టిస్‌ ఎస్‌కే కౌల్‌.. ‘‘ప్రపంచం మారిపోయింది, సీబీఐ కూడా మారాలి’’ అని పేర్కోన్నారు. దర్యాప్తు సమయంలో అనుసరించాల్సిన విధానాన్ని పేర్కొంటున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మాన్యువల్‌ను అప్‌డేట్ చేయాల్సిన అవసరం ఉందని  బెంచ్ పేర్కొంది. 

లా అండ్ ఆర్డర్ అనేది రాష్ట్ర సమస్య అయినందున.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్‌కు సంబంధించిన సమస్యలపై అన్ని సెక్షన్ల నుండి సూచనలు/అభ్యంతరాలను కోరడం సముచితమని కేంద్రం గత నెలలో ఈ అంశంపై దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. పిటిషనర్ల భయాందోళనలకు సంబంధించినంతవరకు.. వాటిలో చాలా వరకు సిబిఐ రూల్స్ 2020ని అనుసరించడం ద్వారా పరిష్కరించవచ్చని అఫిడవిట్‌లో కేంద్రం పేర్కొంది.

కొత్త నిబంధనలను రూపకల్పన 

సీబీఐ నిబంధనల ప్రాముఖ్యతను ఈ కోర్టు గతంలోనే గుర్తించిందని, ఈ నేపథ్యంలో 2020లో రూల్స్‌ను మళ్లీ రూపొందించి ప్రచురించామని కేంద్రం తెలిపింది. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్‌వీ రాజు సోమవారం ధర్మాసనానికి మాట్లాడుతూ తాను అఫిడవిట్‌ను దాఖలు చేశానని, మంగళవారం, బుధ లేదా గురువారాల్లో విచారణకు ఫిక్స్ చేయవచ్చని తెలిపారు.

ఫిబ్రవరి 27న విచారణ 

మాన్యువల్ రీడ్రాఫ్ట్ చేసి ప్రకటించినట్లు పేర్కొంది. ఈ అంశంపై ఫిబ్రవరి 27న మరోసారి సుప్రీంకోర్టు విచారణ జరుపనున్నది. ప్రత్యేక అంశంలో..  పిటిషనర్ సంస్థ తరఫు న్యాయవాది ధర్మాసనానికి మాట్లాడుతూ.. తమ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలు విస్తృత ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని, దానిపై కేంద్రం తన సమాధానం దాఖలు చేయాలని అన్నారు. సంస్థ పిటిషన్‌పై కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు కేంద్రానికి ఎనిమిది వారాల గడువు ఇచ్చిన ధర్మాసనం 12 వారాల తర్వాత విచారణకు లిస్ట్‌ చేసింది.

click me!