చీర కట్టి... ఫుట్ బాల్ అదరగొట్టిన మహిళా ఎంపీ...!

Published : Aug 18, 2022, 10:31 AM IST
  చీర కట్టి... ఫుట్ బాల్ అదరగొట్టిన మహిళా ఎంపీ...!

సారాంశం

ఓ చేత్తో చీర పట్టుకొని కాలితో ఫుట్ బాల్ ఆడుతున్న  ఫోటోలను ఎంపీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఖేలా హోబ్ డిబాస్ కోసం కికింగ్ ఇట్ ఆఫ్’’ అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేయడం గమనార్హం.

ఓ మహిళా ఎంపీ.. ఫుట్ బాల్ అదరగొట్టారు. అది కూడా చీర కట్టుకొని.. పురుషులతో సమానంగా ఆడి.. అందరిచేతా అదరహో అనిపించుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను స్వయంగా ఆ మహిళా ఎంపీనే షేర్ చేయడం గమనార్హం. అది మరెవరో కాదు.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యురాలు మహువా మొయిత్రా.

మహువా మొయిత్రా చీర కట్టుకొని ఫుట్ బాల్ ఆడుతున్న ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.ఓ చేత్తో చీర పట్టుకొని కాలితో ఫుట్ బాల్ ఆడుతున్న  ఫోటోలను ఎంపీ తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘ఖేలా హోబ్ డిబాస్ కోసం కికింగ్ ఇట్ ఆఫ్’’ అనే క్యాప్షన్ తో ఫోటోలను షేర్ చేయడం గమనార్హం.

 

ఆగస్టు 16వతేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ‘ఖేలా హోబే దివస్’ పాటించాలని సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ మహువా పాల్గొని సందడి చేశారు. ఆమె ఆట తీరుకు నెటిజన్లు కూడా ఫిదా అయ్యారు. మీరు సూపర్ మేడమ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !