"అది రాజ్యాంగానికి విరుద్ధం.. ప్రతి ఒక్కరూ భారతదేశ సంస్కృతికి అనుగుణంగా వ్యవహరించాలి" 

By Rajesh KarampooriFirst Published Dec 5, 2022, 5:43 PM IST
Highlights

బలవంతపు మత మార్పిడి తీవ్రమైన సమస్య అని, ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది. మోసపూరిత ప్రలోభాలకు గురి  మత మార్పిడి చేసేవారిపై  కఠినమైన చర్యలు తీసుకోవాలని కేంద్రం,రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది.

బలవంతపు మతమార్పిడులపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. బలవంతపు మత మార్పిడి చేయడాన్ని తీవ్రమైన సమస్య అని అభివర్ణించింది. ఇది రాజ్యాంగానికి విరుద్ధమని సుప్రీంకోర్టు సోమవారం పేర్కొంది.  డబ్బు, ఆహారం లేదా మంద్యం ఎరగా చూపి మత మార్పిడి చేయవారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సుప్రీం కోర్టు పేర్కొంది. పేదలకు సహాయం చేయడమంటే..మతం మార్చడం కాదని పేర్కోంది.

బలవంతపు మతమార్పిడులపై కేంద్రం, రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు సోమవారం విచారించింది. ఒత్తిడి, మోసం లేదా దురాశతో మత మార్పిడికి వ్యతిరేకంగా కఠినమైన చట్టం చేయాలనే డిమాండ్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరుపుతోంది.

గత విచారణలో మత మార్పిడి దేశ భద్రతకు ప్రమాదకరమని కోర్టు పేర్కొంది. దీనికి కేంద్రం కూడా అంగీకరించి 9 రాష్ట్రాలు దీనికి వ్యతిరేకంగా చట్టాలు చేశాయని తెలిపింది. కేంద్రం కూడా అవసరమైన చర్యలు తీసుకుంటుందని తన విచారణలో పేర్కొంది. "ఇది చాలా తీవ్రమైన అంశం. అంతిమంగా ఇది మన రాజ్యాంగానికి విరుద్ధం. ప్రతి ఒక్కరూ భారతదేశంలో ఉన్నప్పుడు.. భారతదేశ సంస్కృతికి అనుగుణంగా వ్యవహరించాలి" అని ధర్మాసనం పేర్కొంది. 

మత మార్పిడి పై కమిటీ 

"మత మార్పిడి కేసులను పరిశీలించడానికి ఒక కమిటీ ఉండాలి.  మత మార్పిడి జరిగిందా? లేదా ? దురాశ, ఒత్తిడితో మతం మార్చే ప్రయత్నం జరిగిందా? లేదా ? అనేది ఈ కమిటీ నిర్ణయిస్తుంది" అని సొలిసిటర్ జనరల్ అన్నారు. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన సమాచారం కూడా సేకరించి అఫిడవిట్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దీనికి మరికొంత సమయం కావాలని డిమాండ్ చేశారు. దీనిపై డిసెంబర్ 12వ తేదీ సోమవారం విచారణ జరపాలని కోర్టు కోరింది.

రాష్ట్రాల స్పందన 

అన్ని రాష్ట్రాలకు నోటీసులు జారీ చేయడం ద్వారా సమాధానాలు కోరవద్దని, ఇది అనవసరంగా వ్యవహారాన్ని పొడిగించడమేనని కోర్టు స్పష్టం చేసింది. ఏదైనా రాష్ట్రం తన సొంత అంశాన్ని ముందుకు తీసుకురావాలనుకుంటే.. అది చేయవచ్చు. విచారణ సందర్భంగా క్రిస్టియన్ సంస్థల తరఫు సీనియర్ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, రాజు రామచంద్రన్ మాట్లాడుతూ.. 'పిటిషనర్ అశ్విని ఉపాధ్యాయ్ పిటిషన్‌పై విచారణకు కోర్టు ఇప్పటికే నిరాకరించింది. ఇప్పుడు విచారణ జరపకూడదు' అని అన్నారు.

క్రైస్తవ సంఘం న్యాయవాది వాదనపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.."ఈ వినికిడితో పూజారికి ఏమి సమస్య ఉంటుంది. దురాశతో లేదా మోసంతో మతం మారకపోతే.. బాధపడకూడదు" అని అన్నారు. ఈ పిటిషన్ విచారణకు విలువ లేదన్న వాదనను పరిగణనలోకి తీసుకోబోమని కోర్టు తెలిపింది. కేసుపై ప్రజలు తమ సమాధానాన్ని దాఖలు చేస్తారు.

click me!