మోడీని రావణుడితో పోల్చిన రాహుల్: స్మృతి ఇరానీ ఫైర్ ... లోక్‌సభలో బీజేపీ,విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం

Published : Aug 09, 2023, 01:13 PM ISTUpdated : Aug 09, 2023, 01:29 PM IST
 మోడీని రావణుడితో పోల్చిన రాహుల్: స్మృతి ఇరానీ  ఫైర్ ... లోక్‌సభలో బీజేపీ,విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రావణుడితో పోల్చారు.  ఈ విషయమై అధికార, విపక్షాల మధ్య  మాటల యుద్ధం సాగింది.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీని  రావణుడితో  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోల్చారు. దీంతో  సభలో  అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటు  చేసుకుంది. రాహుల్ గాంధీ ప్రసంగానికి  బీజేపీ సభ్యులు అడుగడుగున అడ్డుపడ్డారు.

నరేంద్ర మోడీ ప్రభుత్వంపై  కాంగ్రెస్ పార్టీ అవిశ్వాసాన్ని ప్రతిపాదించింది.అవిశ్వాసంపై  బుధవారంనాడు లోక్ సభలో జరిగిన చర్చలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు.   మణిపూర్ హింసపై రాహుల్ గాంధీ  ప్రస్తావిస్తూ  ప్రధాని మోడీని  రావణుడితో పోల్చారు. రావణుడు  కూడ ఇద్దరి మాటలే వింటాడు...అదే రీతిలో కూడ  మోడీ కూడ ఇద్దరి మాటలను వింటాడని  రాహుల్ గాంధీ  ప్రధాని మోడీపై  తీవ్ర వ్యాఖ్యలు  చేశారు.  మేఘనాథుడు, కుంభకర్ణుడి మాటలనే రావణుడు వినేవాడన్నారు. అమిత్ షా, అదానీ మాటలను మాత్రమే  మోడీ వింటాడన్నారు. రావణుడి అహంకారమే  నాడు లంకను కాల్చేసిందన్నారు.

మణిపూర్ కు తాను  వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు  చేశారు. కానీ ప్రధాని మోడీ ఇంతవరకు వెళ్లలేదన్నారు. మణిపూర్ మన దేశంలో లేదా అని ఆయన ప్రశ్నించారు.మణిపూర్ ను రెండు భాగాలుగా విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన  ప్రధాని మోడీపై విమర్శలు చేశారు.మణిపూర్ రిలీఫ్ క్యాంపులో ఉన్న మహిళలతో తాను మాట్లాడిన విషయాన్ని రాహుల్ గాంధీ  ప్రస్తావించారు. మణిపూర్ బాధితుల గురించి ప్రధాని ఎందుకు  మాట్లాడలేదో చెప్పాలన్నారు.మణిపూర్ భారత్ లో ఉన్నట్టు ప్రధాని గుర్తించడం లేదా అని ఆయన అడిగారు. తన కళ్లముందే తన కొడుకును చంపారని ఓ బాధిత మహిళ చెప్పిన విషయాన్ని  రాహుల్ గాంధీ  లోక్ సభలో ప్రస్తావించారు. 
దేశాన్ని హత్య చేస్తున్నారన్నారు. మణిపూర్ లో భారతమాతను చంపేశారని  రాహుల్ గాంధీ  వ్యాఖ్యానించారు. మీరు దేశ భక్తులు కాదు, దేశ ద్రోహులంటూ  బీజేపీపై  రాహుల్ గాంధీ  మండిపడ్డారు.మణిపూర్ ప్రజల మనసులను గాయపర్చారని  రాహుల్ గాంధీ బీజేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. 

also read:భారత్ జోడో యాత్రతో నా అహంకారం పోయింది: మోడీ సర్కార్ పై అవిశ్వాస చర్చలో రాహుల్

ఈ వ్యాఖ్యలపై  బీజేపీ సభ్యులు అభ్యంతరం చెప్పారు.  ఈ సమయంలో  కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ  జోక్యం చేసుకున్నారు.  రాహుల్ పై ఆగ్రహం వ్యక్తం  చేశారు. రాహుల్ గాంధీ భారతీయుడే కాదన్నారు. రాహుల్ వ్యాఖ్యలను  జాతి క్షమించదన్నారు. మణిపూర్ రెండుగా చీలలేదని కేంద్ర మంత్రి చెప్పారు.  భరతమాతను చంపేశారని సభలో ఇప్పటివరకు ఎవరూ అనలేదని ఆమె గుర్తు  చేశారు. మీరు ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపంగా  కేంద్ర మంత్రి ఇరానీ పేర్కొన్నారు.మణిపూర్ భారత్ లో అంతర్భాగంగా ఆమె  పేర్కొన్నారు.మీరు ఇండియా కాదు.. అవినీతికి ప్రతిరూపంగా  కేంద్ర మంత్రి ఇరానీ పేర్కొన్నారు.మణిపూర్ భారత్ లో అంతర్భాగంగా ఆమె  పేర్కొన్నారు. మీరు ఇండియానే కాదని రాహుల్ నుద్దేశించి కేంద్రమంత్రి వ్యాఖ్యలు చేశారు.భరతమాతను హత్య చేశారంటే  కాంగ్రెస్ సభ్యులు బల్లలు చరుస్తున్నారని ఆమె  మండిపడ్డారు. దేశంలో  అవినీతిని పెంచిపోషించింది కాంగ్రెస్ పార్టీయేనన్నారు. గిరిజా టిక్కు,  సరళా భట్ వంటి ఘటనలు  కాంగ్రెస్ హయంలోనే జరిగాయన్నారు.

ఆర్టికల్  370  రద్దు వల్లే  కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని ఆమె  చెప్పారు. కాశ్మీర్ పండితులకు  కాశ్మీర్ మహిళలకు జరిగిన అన్యాయం రాహుల్ కు కన్పించలేదా అని ఆమె  ప్రశ్నించారు.మణిపూర్  ఘటనపై  ఇవాళ  సీబీఐ విచారణ ప్రారంభించిందన్నారు. రాజస్థాన్ లో  ఓ బాలికను గ్యాంగ్ రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికేసిన విషయాన్ని  ఆమె ప్రస్తావించారు.మణిపూర్ లో  శాంతికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 
 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?