నీట్ పీజీ కౌన్సిలింగ్‌కి 'సుప్రీం' అనుమతి: ఓబీసీ, ఈడబ్ల్యుఎస్‌ల రిజర్వేషన్ల‌కు ఓకే

By narsimha lodeFirst Published Jan 7, 2022, 11:20 AM IST
Highlights

ప్రస్తుతమున్న రిజర్వేషన్ నిబంధనల మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి నీట్ పీజీ కౌన్సిలింగ్ ను పున: ప్రారంభించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నాడు అనుమతిని ఇచ్చింది.
 

న్యూఢిల్లీ: ప్రస్తుతమున్న రిజర్వేషన్ నిబంధనల మేరకు 2021-22 విద్యా సంవత్సరానికి Neet  పీజీ, యూజీ కోర్సుల కౌన్సిలింగ్ ను పున: ప్రారంభించేందుకు Supreme court శుక్రవారం నాడు  అనుమతించింది. Obcకు 27 శాతం, ఈడబ్ల్యుఎస్‌లకు 10 శాతం  Reservation  కోటాను సమర్ధించింది.  Ewsపై పాండే కమిటీ నిర్ధేశించిన ప్రమాణాల చెల్లుబాటును పరిశీలించాలని కూడా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ విషయమై దాఖలైన పిటిషన్ల జాబితాపై ఈ ఏడాది మార్చిలో విచారణ నిర్వహించనుంది సుప్రీంకోర్టు.

సుప్రీంకోర్టు జస్టిస్ డీవై చంద్రచూడ్,జస్టిస్ ఏఎస్ బోపన్నలతో కూడి ధర్మాసనం రెండు రోజుల పాటు విస్తృత వాదనలు వింది. ఈ వాదనలు విన్న తర్వాత శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేసింది.

ఈడబ్ల్యుఎస్‌ లబ్దిదారులను గుర్తించేందుకు రూ.8 లక్షల వార్షికాదాయం  ఉన్న వారికి ఏడాదికి అనుమతించింది ఉన్నత న్యాయస్థానం.ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ , గుర్తింపు ప్రమాణాలపై వివరణాత్మక విచారణ జరగనుంది. ఈ ఆడ్మిషన్లు సుప్రీంకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటాయి. గత వారం జరిగిన విచారణతో పాటు గతంలో జరిగిన విచారణలో ఈడబ్ల్యుఎస్ లబ్దిదారులను గుర్తించడానికి ఇప్పటికే ఉన్న ప్రమాణాలను ఈ విద్యా సంవత్సరంలో కూడా కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.

నీట్ ఆడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ సాగుతున్న సమయంలో నిబంధనలను మార్చడం సంక్లిష్టతలకు దారి తీస్తోందని కేంద్రం ఉన్నత న్యాయస్థానానికి తెలిపింది. సవరించిన నిబంధనలను వచ్చే ఏడాది నుండి వర్తింపజేయవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఈడబ్ల్యుఎస్ కింద లబ్దిదారుల విషయంలో కేంద్రం కొన్ని సవరణలను తీసుకొచ్చింది. ఏటా రూ. 8 లక్షల వార్షికాదాయాన్ని పేర్కొంది., అయితే ఆదాయంతో సంబంధం లేకుండా ఐదు ఎకరాల భూమి అంతకంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలను మినహాయించింది. 

ఈడబ్ల్యుఎస్ లలో లబ్దిదారులను గుర్తించడానికి ఏటా రూ. 8 లక్షల వార్షికాదాయాన్ని కేంద్రం ప్రాతిపదికగా తీసుకొంది. ఈ మేరకు సుప్రీంకోర్టు అపిడవిట్ జత చేసింది. రూ. 8 లక్షల వార్షికాదాయం ప్రమాణాలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15,16కి అనుగుణంగా ఉందని గతంలో ప్రభుత్వం వాదించింది. అయితే జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఒప్పుకోలేదు. ప్రభుత్వం వద్ద కొంత జనాభా, సామాజిక ఆర్ధిక డేటా ఉండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ డబ్ల్యుఎస్ కోటా సమస్య నీట్ ఆడ్మిషన్లపై ప్రభావం చూపింది. పీజీ ఆడ్మిషన్లలో జాప్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలో జూనియర్ వైద్యులు గత వారంలో ఢిల్లీలో ఆందోళనకు దిగారు. ఆడ్మిషన్ల ప్రక్రియ పూర్తైతే సుమారు 50  వేల మంది ఎంబీబీఎస్ వైద్యులు హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ లోకి వస్తారు. 

నీట్ పీజీ పరీక్ష నోటిపికేషన్ జారీ చేసిన తర్వాత ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లను ప్రవేశపెట్టడం వల్ల నిబంధనలను మార్చినట్టు కాదని కూడా కేంద్రం నిన్ననే సుప్రీంకోర్టుకు తెలిపింది. ఓబీసీ రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్దమనే వాదన చట్టపరంగా సమర్ధనీయం కాదని కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు గురువారం నాడు వాదించారు 

ఈడబ్ల్యుఎస్ కేటగిరి కోసం రూ. 8 లక్సల వార్షికాదాయం ప్రమాణాల ధరఖాస్తును సఃమర్ధిస్తూ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వశాఖ చర్చల తర్వాత ఈ నిర్ణయానికి వచ్చిందని మోహతా చెప్పారు. పరీక్షల్లో అభ్యర్ధుల పనితీరు రిజర్వేషన్ పై ఆధారపడి ఉండదని మెహతా కోర్టుకు తెలిపారు.

click me!