Acid Attack : పెళ్లి చేసుకోవాలని 3 పిల్లల తల్లికి వేధింపులు, వినలేదని చేతులు, కాళ్లు కట్టేసి యాసిడ్ దాడి...

Published : Nov 17, 2021, 03:55 PM IST
Acid Attack : పెళ్లి చేసుకోవాలని 3 పిల్లల తల్లికి వేధింపులు, వినలేదని చేతులు, కాళ్లు కట్టేసి యాసిడ్ దాడి...

సారాంశం

బాధితురాలికి 2011లో వివాహం అయ్యింది. భర్త, ముగ్గురు పిల్లలతో పాటు ఆమె పూఠ్ఖుర్ద్ లో ఉంటోంది. నిందితుడు మోనూ తరచూ ఆమె వెంట పడేవాడు. తనను తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడు. మొదట్లో ఆమె ఆ యువకుని మాటలు పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని వేధింపులు ఎక్కువ కాసాగాయి. దీంతో ఆమె తనకు పెళ్లయ్యిందని, ముగ్గురు పిల్లలున్నారని తనను ఇలా వేదించడం సరికాదని చెప్పింది. 

దేశ రాజధాని ఢిల్లీలో యాసిడ్ బాధితురాలు 12 రోజుల పాటు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చివరి శ్వాస తీసుకుంది. బాధితురాలి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. మహిళ మృతి చెందిన అనంతరం ఆమె భర్త, పిల్లలు శోకసంద్రంలో మునిగిపోయారు. దీంతో వారి ఆరోగ్యం కూడా దిగజారింది. నిందితునికి ఉరిశిక్ష విధించాలని బాధితురాలి భర్త డిమాండ్ చేస్తున్నాడు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నవంబర్ 3న మోంటూ అనే యువకుడు ఈ మహిళ చేతులు కట్టేసి, ఆమె మీద acid attack  చేశాడు. దీంతో తీవ్రంగా గాయపడిన బాధితురాలు అప్పటినుంచి Ram Manohar Lohia ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 

వ్యభిచార బ్రోకర్ల నుంచి రూ. లక్షల్లో లంచం.. ఇద్దరు పోలీసులపై ఫిర్యాదు.. చివరకు ఏం జరిగిందంటే..

దీనికి వెనకున్న కారణాల్లోకి వెడితే.. బాధితురాలికి 2011లో వివాహం అయ్యింది. భర్త, ముగ్గురు పిల్లలతో పాటు ఆమె పూఠ్ఖుర్ద్ లో ఉంటోంది. accussed మోనూ తరచూ ఆమె వెంట పడేవాడు. తనను తనను వివాహం చేసుకోవాలని వేధించేవాడు. మొదట్లో ఆమె ఆ యువకుని మాటలు పట్టించుకోలేదు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అతని వేధింపులు, harrassement ఎక్కువ కాసాగాయి. దీంతో ఆమె తనకు పెళ్లయ్యిందని, three children ఉన్నారని తనను ఇలా వేదించడం సరికాదని చెప్పింది. 

అయితే, కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ కామాంధుడు.. ఏం కాదు.. వారిని వదిలేసి వచ్చేయ్.. నన్ను పెళ్లి చేసుకో అంటూ సతాయించడం మొదలుపెట్టాడు. ఇక ఆమె ఈ వేదింపులు భరించలేక.. ఈ విషయాన్ని భర్తకు తెలిపింది. ఇది విన్న భర్త దిగ్బ్రాంతికి గురయ్యాడు. ఆ యువకుడిని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తున్నాడు. 

72 ఏళ్ల వృద్ధురాలిపై రేప్.. ఇంట్లో బంధించి అఘాయిత్యం

ఇంతలోనే నవంబర్ 3న Montu ఆ మహిళపై దాడి చేశాడు. తన మాట వినడం లేదని, లక్ష్య పెట్టడం లేదని కక్ష పెట్టుకుని దారుణానికి తెగబడ్డాడు. బలవంతంగా చేతులు, కాళ్లు కట్టేసి.. ఆమె మీద యాసిడ్ పోశాడు. అనంతరం నిందితుడు బక్సర్ కు పారిపోయాడు.  

కాగా నిందితుడు ఆ మహిళను పెళ్లి చేసుకోవాలంటే.. husband అడ్డుగా ఉన్నాడని.. ఆమె భర్తను హత్య చేసేందుకు తుపాకీ కూడా కొనుగోలు చేశాడు. నిందితుడిని పోలీసులు బీహార్ లో అరెస్ట్ చేసి, జైలుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. 

PREV
click me!

Recommended Stories

Mumbai Family Death: వీడిన పుచ్చ‌కాయ‌, బిర్యానీ మ‌ర‌ణాల మిస్ట‌రీ.. ఇంత‌కీ వాళ్లు ఎలా చ‌నిపోయారంటే
సీఎం ఎవరు? ఉత్కంఠ రేపుతున్నతమిళ రాజకీయాలు| Tamil Nadu Political Mind Blowing Twist | Asianet Telugu