ప్రశాంత కశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిపై యావత్ దేశం స్పందిస్తోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడి వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహించారు. ఇక ఈ దాడిని సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు ఖండిస్తున్నారు. ఇది ముమ్మాటికీ పిరికి పంద చర్య అని, కశ్మీర్‌లో అల్లకల్లోలం సృస్టించేందుకే ఇలాంటి ఇలా చేశారంటూ విమర్శిస్తున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా ఇదే అంశమై ప్రముఖ ఆధ్యాతిక గురువు సద్గురు స్పందించారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడిని ఉద్దేశిస్తూ ఎక్స్ పవేదికగా ఓ సుదీర్ఘ పోస్ట చేశారు. సద్గురు పోస్టులో ఏముందుంటే.. ఉగ్రవాదం లక్ష్యం యుద్ధం చేయడం కాదు. సమాజాన్ని భయంతో కదలకుండా చేయడమే వారి అసలైన ఉద్దేశం. ప్రజల్లో భయాన్ని నింపడం, సమాజాన్ని విభజించడం, దేశ ఆర్థిక వృద్ధిని తారుమారు చేయడం, అన్ని స్థాయిల్లో అశాంతిని కలిగించడం ఉగ్రవాదం వెనక ఉన్న దురుద్దేశాలు.
మన దేశపు సార్వభౌమాధికారం (సార్వభౌమత్వం)ను కాపాడాలంటే, ఇలాంటి శక్తులను కచ్చితంగా ఎదురించాల్సి అవసరం ఉంది. దీని కోసం కేవలం తాత్కాలిక పరిష్కారాలు కాదు, దీర్ఘకాలిక మార్గాలు కూడా అవసరం అందరికీ సమాన విద్యావకాశాలు, ఉపాధి అవకాశాలు, సంపద పంపిణీ, సంక్షేమ కార్యక్రమాలు అందుబాటులో ఉండాలి అని రాసుకొచ్చారు.
The purpose of terrorism is not war but to cripple a society with fear. The aim is to spread panic, divide the society, derail the economic growth of the country and create lawlessness at every level. If we want to preserve and nurture the sovereignty of this nation, these… pic.twitter.com/donUxnm8xT
— Sadhguru (@SadhguruJV)
ప్రస్తుతం మనం చేయాల్సింది ఒక్కటే మతం, కులం, ప్రాంతం, రాజకీయ వర్గీకరణలు అన్నీ మరిచిపోయి ఒకటిగా నిలబడాలి. మన దేశ భద్రతా దళాలకు అన్ని విధాలుగా మద్దతుగా ఉండాలి. వారే మన రక్షకులు. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు మన ప్రగాఢ సానుభూతి. గాయపడినవారికి మన ఆశీస్సులు, వారు త్వరగా కోలుకోవాలి అనే మన మనస్ఫూర్తి ఆకాంక్షిస్తున్నాను అంటూ సద్గురు రాసుకొచ్చారు.