రావ‌ణుడిలా మోదీకి 100 త‌ల‌లున్నాయా..? : మ‌ల్లికార్జున్‌ ఖ‌ర్గే 

By Rajesh KarampooriFirst Published Nov 29, 2022, 3:48 PM IST
Highlights

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో  ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. కార్పొరేష‌న్ ఎన్నిక‌లైనా, అసెంబ్లీ ఎన్నికలైనా.. పార్లమెంట్ ఎన్నిక‌లైనా.. అన్ని ఎన్నిక‌ల్లో మోదీ ముఖం క‌నిపిస్తోంది. మోదీజీ మీకు రావ‌ణుడిలా 100  త‌ల‌లున్నాయా అని వివాదాస్పద ప్రకటక చేశారు. 

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారం నేటీతో ముగియనున్నది. ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల తుటాలు చాలానే పేలాయి. ఈ క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విరుచుకపడ్డారు. ప్రతి ఎన్నికల్లో మోదీ కనిపిస్తున్నారని, ఆయనకు రావణుడిలా 100 తలలు ఉన్నాయా?' సంచలన వ్యాఖ్యలు చేశారు.  

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నిక ప్రచార ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షుడు  ఖర్గే ప్రసంగిస్తూ.. కార్పొరేష‌న్ ఎన్నిక‌లైనా, అసెంబ్లీ ఎన్నికలైనా, పార్లమెంట్ ఎన్నిక‌లైనా మోడీ ముఖం క‌నిపిస్తోంది.ప్రతి ఎన్నికల్లో మోడీకి ఓటు వేయమని బీజేపీ అంటోంది... మోడీ ఇక్కడ పని చేయడానికి వస్తారా? అని ఖ‌ర్గే నిల‌దీశారు. మీకు ఎలాంటి ఇబ్బంది క‌లిగినా, అవ‌స‌రం వచ్చినా మోడీ వచ్చి సాయం చేస్తారా? అని ప్ర‌శ్నించారు.మోడీజీ మీకు రావ‌ణుడిలా 100 త‌ల‌లున్నాయా అని ప్ర‌శ్నించారు. ప్రధాని మోడీ పేరుతో ఓట్లు అడ‌గటం మానుకోమని, అభ్యర్తిని చూసి ఓట్లు వేయాలని హిత‌వు ప‌లికారు. ఓట‌ర్ల నుంచి సానుభూతి పొందేందుకు ప్రధాని  తాను పేద‌వాడిన‌ని ప‌దేప‌దే చెబుతున్నార‌ని, ఆయ‌న అస‌త్యప్ర‌చారం చేస్తూ.. ఓట్ల వేట సాగిస్తున్నార‌ని ఖ‌ర్గే విమ‌ర్శించారు. 

ఖర్గే ప్రకటనపై బీజేపీ ఫైర్

ప్ర‌ధాని మోడీని ఖ‌ర్గే రావ‌ణుడితో పోల్చ‌డం ప‌ట్ల క‌మ‌ల‌నాధులు మండిప‌డుతున్నారు. ప్రధాని మోదీని రావణుడు అని పిలవడం ఘోర అవమానమని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర అన్నారు. మల్లికార్జున్ ఖర్గే.. కేవలం ప్రధానినే కాదు.. యావత్తు భారతదేశాన్ని అవమానించారని విమర్శించారు. అయినా ఈ ప్రకటన ఖర్గేది కాదనీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీలది. సోనియా సూచన మేరకు ఖర్గే.. ప్రధాని అవమానించారని అన్నారు.మోదీని చావు వ్యాపారి అని సోనియా అభివర్ణించారు. 

'గుజరాత్ కుమారుడికి అవమానం'

గుజరాత్ కుమారుడిని కాంగ్రెస్ అవమానిస్తున్నదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఆరోపించారు.గుజరాత్‌లో ఓటమి పాలవుతామనే భయంతో కాంగ్రెస్ స‌హ‌నం కోల్పోయి ప్ర‌ధాని మోడీపై చ‌వ‌క‌బారు విమ‌ర్శలు చేస్తోంద‌ని పేర్కొన్నారు. గాంధీ కుటుంబం ప్రధాని మోదీని ద్వేషిస్తుందనీ, ప్రధాని మోదీని క్రూరమైన, అసభ్యకర పదజాలాన్ని ఉపయోగిస్తున్నారని విమర్శించారు.తుక్డే తుక్డే గ్యాంగ్ దుర్వినియోగం చేస్తేనే  దేశం సమైక్యంగా ఉంటుందని తేలిందనీ, ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకోవాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ అవమానానికి గుజరాత్ ప్రజలు తమ ఓట్లతో ప్రతీకారం తీర్చుకుంటారని అన్నారు.

click me!