
హర్యానా (Haryana)లో దారుణం జరిగింది. ఒంటరిగా రైల్వే స్టేషన్ లో రైలు కోసం ఎదురు చూస్తున్న మహిళా జర్నలిస్టు (Female journalist)పై స్టేషన్ మాస్టర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ మేరకు బాధిత మహిళ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. ఢిల్లీ (Delhi)కి చెందిన మహిళా జర్నలిస్టు హర్యానాలోని రేవారీ రైల్వే స్టేషన్ (Rewari railway station) కు సోమవారం వెళ్లారు. అయితే ఆమె వెయిటింగ్ రూమ్‌లో రైలు రాక కోసం ఎదురు చూస్తోంది.
కర్ణాటకలో బీజేపీ యువనేత దారుణహత్య...వెంటాడి మరీ...
ఈ సమయంలో ఆమె టాయిలెట్ కు వెళ్లాల్సి వచ్చింది. అయితే వెయిటింగ్ రూమ్‌లోని టాయిలెట్‌కి వెళ్లి చూడగా, దాని తలుపు తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు. దీంతో ఆమె స్టేషన్ మాస్టర్ ఆఫీసుకు వెళ్లారు. అయితే అక్కడున్న స్టేషన్ మాస్టర్లు (station masters) వినయ్ శర్మ, రామోతర్‌లు టాయిలెట్ తాళం చెవి ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అలాగే ఆమెను లైంగికంగా వేధించారు.
టాయిలెట్లకు ఎందుకు తాళం వేశారని తాను రైల్వే మాస్టర్లను ప్రశ్నించగా.. పలువురు మహిళా ప్యాసింజర్లు టాయిలెట్లను దుర్గందంగా మార్చేశారని చెప్పారని బాధిత మహిళా జర్నలిస్టు తెలిపారు. “ ఇద్దరు స్టేషన్ మాస్టర్లపై IPC సెక్షన్లు 354 (ఆమె నిరాడంబరతను అగౌరవపరిచే ఉద్దేశ్యంతో మహిళపై దాడి లేదా నేరపూరిత బలవంతం), 506 (నేరపూరిత బెదిరింపు), 509 (మహిళ అణకువను కించపరిచే ఉద్దేశ్యంతో మాట, లేదా సిగ్నల్) కింద రేవారి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (GRP) స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేశాం.’’ అని GRP అధికారి ఒకరు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీస్ హౌస్ ఆఫీసర్ భూపేంద్ర సింగ్ పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్‌లో విచిత్రం.. మర్డర్ కేసులో జైల్లో ఉన్న నిందితుడు.. పంచాయతీ ప్రెసిడెంట్‌గా విజయం
ఇదిలా ఉండగా.. ఓ 13 ఏండ్ల బాలికపై 78 ఏండ్ల ఓ వృద్ధుడు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా తమిళనాడులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఇటీవల పాముకాటులో ప్రాణాలు కోల్పోగా.. ఆమెపై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలోని ఒక గ్రామంలో సోమవారం బాలిక పాముకాటుతో కొంత కాలం కిందట ఆ మైనర్ చనిపోయింది. మూడు నెలల క్రితం వృద్ధుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే విషయం ఆమె మరణించిన తర్వాత నేరానికి సంబంధించిన వీడియో క్లిప్ బయటకు వచ్చింది.
ఒకే సిరంజీతో 30 మంది విద్యార్థులకు టీకా వేశాడు.. నా తప్పేముందని బుకాయింపు
ఈ విషయం పోలీసుల వరకు చేరడంతో వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. గ్రామానికి చెందిన కొందరు యువకులు ఆ వ్యక్తి చేసిన పనిని అతడికి తెలియకుండా చిత్రీకరించారు. అయితే సదరు బాలిక ఇటీవల మృతి చెందింది. దీంతో ఆమెను హతమార్చి ఉండవచ్చని అనుమానించి ఆ యువకులు ఆ వీడియోను సర్క్యులేట్ చేశారు. కాగా... అసభ్యకరమైన వీడియోలను సర్క్యూలేట్ చేసిన ఆరోపణలపై పోలీసులు వారిని అరెస్టు చేశారు.