
కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితా నుంచి తప్పుకున్న శశిథరూర్ వచ్చే నెలలో జరిగే గుజరాత్ ఎన్నికల కోసం ప్రచారానికి కూడా దూరంగా ఉండనున్నారు. ఆ రాష్ట్రంలో ప్రచారం చేయాలని శశి థరూర్ ను కాంగ్రెస్ విద్యార్థి సంఘం ఆహ్వానించింది. కానీ ఆయన జాబితాలో లేనందున ఆయన తప్పుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయని ‘ఎన్డీటీవీ’ కథనం పేర్కొంది.
భారత్ జోడో యాత్ర ప్రభావంతో ప్రధాని ఇక ‘టోపీ’ ధరిస్తారు - కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్
గత నెలలో నిర్వహించిన కాంగ్రెస్ అధ్యక్ష పదవికి శశి థరూర్ పోటీ చేశారు. అయితే సోనియా గాంధీ కుటుంబం మద్దతుతో పోటీలో నిలిచిన మల్లికార్జున్ ఖర్గే చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయనకు, కాంగ్రెస్ అధినాయకత్వంతో కొంత విభేదాలు వచ్చాయని పలు కథనాలు వెలువడ్డాయి. దీనిని ఆయన బహిరంగంగా ఖండించినా.. ఇప్పటికీ కాంగ్రెస్ తో ఆయనకు కొంత తత్సంబంధాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది.
కాగా.. తిరువనంతపురం నుంచి ఎంపీగా ఉన్న థరూర్.. గతంలో ఎప్పుడూ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో లేరని పార్టీ వర్గాలు తెలిపాయి. థరూర్ చివరిసారిగా 2021లో తన సొంత రాష్ట్రమైన కేరళలో స్టార్ క్యాంపెయిన్ గానే ఉన్నారు. ఇదిలా ఉండగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ తరుఫున స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో పార్టీ కొత్త చీఫ్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కాంగ్రెస్ పాలిత రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేష్ బాఘేల్, అలాగే కేరళ నాయకులు రమేష్ చెన్నితాల, మాజీ ముఖ్యమంత్రులు దిగ్విజయ్ సింగ్, కమల్ నాథ్, భూపిందర్ సింగ్ హుడా, అశోక్ చవాన్ తో పాటు మొత్తంగా 40 మంది పేర్లు ఉన్నాయి.
డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ సైంటిస్ట్ పదవికి భారత్ కు చెందిన సౌమ్య స్వామినాథన్ రాజీనామా
పార్టీ భారత్ జోడో యాత్రకు నాయకత్వం వహిస్తున్న రాహుల్ గాంధీ నవంబర్ 12న ఓటు వేసిన గుజరాత్ లేదా హిమాచల్ ప్రదేశ్లో ఇప్పటి వరకు ప్రచారం చేయలేదు. 27 ఏళ్లుగా బీజేపీ అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రచారం ఇప్పటి వరకు అంతంతమాత్రంగానే ఉంది. అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాష్ట్రంలో బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా కాంగ్రెస్ ను భర్తీ చేయడానికి ప్రయత్నించాలని దూకుడుగా ప్రచారం చేసింది.
కుక్క కరిచిన మహిళకు రూ. 2 లక్షల పరిహారం.. ఆ జాతుల కుక్కలపై నిషేధం..
ఈ రాష్ట్రంలో ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అందుకే ఆ రెండు పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. అయితే బీజేపీ కూడా మరో సారి అధికారాన్ని నిలుపుకోవాలని ప్రయత్నిస్తోంది. ఈ రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా 2001 నుండి 2014 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ఆ తర్వాత ఆయన దేశానికి ప్రధాని అయ్యారు.