
2019లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన-బీజేపీ కూటమి మెజారిటీ సాధించిన తర్వాత ముఖ్యమంత్రి పదవికి ఏక్ నాథ్ షిండే పేరును తమ పార్టీ ప్రతిపాదించిందని శివసేన (యూబీటీ) నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. కానీ దీనిని బీజేపీయే తిరస్కరించిందని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ చేసిన 'క్విట్ ఇండియా' వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. బీజేపీపై విమర్శలు చేశారు.
రాహుల్ గాంధీకి థ్యాంక్స్ చెప్పిన అరవింద్ కేజ్రీవాల్.. ఎందుకంటే ?
క్విట్ ఇండియాతో బీజేపీకి సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీజేపీ పూర్వీకులు క్విట్ ఇండియాలో కూడా పాల్గొనలేదన్నారు. 2014లో భారతీయ జనతా పార్టీ తమ పార్టీతో పొత్తును తెంచుకుందని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. కాగా.. ఆయన వార్తా సంస్థ ‘పీటీఐ’తో మాట్లాడుత.. దేశంలో 80 శాతం మంది హిందువులు ఉన్నారని, అందువల్ల ఇది ఇప్పటికే హిందూ రాష్ట్రంగా ఉందని కమల్ నాథ్ అన్నారని అన్నారు. హిందువులు ప్రమాదంలో ఉన్నారని బీజేపీ చెబుతోందని తెలిపారు. బీజేపీ అధికారంలో ఉండి హిందువుల కోసం ఏం చేస్తుందని ప్రశ్నించారు.
ఈసారి ఇంజన్లు ఫెయిల్ అయినా.. ల్యాండర్ సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుంది - ఇస్రో చీఫ్ సోమనాథ్
కాగా.. క్విట్ ఇండియా ప్రారంభమైన రోజును పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోడీ బుధవారం ప్రతిక్షాలపై విమర్శలు చేశారు. అవినీతి, వంశపారంపర్యత, బుజ్జగింపులకు వ్యతిరేకంగా భారతదేశం ఇప్పుడు ఒకే స్వరంలో మాట్లాడుతోందని అన్నారు. ‘‘ క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న మహనీయులకు నివాళులు.. గాంధీజీ నాయకత్వంలో ఈ ఉద్యమం భారతదేశాన్ని వలస పాలన నుండి విముక్తి చేయడంలో ప్రధాన పాత్ర పోషించింది’’ అని ఆయన ట్వీట్ చేశారు.
కొండచరియలు విరిగిపడి జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి దిగ్బంధం.. నిలిచిన అమర్ నాథ్ యాత్ర
క్విట్ ఇండియా ఉద్యమం స్వాతంత్య్రం సాధించే దిశగా భారత్ వేస్తున్న అడుగుల్లో కొత్త శక్తిని నింపిందని పేర్కొన్నారు. దీని స్ఫూర్తితో నేడు దేశం మొత్తం అన్ని దురాచారాలకు క్విట్ ఇండియా అని చెబుతోందన్నారు.