నేను క్రిస్టియన్ ను.. జెండా ఎగరేయను, నమస్కరించను.. వివాదాస్పదమవుతున్న హెడ్మాస్టర్ వ్యవహారం..

By Bukka SumabalaFirst Published Aug 18, 2022, 10:42 AM IST
Highlights

తాను క్రిస్టియన్‌ అని, మత విశ్వాసాల ప్రకారం జెండాకు వందనం చేయడం కుదరదని ఓ స్కూల్ ప్రిన్సిపాల్‌ త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించారు. దీంతో ఈ వ్యవహారంపై విద్యాశాఖ విచారణకు ఆదేశించింది. 

తమిళనాడు : కులమతాలకతీతంగా.. విశ్వాసాలు, నమ్మకాలకు విరుద్ధంగా ఏ దేశస్తుడైనా సరే తమ దేశ జాతీయ జెండాను గౌరవిస్తారు. గౌరవించాలి కూడా. ఇక లౌకిక దేశమైన భారత్ లో జెండాను అత్యున్నత గౌరవస్తానం ఉంది. జెండాను ఎగురేయడం ఎంతో గౌరవసూచకం.. కానీ జెండాకు మతం రంగు పులిమితే... భారత దేశ మతతత్వలౌకిక భావనా స్పూర్తికే అది గొడ్డలిపెట్టు. అలాంటి పనే చేసింది..ఓ ప్రధానోపాధ్యాయురాలు. దీంతో ఇప్పుడు ఈ విషయం మీద నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. 

Tamil Naduలోని ధర్మపురి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి జెండా వందనం చేసేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించారు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ తాను క్రిస్టియన్ నని, తమ మత విశ్వాసం ప్రకారం, జెండా వందనం అనుమతించబడదని చెప్పి త్రివర్ణ పతాకానికి వందనం చేయడానికి నిరాకరించింది. దీంతో వ్యవహారం విద్యాశాఖ వరకు వెళ్లింది. విద్యాశాఖ ముఖ్య అధికారి దీనిపై విచారణకు ఆదేశించారు.

జాతీయ జెండాకు అవమానం.. లక్షద్వీప్ బీజేపీ నేతకు నోటీసులు..

ధర్మపురి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ తమిళసెల్వి. ఆమె ఈ ఏడాది పదవీ విరమణ చేయనున్నారు. ఆమెను సన్మానించడానికి స్టాఫ్ అంతా కలిసి ఆగస్టు 15 సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమయంలోనే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడానికి ప్రధానోపాధ్యాయురాలు నిరాకరించింది. దీంతో అసిస్టెంట్ హెడ్మాస్టర్ జెండాను ఎగురవేసినట్లు సంబంధిత వర్గాలు ధృవీకరించాయి. దీనిమీద ఆమె వాదిస్తూ.. తన మత విశ్వాసాలు  అలా చేయడానికి తనను అనుమతించవని చెప్పుకొచ్చింది. గతంలో కూడా తమిళ్‌సెల్వి జాతీయ జెండాను ఎగురవేసేందుకు, త్రివర్ణ పతాకానికి వందనం చేసేందుకు నిరాకరించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 

తమిళసెల్వి రికార్డెడ్ వీడియోలో తాను క్రిస్టియన్ మతానికి చెందినదానినని వాదించింది. తమ జాతీయ జెండాను ఎగురవేయకపోయినా, వందనం చేయకపోయినా అగౌరవ పరిచినట్టు కాదని  వాదించింది. "మేము దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం, మరెవరికీ కాదు. జెండాను గౌరవిస్తాం.. కాని దేవుడికి మాత్రమే నమస్కరిస్తాం" అని వాదించింది. దీంతో అగ్గిరాజుకుంది. విషయం ధర్మపురి చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ (సీఈవో)కి ఫిర్యాదు చేశారు. దీంతో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేసేందుకు ప్రిన్సిపాల్ నిరాకరించిన ఘటన వెలుగులోకి వచ్చింది. గతంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు సెలవు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇది మాత్రమే కాదు, గత కొన్నేళ్లుగా, ఆమె అనారోగ్యం సాకుతో ఇలాంటి కార్యక్రమాల సమయంలో పాఠశాలకు రాలేదని చెబుతున్నారు. 

click me!