న్యూఢిల్లీ నివాస భవనంలో అగ్ని ప్రమాదం: నలుగురు మృతి

By narsimha lode  |  First Published Jan 27, 2024, 9:39 AM IST

న్యూఢిల్లీలోని  నివాస భవనంలో  జరిగిన అగ్ని ప్రమాదంలో  నలుగురు మృతి చెందారు. 


న్యూఢిల్లీ: న్యూఢిల్లీలోని శారదా ఏరియాలో  నివాస భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తొమ్మిది మాసాల చిన్నారితో పాటు నలుగురు మృతి చెందారు. పి.సోని, రచన, గౌరి సోని, తొమ్మిది మాసాల రుహి మృతి చెందినట్టుగా పోలీసులు గుర్తించారు.  ఈ అగ్ని ప్రమాదం నుండి  ఇద్దరిని సురక్షితంగా  రక్షించారు. అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం  ఆసుపత్రిలో చేర్పించారు.

రామ్ నగర్ భవనంలో అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎంఎస్ పార్క్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శారదా నగర్ ఏరియాలోని నివాస గృహంలో  అగ్ని ప్రమాదం జరిగిందని  సమాచారం వచ్చిందని    ఢిల్లీలోని  డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్  సురేంద్ర చౌదరి  చెప్పారు. అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారిని  కాపాడినట్టుగా  పోలీసులు తెలిపారు.

Latest Videos

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే  ఎంఎస్ పార్క్ పోలీస్ స్టేషన్  హౌస్ ఆఫీసర్  ఇతర పోలీస్ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో  ముగ్గురిని రక్షించినట్టుగా పోలీసులు తెలిపారు.  

అగ్నిప్రమాద విషయం తెలిసిన వెంటనే  అగ్నిమాపక సిబ్బంది  సంఘటన స్థలానికి  చేరుకున్నారు. మంటలను ఆర్పారు.  ఈ ప్రమాదంలో గాయపడినవారిలో  ఆరుగురిలో  నలుగురు మృతి చెందారు. మరో ఇద్దరు  ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని  అధికారులు తెలిపారు.

గ్రౌండ్ ప్లస్ నాలుగు అంతస్తులు కలిగి ఉంది.  మొదటి అంతస్తులో  ఇంటి యజమాని నివసిస్తున్నాడు. మిగిలిన ఫ్లోర్ లలో గృహాలను అద్దెకు ఇచ్చారు.  ఈ నెల  ఆరంభంలో  వాయువ్య ఢిల్లీలోని పితంపురాలోని బహుళ అంతస్తుల  నివాస భవనంలో  అగ్ని ప్రమాదం సంభవించింది.  ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు.  రూమ్ హీటర్ తో  అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని అప్పట్లో  అనుమానించారు.  డోర్ ఆటోమెటిక్ లాక్ ఓపెన్ కాని కారణంగా అగ్ని ప్రమాదం తర్వాత  ఇంట్లో ఉన్నవారు  తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయిందని అధికారులు నిర్ధారించారు.

click me!