ఐదురోజుల్లో పెళ్లి.. వరుడికి అరగుండుకొట్టిన వధువు బంధువులు

Published : Oct 22, 2018, 04:49 PM IST
ఐదురోజుల్లో పెళ్లి.. వరుడికి అరగుండుకొట్టిన వధువు బంధువులు

సారాంశం

మరో ఐదురోజుల్లో వధూవరులు ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కి మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించాల్సి ఉంది. కాగా.. అప్పుడే కథ అడ్డం తిరిగింది.

మరో ఐదురోజుల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడుకి.. బలవంతంగా వధువు బంధువులు అరగుండు కొట్టేశారు. అందేంటి..? ఎవరైనా పెళ్లి అంటే వరుడు అందంగా ఉండాలని అనుకుంటారు. ఇలా అరగుండు కొట్టడం ఏంటి..? ఏదైనా ఆచారామా అనుకుంటున్నారేమో.. అదేం లేదు. అతనికి కావాలనే అరగుండు కొట్టారు. శిక్షలో భాగంగా ఆక్రోశంలో ఆ పని చేశారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. లక్నోకి చెందిన ఓ యువకుడికి  అదే ప్రాంతానికి చెందిన యువతితో పెళ్లి కుదిరింది. శుభలేఖలు పంచడం పూర్తయ్యింది. పెళ్లి పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. మరో ఐదురోజుల్లో వధూవరులు ఇద్దరూ పెళ్లిపీటలు ఎక్కి మూడు ముళ్లతో కొత్త జీవితం ప్రారంభించాల్సి ఉంది. కాగా.. అప్పుడే కథ అడ్డం తిరిగింది.

తనకు కట్నంగా బంగారం గొలుసు, మోటారు సైకిల్ బహుమతిగా ఇస్తే తప్ప.. పెళ్లి చేసుకోనని వరుడు భీష్మించుకు కూర్చున్నాడు. అంతే అతని కోరికలు విని వధువు కుటుంబీకులు ఆందోళన చెందారు. ఒప్పించడానికి ఎంతగానో ప్రయత్నించారు. వరుడు మాత్రం ససేమిరా అన్నాడు. దీంతో.. ఆ కోరికలు మేము తీర్చలేమని వధువు కుటుంబీకులు చేతులెత్తాశారు. అయితే.. సడెన్ గా ఆదివారం కొందరు వరుడు ఇంటిపై దాడి చేసి.. అతనికి బలవంతంగా అర గుండు కొట్టేశారు.

 

వధువు కుటుంబీకులే ఇలా చేశారని వరుడు బంధువులు ఆందోళన చేయగా.. తమకు ఏ సంబంధం లేదని వధువు అమ్మమ్మ తేల్చి చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: ఇండిగో ఎయిర్ లైన్స్‌కి ఏమైంది.. అస‌లీ గంద‌ర‌గోళం ఏంటి.?
Modi : అసోం టీ నుండి భగవద్గీత వరకు.. పుతిన్‌కు మోదీ ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవే