
గ్లోబల్ దావూదీ బోహ్రా కమ్యూనిటీ నాయకుడు సయ్యద్నా ముఫద్దల్ సైఫుద్దీన్ కు అదురైన గౌరవం దక్కింది. ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డు 'నైల్ సాష్'ను ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దెల్-ఫతాహ్ ఎల్-సిసి .. బోహ్రా కమ్యూనిటీ నాయకుడికి అందించారు. ఆయన తన సంఘానికి కీర్తిని తెచ్చిపెట్టింది. ఆయన ఈజిప్టులో సాంస్కృతిక, ధార్మిక, సాంఘిక అంశాలపై నిరంతరంగా చేస్తున్న కృషికి మెచ్చుకోలుగా ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫతాహ్ ఎల్-సిసి ఈ ప్రతిష్టాత్మక అవార్డును బోహ్రా కమ్యూనిటీ నాయకుడికి అందించారు.
ఈ సంద్భరంగా ఈజిప్ట్ అధ్యక్షుడు ఎల్-సిసి మాట్లాడుతూ .. బోహ్రా కమ్యూనిటీతో ఉన్న దీర్ఘకాల సంబంధాలను గుర్తుకు చేసుకున్నారు. ఈజిప్టులోని చారిత్రక పుణ్యక్షేత్రాలు, మసీదులను పునరుద్ధరించడంలో సయ్యద్ సైఫుద్దీన్ ను ప్రశించారు. ఆయన భారతదేశంలో కూడా తన దాతృత్వ కార్యకలాపాలు చేస్తున్నట్టు అధ్యక్షుడు తెలిపారు. పది, పన్నెండవ శతాబ్దాల నాటి కైరోలోని పురాతన ఫాతిమి స్మారక కట్టడాలను పునరుద్ధరించడంలో సయ్యద్నా సైఫుద్దీన్ చురుకైన పాత్ర పోషించారు. ఆయన ప్రయత్నం వల్లనే అల్-జామి అల్-అన్వర్ అని కూడా పిలువబడే ఇమామ్ అల్-హకీమ్ .. తొమ్మిది శతాబ్దాల పురాతన మసీదును పునరుద్ధరింబడింది. ఆయన అల్-హుస్సేన్, అల్-సయ్యిదా నఫీసా, అల్-సయ్యెదాతో సహా వివిధ మసీదుల పునరుద్ధరణ, పునరుద్ధరణకు కూడా సహకరించాడు.
పరస్పర చర్చ సందర్భంగా.. మత సహనం, సహజీవనాన్ని ప్రోత్సహించడంలో అధ్యక్షుడు ఎల్-సిసి నాయకత్వాన్ని సయ్యద్నా సైఫుద్దీన్ ప్రశంసించారు. ఇస్లామిక్ ప్రపంచానికి ముఖ్యమైన సమస్యలకు ఈజిప్ట్ యొక్క క్రియాశీల ప్రాంతీయ. అంతర్జాతీయ పాత్ర, మద్దతును కూడా ఆయన ప్రశంసించారు. దేశ నిరంతర అభివృద్ధి, పురోగతి కోసం సయ్యద్నా సైఫుద్దూన్ ప్రార్థించారు. ఈ సమావేశానికి ఈజిప్షియన్ జనరల్ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ అధిపతి మేజర్ జనరల్ అబ్బాస్ కమెల్ , సయ్యద్నా సైఫుద్దీన్ కుటుంబ సభ్యులు , ఇతర ప్రముఖులు హాజరయ్యారు.