ఆ నిందితుడు బాల నేర‌స్థుడు కాదు.. క‌థువా గ్యాంగ్ రేప్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

By Rajesh KarampooriFirst Published Nov 16, 2022, 2:49 PM IST
Highlights

క‌థువా సామూహిక అత్యాచారం కేసులో బుధవారం సుప్రీంకోర్టు కీల‌క తీర్పును ఇచ్చింది. ఆ కేసులో నిందితుడిగా ఉన్న ఓ వ్య‌క్తి బాల నేర‌స్థుడు కాదనీ, అత‌న్ని వ‌యోజ‌నుడిగా గుర్తిస్తూ  విచార‌ణ చేప‌ట్టాల‌ని కోర్టు ఆదేశించింది. 

దేశవ్యాప్తంగా సంచలన రేపిన క‌థువా గ్యాంగ్ రేప్ కేసులో బుధవారం సుప్రీంకోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పక్కన పెడుతూ.. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన శుభమ్ సంగ్రాను వ‌యోజ‌నుడిగా గుర్తిస్తూ.. విచారించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అతన్ని బాల నేరస్థుడిగా విచారించకూడదని స్పష్టం చేసింది. 2018 కథువా రేప్ అండ్ మర్డర్ కేసులో నిందితుల్లో ఒకరిని వ‌యోజ‌నుడిగా గుర్తిస్తూ మళ్లీ విచారిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

కతువా, జమ్మూ కాశ్మీర్ హైకోర్టు ప్రధాన జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) జారీ చేసిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. ఇందులో నిందితుడిని విచారణ నిమిత్తం జువైనల్‌గా పరిగణించారు. ఈ మేరకు జ‌స్టిస్ అజ‌య్ ర‌స్తోగి, జ‌స్టిస్ జేబీ ప‌ర్దివాలాతో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పును ఇచ్చింది. సీజేఎం, హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సవాలు చేస్తూ జమ్మూ మరియు కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది.
 
వైద్య నిపుణుల అంచనా ఒక అభిప్రాయం మాత్రమే: సుప్రీంకోర్టు

నిందితుడి వయస్సుకు సంబంధించి వైద్య నిపుణుడి అంచనా సాక్ష్యాధారాలకు చట్టబద్ధమైన ప్రత్యామ్నాయం కాదని, కేవలం అభిప్రాయం మాత్రమేనని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ విషయంలో సవివరమైన తీర్పు ఆ రోజు తర్వాత అప్‌లోడ్ చేయబడుతుంది. ఈ కేసులో క‌థువా చీఫ్ జుడిషియ‌ల్ మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టిపారేసింది. ఆ నిందితుడు జువెనైల్ అని క‌థువా మెజిస్ట్రేట్ గ‌తంలో తీర్పునిచ్చిన విష‌యం తెలిసిందే.

కథువా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారం , హత్య కేసులో నిందితుడిని 2019లో అరెస్టు చేశారు. 2019 జూన్‌లో పఠాన్‌కోట్‌లోని ప్రత్యేక కోర్టు ఈ కేసులో ముగ్గురికి జీవిత ఖైదు విధించింది.  ధ్వంసం చేసే ప్ర‌య‌త్నం చేసిన ముగ్గురు పోలీసుల ఆఫీస‌ర్ల‌కు అయిదేళ్ల జైలు శిక్ష ఖ‌రారు చేసింది. ఈ కేసులో ఓ నిందితుడిపై విచార‌ణ‌ను జువెనైల్ జ‌స్టిస్ బోర్డ్‌కు త‌ర‌లించారు.

click me!