మరో రెండు కులాలకు ఎస్టీ హోదా.. బిల్లును ఆమోదించిన రాజ్యసభ..

By team teluguFirst Published Dec 23, 2022, 11:03 AM IST
Highlights

తమిళనాడు రాష్ట్రంలో ఉన్న నరికురవన్, కురివిక్కరన్ వర్గాలకు ఎస్టీ హోదా రానుంది. ఈ మేరకు రూపొందించిన బిల్లును రాజ్యసభ గురువారం ఆమోదించింది. ఈ బిల్లు త్వరలోనే రాష్ట్రపతి ఆమోదానికి వెళ్లనుంది. 

తమిళనాడులోని నరికురవన్, కురివిక్కరన్ వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించే బిల్లు కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు గురువారం రాజ్యసభలో విజయవంతమయ్యాయి. దీంతో మరో రెండు కులాలకు ఎస్టీ హోదా వచ్చినట్టైంది.

నాగ్ పూర్ ల్యాండ్ డీల్ పై యూ టర్న్ తీసుకున్న మహారాష్ట్ర సీఎం షిండే.. కేటాయింపును రద్దు చేస్తున్నట్టు ప్రకటన

ఈ మేరకు గురువారం రాజ్యాంగ (షెడ్యూల్డ్ తెగల) ఆర్డర్ (రెండో సవరణ) బిల్లు- 2022 ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి అర్జున్ ముండా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. దీనిని సభ వాయిస్ ఓటు ద్వారా ఆమోదించింది. తమిళనాడు  రాష్ట్రంలోని షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) జాబితాలో ఈ రెండు వర్గాలను చేర్చాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సూచన ప్రకారం ఈ బిల్లు రూపుదిద్దుకుంది.

కీచక ప్రొఫెసర్.. విద్యార్థిని శారీర సంబంధం పెట్టుకోలేదని పరీక్షల్లో ఫెయిల్ చేశాడు..

ఈ బిల్లుపై రాజ్యసభలో మంత్రి ముండా మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా కమ్యూనిటీలు తమ హక్కులను కోల్పోతున్నాయని అన్నారు.  తమిళనాడుకు చెందిన మరికొన్ని కులాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అర్హత కలిగి ఉన్నాయని అన్నాడీఎంకెకు చెందిన ఎం తంబిదురై పేర్కొంటూ ఈ బిల్లుకు ఆయన మద్దతు తెలిపారు.

డ్రైనేజ్ పైపుల పని చేస్తుంటే కూలిన మట్టిపెళ్లలు.. ముగ్గురు వలస కూలీలు సజీవ సమాధి...

ఈ సందర్భంగా మరో ఎంపీ తిరుచి శివ మాట్లాడుతూ.. మత్స్యకారులను గిరిజన వర్గాల జాబితాలో చేర్చాల్సిన అవసరం ఉందని అన్నారు. అలాగే వామికి, వడుగ, కురుబా వంటి ఇతర వర్గాలను కూడా ఈ సమూహాలలో చేర్చాలని పేర్కొన్నారు. ‘‘ఏడు దశాబ్దాల స్వాతంత్ర్యం అనంతరం, గణతంత్ర రాజ్యంగా మారిన తరువాత, ఇప్పుడు మనం కొన్ని సమాజాలను తెగల పరిధిలోకి తీసుకురావాలనుకుంటున్నాము.’’ అని అన్నారు. 

15యేళ్ల బాలిక కిడ్నాప్.. 35 యేళ్ల వ్యక్తికి అమ్మేస్తే.. అత్యాచారం, చిత్రహింసలు.. చివరికి రెండు నెలల తరువాత...

ఈ బిల్లుకు డీఎంకే నుంచి ఎస్.మహ్మద్ అబ్దుల్లా, బీజేపీ నుంచి కె.లక్ష్మణ్, వైసీపీ నుంచి రాయగా కృష్ణయ్య, డీఎంకే నుంచి కేఆర్ఎన్ రాజేశ్ కుమార్ కూడా మద్దతు తెలిపారు.
 

click me!