జమ్మూలో పాకిస్తాన్ డ్రోన్ కలకలం: ఆయుధాలు, స్వాధీనం

By narsimha lodeFirst Published Aug 18, 2022, 10:16 AM IST
Highlights

జమ్మూ కాశ్మీర్ లో పాకిస్తాన్ డ్రోన్ కలకలం సృష్టించింది. ఈ డ్రోన్ ను సరిహద్దుల్లో జారవిడిచిన విషయాన్ని గుర్తించిన భద్రతా సిబ్బంది డ్రోన్ లోని ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని సీజ్ చేశారు.

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్ లోని ఇండియా, పాకిస్తాన్ సరిహద్దుల్లో డ్రోన్ కలకలం సృష్టించింది. గురువారం నాడు జమ్మూ కాశ్మీర్ లోని  తోఫ్ గ్రామంలో పాకిస్తాన్ కు చెందిన డ్రోన్  నుండి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని జారవిడిచినట్టుగా పోలీసులు తెలిపారు. 

ఈ ఏడాది ఫిబ్రవరి 24న ఆర్నియా పోలీస్ స్టేషన్ లో ఇదే తరహాలో డ్రోన్ లో  ఆయుధాలు, మందుగుండు జారవిడిచిన ఘటనపై కేసు నమోదైంది. 

మహ్మద్ అలీ హుస్సేన్ అలియాస్ ఖాసీం డ్రోన్ బిగింపులో కీలక పాత్ర పోషించారని పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్టుగా పోలీసులు తెలిపారు.

డ్రోన్ ద్వారా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి జారవిడిచిన కేసులో నిందితుడు తన నేరాన్ని ఒప్పుకున్నట్టుగా పోలీసులు తెలిపారు  డ్రోన్ ద్వారా వచ్చిన ఆయుధాలు, మందు గుండు సామాగ్రిని వేర్వేరు ప్రాంతాల్లో దాచాడని  పోలీసులు వెల్లడించారు. నిందితుడు చెప్పిన ప్రకారంగా పోలీసులు రెండు ప్రదేశాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. 

ఫలియన్ మండల్ ప్రాంతంలోని తోఫ్ గ్రామంలో మొదటి స్థానంలో ఆయుధాలు, మందుగుంండు సామాగ్రి లభ్యం కాలేదని అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ చెప్పారు. అయితే రెండో ప్రదేశంలో పేలుడు పదార్ధాల ప్యాకెట్ లభ్యమైందన్నారు. ఈ సమయంలో నిందితుడు పోలీస్ అధికారిపై దాడి చేసి అతడి వద్ద నుండి రైఫిల్ లాక్కొని తప్పించుకొనే ప్రయత్నించారని ఆయన వివరించారు. ఈ సమయంలో పోలీసులు చాకచక్యంతో వ్యవహరించడంతో ఉగ్రవాదికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్టుగా ఆయన చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉగ్రవాది మరణించాడన్నారు. డ్రోన్ నుండి లభ్యమైన ప్యాకెట్ ను బాంబు డిస్పోజల్ టీమ్ పరిశీలించింది. డ్రోన్ నుండి ఏకే 47 రైఫిల్, మాగజైన్లు, 40 ఏకే రౌండ్లు, స్టార్ ఫిస్టల్ రౌండ్లు, చైనా చిన్న గ్రనైడ్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగిస్తున్నామని పోలీసులు ప్రకటించారు. 

click me!