
ఢిల్లీ : భారత్ లో గురువారం 12,000 కోవిడ్ -19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే దాదాపు 2,000 కేసులు పెరిగాయి. మొత్తం12,591 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన రోజువారీ కోవిడ్ నివేదిక చూపిస్తోంది. దేశం క్రియాశీల కాసేలోడ్ ప్రస్తుతం 65286 - మొత్తం కేసులలో 0.14% శాతంగా ఉంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ ప్రకారం, మొత్తం బుధవారం 10,542 కేసులు ఉన్నాయని డేటా చెబుతోంది. దీంతో పోలిస్తే గురువారం నాటి కేసుల్లో ఇది గణనీయమైన స్పైక్. ఈ వారం ప్రారంభంలో కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం 7,633 కొత్త ఇన్‌ఫెక్షన్లు, సోమవారం 9,111 నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకున్న కోవిడ్ కేసుల సంఖ్య 4.48 కోట్లు (44,857,992)గా నమోదైంది. డిశ్చార్జ్ అయిన కేసుల సంఖ్య 44,261,476గా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.
చత్తీస్‌గఢ్‌లో నలుగురు, ఢిల్లీలో ఐదుగురు, హిమాచల్ ప్రదేశ్‌లో ఇద్దరు, కర్ణాటకలో ముగ్గురు, పుదుచ్చేరి, తమిళనాడు, ఉత్తరాఖండ్, పంజాబ్‌లలో ఒక్కొక్కరు, మహారాష్ట్రలో ఆరుగురు, రాజస్థాన్‌లో ఇద్దరు కరోనాతో మరణించారు. కేరళలో గడిచిన 24 గంటల్లో రెండు మరణాలు నమోదయ్యాయి. 11 రికన్సీల్డ్ మరణాలు నమోదయ్యాయి.