శ్రద్ధా వాకర్ హత్య కేసు.. ఆఫ్తాబ్ పూనావాలాపై పాలిగ్రాఫ్ పాలీగ్రాఫ్ పరీక్ష పూర్తి.. డిసెంబర్ 1న నార్కో టెస్టు

By team teluguFirst Published Nov 29, 2022, 5:04 PM IST
Highlights

దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో నిందితుడైన ఆఫ్తాబ్ పూనావాలాకు పాలీగ్రాఫ్ పరీక్ష మంగళవారం పూర్తయ్యింది. గత వారం ఈ పరీక్ష మొదలైంది. డిసెంబర్ 1వ తేదీన నార్కో పరీక్ష చేపట్టనున్నారు. 

ఢిల్లీలో వెలుగు చూసిన శ్రద్ధా వాకర్ దారుణ హత్యలో నిందితుడిగా ఉన్న ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా కు అధికారులు మంగళవారం న్యూ ఢిల్లీలోని ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) కార్యాలయంలో పాలీగ్రాఫ్ పరీక్ష నిర్వహించారు. ఆ పరీక్ష నేటితో పూర్తయ్యిందని, త్వరలోనే నివేదిక అందజేస్తామని ఎఫ్‌ఎస్‌ఎల్‌ అధికారి ఒకరు మీడియాతో తెలిపారు.

38 ఏళ్ల తరువాత పేలిన ప్రపంచంలోనే అతి పెద్ద అగ్నిపర్వతం.. అది ఎక్కడుంటుందంటే ?

“ఆఫ్తాబ్‌పై పాలీగ్రాఫ్ పరీక్ష ఈ రోజు పూర్తయింది. ఇది గత వారం ప్రారంభమైంది. మేము ఈ కేసును ప్రాధాన్యతగా భావిస్తున్నాం. త్వరలో పోలీసులకు పాలీగ్రాఫ్ పరీక్షకు సంబంధించిన నివేదికను అందిస్తాం’’ అని ఎఫ్ఎస్ఎల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంజీవ్ గుప్తా తెలిపారు. అయితే డిసెంబరు 1న పూనావాలాకు నార్కో అనాలసిస్ టెస్ట్ నిర్వహించేందుకు ఢిల్లీ కోర్టు అనుమతించింది.

కాగా.. సోమవారం పూనావాలాను పరీక్షల కోసం ఎఫ్‌ఎస్‌ఎల్ కు తీసుకొచ్చిన సమయంలో పోలీసు వాహనంపై కొందరు కత్తితో దాడి చేశారు. దీంతో నేడు అతడిని అధిక భద్రత మధ్య లాబొరేటరికి తీసుకొచ్చారు. ఇలా ఎఫ్ఎస్ఎల్ కు తీసుకురావడం ఇది ఐదో సారి. ఆఫ్తాబ్ వచ్చిన సమయంలో ఎఫ్‌ఎస్‌ఎల్ కార్యాలయం వెలుపల సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్) సిబ్బందిని భారీగా మోహరించారు.

రావ‌ణుడిలా మోదీకి 100 త‌ల‌లున్నాయా..? : మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే

మే నెలలో తన సహజీవన భాగస్వామి శ్రద్ధను గొంతుకోసి చంపి ఆమె మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అఫ్తాబ్ పూనావాలా హత్య కేసును ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతడు తన ప్రియురాలి శరీర భాగాలను ఫ్రిజ్ లో ఉంచాడని, అవి చెడిపోయిన వెంటనే వాటిని ఢిల్లీ, గురుగ్రామ్‌లోని అటవీ ప్రాంతాల్లో పడేశాడని ఆరోపణలు ఉన్నాయి.

అతని పొట్టలో 1.2 కిలోల కాయిన్ల కుప్ప.. సర్జరీ చేసి 187 కాయిన్స్ తొలగించిన వైద్యులు

ఈ హత్య వెలుగులోకి వచ్చిన అనంతరం అతడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే విచారణ సమయంలో తాము అడిగే ప్రశ్నలకు పూనావాలా తప్పుదారి పట్టించే సమాధానాలు చెబుతున్నాడని పోలీసులు గతంలో కోర్టులో వాదించారు. దీంతో నవంబర్ 18వ తేదీన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ నిందితుడి పాలీగ్రాఫ్ పరీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చింది. మొదటి పరీక్ష పాలిగ్రాఫ్ పరీక్షకు అఫ్తాబ్ ఆరోగ్యం సహకరించకపోవడంతో వాయిదా పడింది. అయితే నవంబర్ 23న జరగాల్సిన రెండో టెస్టు సెషన్ కూడా పూనావాలా అస్వస్థతకు గురికావడంతో వాయిదా వేశారు. నవంబర్ 25, 26 తేదీల్లో రెండో, మూడో సెషన్‌లు జరిగాయి.

click me!