మహారాష్ట్ర టీకా పంపిణీ కార్యక్రమంలోకి సల్మాన్ ఖాన్.. ‘భయాలను పారదోలడానికే’

By telugu teamFirst Published Nov 17, 2021, 4:25 PM IST
Highlights

మహారాష్ట్ర ప్రభుత్వం టీకా పంపిణీ వేగాన్ని పెంచడానికి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొన్ని ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో టీకా పంపిణీ మందగించింది. కొన్ని మతపరమైన సంశయాలతో వ్యాక్సినేషన్ వెనుకపట్టు పట్టి ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మత పెద్దలు, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను ఎంకరేజ్ చేయడానికి రంగంలోకి దింపనున్నట్టు రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపె తెలిపారు. దీంతో వ్యాక్సినేషన్ ఊపందుకుంటుందని అన్నారు.
 

ముంబయి: Maharashtra ప్రభుత్వం Bollywood Star సల్మాన్ ఖాన్ సహాయం తీసుకోబోతున్నట్టు తెలుస్తున్నది. ముస్లిం ప్రాబల్య ప్రాంతాల్లో Vaccine వేసుకోవడంపై సంశయాలు, భయాందోళనలు ఉన్నాయని, వీటిని Salman Khan ఎంకరేజ్‌మెంట్‌తో తొలగించవచ్చు అని ప్రభుత్వం భావిస్తున్నది. టీకా Doseలు తీసుకోవడంపై కొందరు Muslims వెనుకంజ వేస్తున్నారని, అలాంటి వారు సల్మాన్ ఖాన్ ప్రోత్సహంతో టీకా తీసుకునే అవకాశముందని అభిప్రాయపడింది. యాక్టర్లు, మత పెద్దల ప్రభావం ప్రజలపై ఎక్కువగా ఉంటుందని, కాబట్టి, టీకాపై నెలకొన్న సందేహాలను, భయాలను వీరి ద్వారా తొలగించి వారిలో అవగాహన కల్పించాలనే నిర్ణయం తీసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

ఇప్పటికీ ముస్లిం ప్రాబల్య కొన్ని ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీ మందగమనంతో సాగుతున్నదని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపె తెలిపారు. అందుకే వారిలోని సంశయాలను తొలగించడానికి, కరోనా టీకాలపై నమ్మకం పెంచడానికి, అవగాహన కల్పించడానికి తాము బాలీవుడ్ యాక్టర్ సల్మాన్, మత పెద్దలను ఆసరగా తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొన్ని ప్రాంతాల్లో టీకా పంపిణీ నెమ్మదిగా సాగుతున్నదని చెబుతూ.. సినిమా నటులు, మత పెద్దలతో వ్యాక్సినేషన్ వేగం పెరుగుతుందని విశ్వసిస్తున్నట్టు తెలిపారు.

Also Read: 18 నెలల తర్వాత టూరిస్టులకు మళ్లీ గ్రీన్ సిగ్నల్.. 99 దేశాల పర్యాటకులకు క్వారంటైన్ అక్కర్లేదు

ముంబయి మేయర్ కిషోరి పెడ్నేకర్ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. టీకా పంపిణీ ఎప్పుడు జరిగినా.. ముస్లిం కమ్యూనిటీలో మతపరమైన సంశయాలు పెల్లుబికి వస్తాయని వివరించారు. మత పరమైన నమ్మకాలు, అవాంతరాల కారణంగానే కొన్ని సార్లు టీకా పంపిణీ మందగిస్తుందని అన్నారు. కానీ, సల్మాన్ ఖాన్ వంటి యాక్టర్లు వారిని ప్రోత్సహిస్తే వారు.. తప్పకుండా టీకా వేసుకుంటారనే నమ్మకం తనకు ఉన్నదని వివరించారు.

వీరిద్దరు వ్యాఖ్యలతో మహారాష్ట్ర టీకా పంపిణీ కార్యక్రమంలోకి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ రావడం దాదాపు ఖాయమైపోతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. తెర మీద కండలు, దేహదారుఢ్యాన్ని ప్రదర్శించే సల్మాన్ ఖాన్ ఇంపాక్ట్ ఎలా ఉంటుందోనని కొందరు చర్చిస్తున్నారు.

Also Read: కొవాగ్జిన్ మూడో దశ ఫలితాలు ప్రచురించిన లాన్సెట్.. డెల్టా వేరియంట్‌పై సామర్థ్యం ఎంతంటే?

మహారాష్ట్రలో ఇప్పటి వరకు 10.25 కోట్ల టీకా డోసులను పంపిణీ చేశామని రాష్ట్ర మంత్రి రాజేశ్ తోపె అన్నారు. నవంబర్ చివరి కల్లా అర్హులైన ప్రతి ఒక్కరూ కనీసం సింగిల్ డోస్ తీసుకుని ఉంటారని తెలిపారు. కాగా, ఆయన థర్డ్ వేవ్‌పై మాట్లాడారు. నిపుణుల ప్రకారం, ఒక మహమ్మారికి ఏడు నెలల చక్రం ఉంటుందని, ఆరేడు నెలలకు ఒక సారి మళ్లీ విజృంభించే అవకాశం ఉంటుందని తెలిపారు. కానీ, ఇప్పుడు టీకా పంపిణీ మెజార్టీ ప్రజలకు చేరినందున తదుపరి వేవ్ వచ్చినప్పటికీ తీవ్రంగా ఉండదనే అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అయితే, టీకా తీసుకున్నా.. కరోనా ముందు జాగ్రత్తలు తప్పనిసరిగా అందరూ పాటించాలని సూచించారు. అందరూ వీలైనంత త్వరగా టీకాలు వేసుకోవాలని అన్నారు. 

ముంబయి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఫస్ట్ డోసు ఇవ్వడం గతవారం పూర్తి చేసింది. జనాభా లెక్కలు, అర్హులైన ప్రజల సంఖ్య ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం టీకా పంపిణీ టార్గెట్‌లను స్థానిక సంస్థలకు విదిస్తున్నది.

click me!