population control : జనాభా నియంత్రణపై కేంద్ర ప్ర‌భుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు

By team teluguFirst Published Aug 8, 2022, 4:04 PM IST
Highlights

దేశంలో కఠిన జనాభా నియంత్రణ విధానాలు అవలంభించేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. 

దేశంలో జనాభా నియంత్రణ చట్టాన్ని రూపొందించాలని కోరుతూ హిందూ హక్కుల మత గురువు దేవకీనందన్ ఠాకూర్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న ఇతర పిటిషన్‌లతో కోర్టు ఈ పిటిషన్‌ను జత చేసింది. కఠినమైన జనాభా నియంత్రణ చట్టాన్ని రూపొందించేందుకు సాధ్యాసాధ్యాలను నిర్ధారించేందుకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయ‌న పిటిష‌న్ లో పేర్కొన్నారు. 

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో Cloudburst.. ఒక‌రు మృతి.. ధ్వంస‌మైన ఇండ్లు

అభివృద్ధి చెందిన దేశాల జనాభా నియంత్రణ చట్టాలు, విధానాలను సమీక్షించి, జనాభాను తగ్గించడానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించాలని లా కమిషన్ ను ఆదేశించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆ పిటిష‌న్ లో ఠాకూర్ పేర్కొన్నారు. క‌ఠిన జ‌నాభా నియంత్ర‌ణ చ‌ట్టం వ‌ల్ల పౌరులకు శాంతియుత నిద్ర, స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం, ఆరోగ్యం, ఆశ్రయం వంటివాటితో పాటు ప‌లు ప్రాథమిక హక్కులను కాపాడుతాయ‌ని పేర్కొన్నారు. 

సామాన్యుడి మనోగతాన్ని ఆవిష్కరించిన లెజెండరీ పొలిటికల్ కార్టూనిస్ట్ ‘ఆర్కే లక్ష్మణ్’

జనాభా విస్ఫోటనం వల్ల మహిళలకు కలిగే గాయం చాలా పెద్దది అని దేవకీనందన్ ఠాకూర్ నొక్కి చెప్పారు. ‘‘ పదే పదే పిల్లల్ని కనడం వల్ల మహిళలపై ప్రభావం పడుతుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో నాలుగురు కంటే ఎక్కువ మంది పిల్లలు జన్మించిన ఘటన 20 శాతంగా ఉంది. అయితే ఇది అభివృద్ధి చెందిన దేశాలలో ఇది 2 శాతం మాత్ర‌మే ’’ అని పిటిషనర్ తన పిటిషన్ లో పేర్కొన్నారు.

బిహార్ సీఎంకు ‘ఉద్ధవ్ ఠాక్రే’ భయం.. బీజేపీ కంట్రోల్‌పై బెంగ.. కూటమితో తెగదెంపులు?

2020లో బీజేపీ నేత అశ్విని ఉపాధ్యాయ ప్రజా ప్రయోజన కూడా ఇలాంటి వ్యాజ్యాన్నే దాఖలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. బాంబుల కంటే జనాభా విస్ఫోటనం ప్రాణాంతకం అని అశ్విని ఉపాధ్యాయ్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీని కారణంగా, అనేకమంది విద్యావంతులు, సంపన్నులు, ఆరోగ్యవంతులు, చక్కటి వ్యవస్థీకృత భారతదేశాన్ని తయారు చేసే ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని పేర్కొన్నారు. 

click me!