వారిని దత్తత తీసుకుంటా, నా భార్యపై విమర్శలా: సిద్ధూ

By pratap reddyFirst Published Oct 22, 2018, 5:02 PM IST
Highlights

అమృతసర్ రైలు ప్రమాదంపై పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అమృతసర్ లో దసరా వేడుకల సందర్భంగా జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే.

అమృతసర్: అమృతసర్ రైలు ప్రమాదంపై పంజాబ్ మంత్రి నవజోత్ సింగ్ సిద్ధూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. అమృతసర్ లో దసరా వేడుకల సందర్భంగా జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 60 మంది మృత్యువాత పడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం విషయంలో సిద్ధూ వివాదంలో చిక్కుకున్నారు. 

రైలు ప్రమాదం విషయంలో డ్రైవర్ కు ఎలా క్లీన్ చిట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. రైలు వస్తుందనే విషయాన్ని గార్డు చూడలేదన చెప్పడాన్ని ఆయన ప్రశ్నించారు. రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబ సభ్యుల ఆలనాపాలనా తాను తీసుకుంటానని ఆయన చెప్పారు. తాను జీవించి ఉన్నంత వరకు వారి బాగోగులు చూసుకుంటానని చెప్పారు. రైలు ప్రమాదం విషయంలో తన భార్యపై వస్తున్న విమర్శలను ఆయన తప్పు పట్టారు.

రైల్వే ఇంజన్, పోలీసు బలగాలు, గార్డుల బృందం, ట్రాక్స్ కేంద్ర ప్రభుత్వానికి చెందినవని, ఎఫ్ఐఆర్ కూడా కేంద్రమే నమోదు చేసిందని, ప్రమాదం జరిగిన ఆరు గంటల లోపల డ్రైవర్ కు క్లీన్ చిట్ ఇచ్చేశారని ఆయన అన్నారు. డ్రైవర్ పేరు ఎందుకు వెల్లడించడం లేదని అడిగారు. రైలు వస్తున్నట్లు గార్డులు గుర్తించకపోవడం సాధ్యమేనా అని అడిగారు. 

రైలును గంటకు 91 కిలోమీటర్ల వేగంతో నడపడానికి అనుమతి ఉండగా, 68 కిలోమీటర్ల వేగానికి డ్రైవర్ తగ్గించాడని, అందువల్ల డ్రైవర్ పై చర్యలు తీసుకోబోమని రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రమాదం రైల్వే తప్పిదం వల్ల జరగలేదని, తాము ఏ విధమైన తప్పూ చేయలేదని రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా చెప్పారు. పంజాబ్, రైల్వే పోలీసులు డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అమృత్‌సర్ రైలు ప్రమాదం: రాళ్ల దాడికి దిగారు: డ్రైవర్

పంజాబ్ ప్రమాదం: సెల్ఫీల మోజులో పడి

దసరా ఉత్సవాల విషయం తెలియదు: రైల్వే బోర్డు ఛైర్మెన్ అశ్విని లోహానీ

పంజాబ్ ప్రమాదం: 61 మంది మృతి, 72 మందికి గాయాలు

పంజాబ్ ప్రమాదం: ఘటనకు ముందే అక్కడి నుండి వెళ్లిపోయా: నవజ్యోత్ కౌర్

పంజాబ్ రైలు ప్రమాదం: బాణసంచా పేలుళ్లే కారణమా?
పంజాబ్ లో ఘోర రైలు ప్రమాదం: 50 మందికి పైగా దుర్మరణం

click me!